OTT Movie : సింగిల్-ఆర్టిస్ట్ స్టోరీతో ఓ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నందితా శ్వేతా నటించిన ఈ నిమా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో తెరకెక్కింది. కొత్తగా పెళ్ళైన మహిళ తన భర్తని కలవడానికి ఎదురుచూసే సమయంలో ఈ స్టోరీ నడుస్తుంది. సినిమా మొత్తం ఒకే పాత్ర ఉంటుంది. అయితే నందితా శ్వేతా అంద చందాలు, హావభావాలు ఈ సినిమాని ముందుకు నడిపిస్తాయి. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో ఈ సినిమా మెప్పించింది. ఈ సినిమా పేరు ? స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
ఎందులో ఉందంటే
‘రా రా పెనిమిటి’ (Raaraa penimiti) 2023లో విడుదలైన తెలుగు రొమాంటిక్ చిత్రం. ఇది సత్య వెంకట్ దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాలో కథానాయికగా నందితా శ్వేతా పాత్ర ఒక్కటే ఉంటుంది. 2023 ఏప్రిల్ 28 న ఈ సినిమా IMDbలో ఈ చిత్రానికి 6.4/10 రేటింగ్ ఉన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, హంగామా ప్లే ప్లాట్ ఫామ్‌లలో అందుబాటులో ఉంది. నందితా శ్వేతా సింగిల్ పాత్ర ఉండే ఈ సినిమా యూట్యూబ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. నిఖిల్ నటించిన ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ తో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆతరువాత తనకు వచ్చిన అవకాశాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.
స్టోరీలోకి వెళ్తే
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో, కొత్తగా పెళ్ళయిన ఒక స్త్రీ (నందితా శ్వేతా) తన భర్తతో తిరిగి కలవడానికి ఆశతో ఎదురుచూస్తూ ఉంటుంది. ఒంటరితనం, ఎమోషన్స్ తో కూడిన జీవితాన్ని గడుపుతుంటుంది. ఆమె భర్త వేరొక ప్రదేశంలో ఉండటం, కోవిడ్ కారణంగా అక్కడే చిక్కుకుపోవడం, ఎప్పుడు వస్తాడో తెలీక ఆమె దిగులుగా ఉంటుంది. ఈ చిత్రం ఆమె రోజువారీ జీవితం, ఆమె భర్తతో గత జ్ఞాపకాలు, కోవిడ్ కారణంగా విధించిన ఆంక్షల మధ్య తిరుగుతుంది. తన భర్తతో ఫోన్ లో మాట్లాడటంతోనే సరిపెట్టుకుంటుంది. అయితే ఆమాటలు ఆమెకు ఉపశమనం ఇస్తుంటాయి. అంతేకాదండోయ్ అలాంటి మాటలతో ఆమెని టెంప్ట్ చేస్తుంటాడు ఈవిడ భర్త గారు.
ఇక ఈ చిత్రం ప్రధానంగా నందితా శ్వేతా చుట్టూ తిరుగుతూ, ఆమె నటన ద్వారా స్టోరీ ముందుకు వెళ్తుంటుంది. కోవిడ్ సమయంలో ఇష్టమైన వాళ్ళు దూరంగా ఉంటే ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఆమె భర్తతో తిరిగి కలవడానికి ఎదురుచూసే ఆమె ప్రయాణం ఒక భావోద్వేగ ముగింపుతో ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ ఆడియన్స్ కి ప్రేమ మీద ఆశ కలిగిస్తుంది. ఈ సింగిల్-ఆర్టిస్ట్ స్టోరీపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
Read Also : స్టార్ హీరో కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు… ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్… ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే ?