E-Paper
Advertisement

కాంట్రాక్ట్ కిల్లర్ల గ్యాంగ్‌లో వరుస హత్యలు… అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? హై టెన్షన్ క్రైమ్ థ్రిల్లర్

కాంట్రాక్ట్ కిల్లర్ల గ్యాంగ్‌లో వరుస హత్యలు… అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? హై టెన్షన్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller: ఒక గ్యాంగ్‌లో ఉన్న కాంట్రాక్ట్ కిల్లర్లు ఒక్కొక్కరుగా హత్యకు గురవుతుంటారు. తమలోనే ఎవరో ఒకరు శత్రువుగా మారారని అనుమానం మొదలవుతుంది వాళ్ళకి. చివరికి అందరినీ ఒకే చోటికి పిలిచి భారీ స్కెచ్ వేస్తే.. అక్కడే ఊహించని రక్తపాతం జరుగుతుంది. ఈ హత్యల వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఎవరు? అనే ఆసక్తిని చివరి వరకు కొనసాగించే తమిళ క్రైమ్ థ్రిల్లర్ ‘Quotation Gang Part 1’. వివేక్ కుమార్ కన్నన్ తెరకెక్కించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీ లియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2024లో విడుదలైన ఈ మూవీకి యాక్షన్‌తో పాటు మిస్టరీ, క్రైమ్ అంశాలు కూడా ఉన్నాయి.

కథలోకి వెళ్తే…

ముంబై సమీపంలోని అడవుల నేపథ్యంలో ముస్తఫా నేతృత్వంలో ఒక దయదాక్షిణ్యాలు లేని కాంట్రాక్ట్ కిల్లర్ల గ్యాంగ్ నడుస్తుంటుంది. అతడి భార్య పద్మ పద్ధతిగా కనిపించినా, ఆ గ్యాంగ్‌లోని ప్రతి ఒక్కరి వెనకాల ఒక చీకటి కథ ఉంటుంది. ఈ గ్యాంగ్‌లో శకుంతల అనే ఒక ధైర్యవంతురాలైన కీలక సభ్యురాలు డ్రగ్ పెడ్లర్ల బారి నుంచి ఇరా అనే ఒక టీనేజ్ అమ్మాయిని కాపాడుతుంది. మరోవైపు, కశ్మీర్ నుంచి శకుంతల సోదరి సీరత్ తన ప్రేయసి రుబీనాతో కలిసి తిరిగి వస్తుంది. తనకు జరిగిన పాత అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న తర్వాత ఆమె కూడా ఈ కాంట్రాక్ట్ కిల్లర్ల గ్యాంగ్ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది.

Advertisement

ఇలా సాగిపోతున్న సమయంలో ముస్తఫా గ్యాంగ్‌లోని కీలక సభ్యులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద పరిస్థితుల్లో అత్యంత దారుణంగా హత్యకు గురవుతుంటారు. దాంతో ఆ గ్యాంగ్‌లో తీవ్రమైన భయం, కలకలం మొదలవుతాయి. అసలు తమ మనుషులనే టార్గెట్ చేసి వరుసగా చంపుతున్నది ఎవరు? గ్యాంగ్‌లోనే ఎవరైనా ద్రోహి ఉన్నాడా లేక బయట నుంచి శత్రువులు ఎవరైనా ఈ ముఠాను అంతం చేయడానికి ప్లాన్ చేశారా? అనే సందేహాలు అందరిలోనూ మొదలవుతాయి.

పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడంతో ముస్తఫా ఒక నిర్ణయానికి వస్తాడు. అనుమానాలు తీర్చుకోవడానికి, ద్రోహి ఎవరో తేల్చడానికి గ్యాంగ్‌లోని కాంట్రాక్ట్ కిల్లర్లందరినీ ఒకే చోటికి పిలిచి భారీ విందు ఏర్పాటు చేస్తాడు. అయితే అక్కడికి అందరూ వచ్చిన తర్వాత అనూహ్యంగా ఒక దాడుల పర్వం మొదలై పెద్ద రక్తపాతమే జరుగుతుంది. చివరలో ఈ హత్యలన్నింటి వెనుక ఉన్న అసలైన మాస్టర్‌మైండ్ ఎవరు అనేది బయటపడే ట్విస్ట్‌తో ఈ కథ ముగుస్తుంది.

ETV Winలో స్ట్రీమింగ్ 

Advertisement

వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. జాకీ ష్రాఫ్ ముస్తఫాగా, ప్రియమణి శకుంతలగా, సన్నీ లియోన్ పద్మగా, సారా అర్జున్ ఇరాగా నటించారు. సినిమా నిడివి సుమారు 1 గంట 58 నిమిషాలు. ‘Quotation Gang Part 1’ ప్రస్తుతం ETV Winలో అందుబాటులో ఉంది. కాంట్రాక్ట్ కిల్లర్ల బ్యాక్‌డ్రాప్, వరుస హత్యలు, గ్యాంగ్‌లో అనుమానాలు, చివర్లో వచ్చే ట్విస్ట్‌తో సాగే క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా ఓసారి ట్రై చేయొచ్చు.

Read Also: ఉద్యోగం కోసం ఇరాక్‌కు వెళ్లిన అమ్మాయి… ఊహించని పరిస్థితుల్లో ఉగ్రవాదుల చెరలో… నరాలు కట్టయ్యే సర్వైవల్ థ్రిల్లర్

Tags

Related News

అమ్మాయిలతో ప్రతీ రాత్రి ఆ పని… ఆ గోడల మధ్య దాగున్న భయంకరమైన రహస్యం… డార్క్ డిస్టోపియన్ థ్రిల్లర్

తండ్రే హత్య చేశాడని అనుమానం… షాకింగ్ మర్డర్ మిస్టరీ

చనిపోయినా ఇంటి నుంచి కదలని శవం… వణుకు పుట్టించే హారర్ మిస్టరీ

నోట్‌బుక్ నుంచి మనుషులు బయటకొస్తే… పుస్తకం చేతులు మారడంతో మొదలయ్యే గందరగోళం…

ఉద్యోగం కోసం ఇరాక్‌కు వెళ్లిన అమ్మాయి… ఊహించని పరిస్థితుల్లో ఉగ్రవాదుల చెరలో… నరాలు కట్టయ్యే సర్వైవల్ థ్రిల్లర్

25 ఏళ్లుగా పిచ్చి పనులతో నవ్వించిన గ్యాంగ్… ఈసారి చేసే రచ్చే చివరిదా?

60 ఏళ్ల వయసులో తన చిన్ననాటి రూపమే ఎదురైతే… గత జ్ఞాపకాలతో మొదలయ్యే అద్భుత ప్రయాణం… ఎమోషనల్ ఫాంటసీ యానిమేషన్

Big Stories

Advertisement
×