Nindu Noorella Saavasam Serial Today Episode : అంజు కిడ్నాప్ విషయంలో పోలీస్ కేసు పెట్టాలన్న శివరాంతో కేసు వద్దని రణవీర్ చెప్తాడు. దీంతో అమర్ కోపంగా వచ్చి వాళ్ల సంగతి చూస్తానని చెప్తాడు. అయితే వాళ్లను ఎలా పట్టుకోవడం నాన్నా అని అడుగుతాడు శివరాం. దీంతో తెలియదు నాన్నా కానీ వాళ్లను మాత్రం కచ్చితంగా పట్టుకుంటాను. కానీ ఈ సారి ఆటను నేను తిరిగి మొదలు పెడతా..? వాళ్లు ఎవ్వరైనా ఎంత తెలివైన వాళ్లైనా నానుంచి ఈసారి తప్పించుకోలేరు అని చెప్తాడు అమర్.
కిచెన్‌లోకి వెళ్లి పాలు కలుపుతున్న అనామికకు కళ్లు మసకబారతాయి. దీంతో పాలు కింద పోతుంటాయి. ఇంతలో నిర్మల వచ్చి అనామిక ఏం చేస్తున్నావు పాలు అన్ని కింద పోతున్నాయి అని చెప్తుంది. దీంతో అనామిక కంగారుగా నిర్మలను చూస్తుంది. నిర్మల కూడా అనామికకు మసకగా కనబడుతుంది. ఆంటీ చూసుకోలేదు అంటుంది. ఇంతలో నిర్మల అనామిక ఏమైందమ్మా..? ఏంటి అలా చూస్తున్నావు అంటుంది. దీంతో ఏం లేదు ఆంటీ.. అది.. అంటుంటే.. వాటర్ వరల్డ్ లో జరిగిన దానికి బాగా హడలి పోయినట్టు ఉన్నావు కదా.. సరే నువ్వు వెళ్లి కూర్చోపో అంజు పాపకు పాలు నేను ఇస్తానులే అని నిర్మల పాలు తీసుకుంటుంది. అలాగే ఆంటీ అంటూ అనామిక అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. కళ్లు మసకగానే కనిపిస్తుంటాయి.
మెట్ల మీద నుంచి తూలి పడిపోతున్న అనామికను గుప్త వచ్చి పట్టకుంటాడు. గుప్తను చూసి గుప్తగారు అని పలకరిస్తుంది. గుప్త నేనే బాలిక అంటాడు. ఇంతలో అనామిక ఏం జరుగుతుంది గుప్త గారు నా కళ్లు ఎందుకు బ్లర్ గా కనిపిస్తున్నాయి అని అడుగుతుంది. దీంతో గుప్త నువ్వు ఈ లోకం విడిచే సమయం ఆసన్నమైంది బాలిక అని చెప్తాడు. దీంతో షాకింగ్ గా అనామిక ఏం మాట్లాడుతున్నారు గుప్త గారు అని అడుగుతుంది. దీంతో గుప్త పౌర్ణమి రాబోతుంది బాలిక. నువ్వు ఈ బాలిక దేహము నందు ఉండటం వల్లన ముందు దృష్టి తగ్గును.. తదుపరి వినికిడి తగ్గును. అటు పిమ్మట గాత్రము పోవును అని చెప్తాడు. ఇంతలో అనామిక మీరు నాకు కనిపిస్తున్నారు గుప్త గారు.. నాకు మళ్లీ చూపు వచ్చింది అని చెప్తుంది అనామిక.
దీంతో గుప్త నీ ఆత్మ ఈ దేహము నందు ఉండుట వల్లన వచ్చు మార్పులు ఇప్పుడే మొదలైనవి బాలిక. అందులకే నీకు మరలా దృష్టి వచ్చినది. కానీ పౌర్ణమి దగ్గర పడిన కొలది నీ దృష్టి, నీ వినికిడి, నీ గాత్రము శాశ్వతంగా పోవును అని గుప్త చెప్పగానే.. అనామిక కంగారుగా గుప్తు గారు ఏంటి మీరు చెప్తున్నది. నిజమా.. అని అడుగుతుంది. దీంతో గుప్త అవును బాలిక పౌర్ణమి రోజున నువ్వు ఈ దేహమును విడవకున్నచో.. ఈ బాలిక ప్రాణములు పోవును.. నీవు కాపాడిన ప్రాణము పోవుటకు నువ్వే కారణం అయ్యెదవు అని గుప్త చెప్పగానే.. అనామిక భయంగా లేదు గుప్త గారు లేదు.. అలా జరగడానికి వీల్లేదు.. నేను అలా జరగనివ్వను.. నా స్వార్థం కోసం అనామిక భవిష్యత్తును నేను పణంగా పెట్టలేను అంటుంది. అయితే పౌర్ణమికి మునుపే నువ్వు ఈ దేహము విడవవలెను. నువ్వు చేయదలుచుకున్న కార్యములను అంతకు మునుపే ముగించుకొనుము అని చెప్పి గుప్త వెళ్లిపోతాడు.
తర్వాత అమర్, రణవీర్‌తో మాట్లాడుతుంటాడు. మనోహరి వచ్చి చూసి రణవీర్ ఏంటి ఇంకా ఇక్కడి నుంచి వెళ్లలేదు. ఎలాగైనా రణవీర్‌తో మాట్లాడాలి ఎలా..? అని ఆలోచిస్తూ .. ఎస్ ముందు నేను బయటకు వెళ్తాను అప్పుడైనా రణవీర్‌కు అర్థం అవుతుంది అనుకుంటూ.. మనోహరి బయటకు వెళ్లబోతుంటే.. అమర్ గమనించి మనోహరిని దగ్గరకు పిలుస్తాడు. ఇద్దరితో మాట్లాడుతూ.. వారిని గమనిస్తాడు అమర్. తర్వాత అనుమానంతో మిస్సమను పక్కకు తీసుకెళ్లి నాకో విషయం చెప్పు ఆరోజు అంజును రణవీర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు అని చెప్పావు కదా..? అని అడగ్గానే అవునండి అని మిస్సమ్మ చెప్తుంది. దీంతో అమర్ ఆ హాస్పిటల్ పేరు గుర్తుందా అని అడుగుతాడు. దీంతో మిస్సమ్మ కేఎల్ హాస్పిటల్ అని చెప్తుంది.
వెంటనే హాస్పిటల్‌కు అమర్ ఫోన్ చేస్తాడు. నేను లెఫ్టినెంట్ అమరేంద్రను మాట్లాడుతున్నాను డాక్టర్ అని చెప్పగానే.. ఆ డాక్టర్ చెప్పండి అమరేంద్ర గారు అంటాడు. రెండు నెలల క్రితం రణవీర్ అనే వ్యక్తి ఒక పాపను తీసుకుని మీ హాస్పిటల్‌కు వచ్చారా..? అని అడగ్గానే.. ఆ డాక్టర్ డాటా చెక్ చేసి అవును సార్ పాపను తీసుకుని వచ్చారు అని చెప్తాడు. ఎందుకు తీసుకుని వచ్చారో చెప్పగలరా అని అమర్ అడుగుతాడు. డాక్టర్ చెప్తాడు. అమర్ కాల్ కట్ చేశాక మిస్సమ్మ.. డాక్టర్ ఏం చెప్పారండి అని అడుగుతుంది. అంజును డీఎన్ఏ టెస్టుకు తీసుకెళ్లాడట అని అమర్ చెప్పగానే మిస్సమ్ షాక్ అవుతుంది. ఇక్కడ ఇంట్లో జరగుతున్న వాటికి రణవీర్‌కు సంబంధం ఉందేమో అనిపిస్తుంది అని అమర్ అంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?