Rajinikanth Coolie OTT Release: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కని కూలీ మూవీ ఆగష్టు 14న థియేటర్లలోకి వచ్చింది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాలతో థియేటర్కు వచ్చిన ఆడియన్స్ని కూలీ నిరాశ పరిచింది. నిజానికి లోకేష్ కనగరాజ్ హిట్ డైరెక్టర్. తమిళ్ పరిశ్రమకు పాన్ ఇండియా స్థాయిలో హిట్స్ అందించిన మొట్టమొదటి దర్శకుడు ఈయనే.
అందుకే లోకేష్ దర్శకత్వంపై ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా భారీ నమ్మకం పెట్టుకుంది. ఈసారి ఎలాగైన వెయ్యి కోట్లు కొడతామనే ధీమా వ్యక్తం చేశాయి. కూలీకి ఉన్న బజ్ కూడా తమిళ ఇండస్ట్రీలో కల నేరవేరెలాగే కనిపించింది. ఇక కోలీవుడ్లో మొట్టమొదటి వేయ్యి కోట్ల సినిమాగా కూలీ రికార్డుకి ఎక్కనుందని ఇండస్ట్రీ వర్గాలు గట్టిగా నమ్మాయి. కానీ, విడుదల తర్వాత అంచనాలు అన్ని తారుమారు అయ్యాయి. కనీసం కూలీ నిర్మాతలకు లాభాలను కూడా తెచ్చిపెట్టలేకపోయింది. ఫస్ట్ రోజు ఊహించని కలెక్షన్స్ రాబట్టిన కూలీ కలెక్షన్స్లో రెండో రోజే భారీ డ్రాప్ కనిపించింది. తొలి రోజు కూలీ రూ. 46కు పైగా కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి లియో రికార్డును బ్రేక్ చేసింది. కానీ, కనీసం బ్రేక్ ఈవెన్‌కి దరిదాపుల్లో కూడా రాలేదు.
టాక్ పరంగా బాగదానే ఉన్న బాక్సాఫీసు వద్ద కమర్షియల్గా ఫెయిల్ అయ్యింది. దీంతో అతి తక్కువ టైంలోనే కూలీ మూవీ థియేటర్ల నుంచి బయటకు వచ్చింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తవ్వడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కూలీ ఓటీటీ రిలీజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. ఈ చిత్రం నెల రోజుల ముందే ఓటీటీకి రాబోతోందట. కాగా కూలీ మూవీ ఉన్న బజ్, టీజర్, ట్రైలర్తో పెరిగిన హైప్తో విడుదలకు ముందే కూలీ ఓటీటీ ఢీల్ పూర్తి చేసుకుందట. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైం వీడియో ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని భారీ ధరకు సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం మూవీని నెల రోజుల తర్వాతే ఓటీటీకి తీసుకురావాలని డీల్ చేసుకుంది.
అయితే ఊహించని విధంగా కూలీ డివైడ్ టాక్‌కు సొంతమైంది. కనీసం మూడు వారాలు కూడా ఈ సినిమా థియేటర్లలో ఆడలేకపోయింది. దీంతో కూలీ మూవీని నెల రోజుల ముందే ఓటీటీకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అందుకే సెప్టెంబర్ 11 నుంచి కూలీ చిత్రాన్ని స్ట్రీమింగ్కి ఇవ్వాలని మూవీ టీం ప్లాన్ చేస్తోంది. త్వరలోనే అమెజాన్ ప్రైం నుంచి కూలీ ఓటీటీ రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. కాగా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్లు కీలక పాత్రలో నటించారు. అలాగే శ్రుతీ హాసన్, కన్నడ నటి రచిత రామ్లు ముఖ్యపాత్రలు పోషించారు.