OTT Movie : ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్నాయి. ఈ సినిమాలను ఎలాంటి భాషలో వచ్చినా, కంటెంట్ నచ్చితే ఇక వదలకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. అందులోనూ మలయాళం సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలు ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తాయా అని ఎదురుచూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం సినిమా 1990ల నేపథ్యంలో, కేరళలో జరిగిన రెండు పెద్ద నేరాల దర్యాప్తు చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా థ్రిల్లర్‌లకు భిన్నంగా, రియలిస్టిక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్‌ను, ఎమోషనల్ డెప్త్‌తో కలిపి, సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను అందిస్తుంది. బాక్సాఫీస్‌లో కూడా ఈ చిత్రం విజయవంతమైంది. ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
నెట్‌ఫ్లిక్స్‌లో
‘అన్వేషిప్పిన్ కండెతుం’ (Anweshippin Kandethum) డార్విన్ కురియాకోస్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళం పోలీస్ ప్రొసీజరల్ చిత్రం. ఇందులో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించగా, సిద్దీక్, ఇంద్రన్స్, షమ్మీ తిలకన్, బాబురాజ్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో 2024 మార్చి 8 నుండి మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రం 2017 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో “బెస్ట్ కెనడియన్ ఫిల్మ్” అవార్డును గెలుచుకుంది. ఐదు కెనడియన్ స్క్రీన్ అవార్డులకు నామినేట్ అయింది. అందులో “బెస్ట్ మేకప్” అవార్డును కూడా గెలుచుకుంది. ఇది IMDbలో 7.4/10 రేటింగ్ ని పొందింది.
స్టోరీలోకి వెళ్తే
సబ్-ఇన్‌స్పెక్టర్ ఆనంద్ నారాయణన్ (టోవినో థామస్) ఒక నిజాయితీ పోలీసు అధికారి. కొట్టాయం పోలీసు స్టేషన్‌లో కొత్తగా డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఇక మొదట్లోనే అతనికి లవ్లీ మాథన్ అనే క్రిస్టియన్ అమ్మాయి మిస్సింగ్ కేసు తగులుతుంది. ఆనంద్ ఆమె తరచూ వెళ్ళే ప్రదేశాలకు వెళ్ళి విచారణ చేస్తాడు. కానీ స్థానిక క్రిస్టియన్ రాజకీయ ఉద్రిక్తతల వల్ల అతని విచారణకు అడ్డంకులు ఎదురవుతాయి. అతని సీనియర్ అయిన అలెక్స్ అనే ఒక అవినీతి అధికారి, రాజకీయ ఒత్తిడి కారణంగా కేసును తప్పుదారి పట్టిస్తాడు. ఆనంద్‌ను ఈ కేసు నుండి తొలగిస్తాడు. అయినప్పటికీ ఆనంద్ ఈ కేసున రహస్యంగా విచారణ కొనసాగిస్తాడు. ఫోరెన్సిక్ ఆధారాలతో లవ్లీ సోదరి బ్లెస్సీ ఆమె ప్రియుడు డానీ హత్యకు కారణమని కనిపెడతాడు. డానీ, బ్లెస్సీ ల సంబంధం లవ్లీ వల్ల బయట పడుతుందేమోనని, ఆమెను అనుకోకుండా చంపేస్తాడు డానీ. ఆనంద్ కోర్టుకు డానీని తీసుకెళ్తున్నప్పుడు, అతను పారిపోయి రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంటాడు, దీనివల్ల ఆనంద్, అతని అసిస్టంట్స్ సస్పెండ్ అవుతారు.
సస్పెన్షన్ తర్వాత, ఆనంద్‌కు 1983లో జరిగిన శ్రీదేవి హత్య కేసును పరిశోధించే అవకాశం ఇస్తాడు అతని సీనియర్ SP రాజగోపాల్. ఈ కేసు కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి పురోగతి ఉండదు. చెరువల్లి గ్రామస్తులు, గతంలో పోలీసు దౌర్జన్యం వల్ల, విచారణకు సహకరించడానికి నిరాకరిస్తారు. రిటైర్డ్ కానిస్టేబుల్ రవీంద్రన్ నాయర్ మాత్రమే ఆ ఊరిలో వీళ్ళకి సహాయం అందిస్తాడు. ఆనంద్ శ్రీదేవి గర్భవతిగా ఉందని, ఆమెకు ఒక ప్రేమికుడు ఉన్నాడని కనిపెడతాడు. శ్రీదేవి ప్రియుడు సుదీప్, రవీంద్రన్ నాయర్ కొడుకు అని తెలుస్తుంది. నాయర్ కుల భేదాల కారణంగా వారి సంబంధాన్ని వ్యతిరేకించి, శ్రీదేవిని హత్య చేసి ఉంటాడు. ఆనంద్ ఈ నిజాన్ని బయటపెట్టినప్పుడు, నాయర్ సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటాడు. రెండు కేసులను పరిష్కరించినప్పటికీ, ఆనంద్‌కు గుర్తింపు రాకపోయినా, అతను న్యాయం కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తాడు.
Read Also : అమ్మాయిలు కన్పిస్తే చాలు అల్లాడిపోయే ఆటగాడు… కోడల్ని కూడా వదలకుండా… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే