OTT Movie : బోస్టన్‌లో ఒక రోజు రాత్రి డిటెక్టివ్ నిక్ వాకర్ తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం, అతని మరణానికి దారితీస్తుంది. ఇక ఈ మరణం తర్వాత, అతను ఒక వింత ప్రపంచంలో మేల్కొంటాడు. అక్కడ ఒక సూపర్‌నాచురల్ పోలీసు డిపార్ట్‌మెంట్ ఉంటుంది. ఇది భూమిపై దాక్కున్న చనిపోయిన నేరస్థులను పట్టుకుంటుంది. నిక్‌కు ఒక విచిత్రమైన పాతకాలపు షెరీఫ్ రాయ్ పల్సిఫర్ పార్టనర్‌గా జతకడతాడు. అయితే కొన్ని సంఘటనలు నిక్ ను ప్రమాదంలోకి నెట్టివేస్తాయి. ఈ చనిపోయిన ఆటలో నిక్ ఎలా గెలుస్తాడు? అతని గతం నుండి వచ్చిన దెయ్యాలు అతన్ని ఎలా వెంటాడతాయి? ఈ ఆత్మలతో నిండిన ప్రయాణం ఎక్కడ ముగుస్తుంది? ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ?అనే వివరాలు తెలుసుకుందాం ..
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ బోస్టన్ పోలీసు డిటెక్టివ్ నిక్ వాకర్‌తో మొదలవుతుంది. అతను తన పార్టనర్ బాబీ హేస్‌తో కలిసి ఒక డ్రగ్ బస్ట్ ఆపరేషన్‌లో ఉంటాడు. ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్న బంగారంను దాచే క్రమంలో అతను ఒక ఫైర్‌ఫైట్‌లో చనిపోతాడు. తన మరణం తర్వాత నిక్‌ను Rest In Peace Department (R.I.P.D.)లోకి రిక్రూట్ చేస్తారు. ఇది ఒక సూపర్‌నాచురల్ ఏజెన్సీ. చనిపోయిన నేరస్థులను భూమిపై హాని చేయకుండా పట్టుకుని, ఈ ఆత్మలను తీర్పు కోసం పంపే బాధ్యతను నిక్ కు ఇస్తారు. నిక్‌కు తన సర్వీస్‌కు బదులుగా స్వర్గంలో చోటు ఇవ్వబడుతుంది. ఇప్పుడు నిక్‌కు పార్టనర్‌గా రాయ్ పల్సిఫర్, 1800ల నాటి వైల్డ్ వెస్ట్ షెరీఫ్ జతకడతాడు. రాయ్ మొండి స్వభావం వల్ల నిక్ కి సమస్యలు వస్తుంటాయి. R.I.P.D. ఏజెంట్లు భూమిపై అవతార్ రూపాల్లో కనిపిస్తారు.
నిక్, రాయ్ వీళ్ళ మొదటి మిషన్‌లో భాగంగా ఒక డీడోను పట్టుకుంటారు. ఈ క్రమంలో భూమిని నాశనం చేసే ఒక పెద్ద కుట్రను కూడా వీళ్ళు కనిపెడతారు. మరో వైపు నిక్ తన తన మరణం వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెడతాడు. అతను తన భార్య జూలియాతో తిరిగి కనెక్ట్ అవ్వాలనే ఆశతో ఉంటాడు. కానీ R.I.P.D. నిబంధనలు దీన్ని నిషేధిస్తాయి. చివరికి నిక్ యొక్క మరణం వెనుక రహస్యం ఏమిటి ? నిక్ తన భార్య జూలియాతో తిరిగి కనెక్ట్ అవ్వగలడా ? ఈ ఆత్మల వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? అనే వివరాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : భార్య మరణానికి ప్రతీకారం … సీక్రెట్ మిషన్ లో CIA ఏజెంట్ … జేమ్స్ బాండ్ సినిమా రేంజ్ లో యాక్షన్ సీన్స్
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ పేరు ‘R.I.P.D’ 2013 లో వచ్చిన ఈ సినిమాకు రాబర్ట్ ష్వెంట్కే దర్శకత్వం వహించారు. ఇందులో ర్యాన్ రేనాల్డ్స్, జెఫ్ బ్రిడ్జెస్, కెవిన్ బేకన్, మేరీ పార్కర్ ,స్టెఫానీ జోస్టాక్, జేమ్స్ హాంగ్ వంటి నటులు నటించారు. Netflix లో ఈ మూవీ అందుబాటులో ఉంది.