ప్రత్యేక టూర్ ప్యాకేజీలతో పర్యాటకులను ఆకట్టుకునే IRCTC క్రిస్మస్ రానున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్ ప్రయాణానికి ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను పరిచయం చేసింది. ఈ పర్యటనలు కుటుంబ సభ్యులు లేదంటే స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేలా రూపొందించింది. ఇందులో ఒకటి కాశ్మీర్ టూర్ ప్యాకేజీ కాగా, మరొకటి కేరళ టూర్ ప్యాకేజీ. కాశ్మీర్ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతుండగా, కేరళ టూర్ కోల్ కత్తా నుంచి మొదలు కానుంది. ఇంతకీ ఈ ప్రయాణాలు ఎప్పుడు ఉంటాయి? ప్యాకేజీ ధరలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కాశ్మీర్ టూర్ ప్యాకేజీని IRCTC ‘మిస్టికల్ కాశ్మీర్ వింటర్ స్పెషల్ ఎక్స్ హైదరాబాద్’ అనే పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిందిజ కాశ్మీర్ సుందరమైన అందాల మధ్య క్రిస్మస్ జరుపుకోవడానికి అద్భుతమైన ప్యాకేజీ రూపొందించబడింది. ఈ పర్యటన డిసెంబర్ 21 నుంచి 26 వరకు కొనసాగనుంది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 5 రాత్రులతో పాటు 6 పగళ్లు ఉంటుంది.
కాశ్మీర్ మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య క్రిస్మస్ జరుపుకోవడానికి ఇదో మంచి ఛాన్స్ గా చెప్పుకోవచ్చు. ఈ పర్యటనలో 50% తగ్గింపును అందిస్తోంది ఇండియన్ రైల్వే. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 43,670, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.41,050 ఛార్జ్ చేస్తోంది. ఒకవేళ మీరు ఈ టూర్ కు వెళ్లాలనుకుంటే ఇండియన్ రైల్వే వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
క్రిస్మస్ టూర్ ప్యాకేజీలలో భాగంగా కేరళ ప్యాకేజీని పరిచయం చేసింది IRCTC. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని పిలువబడే కేరళకు సరసమైన ధరల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. ఈ టూర్ కోల్ కత్తా నుంచి ప్రారంభం అయ్యే ఈ యాత్ర 7 రాత్రులు, 8 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ట్రిప్ డిసెంబర్ 20 నుంచి 26 వరకు కొనసాగుతుంది.
Read Also: రైళ్లలో వైట్ బెడ్ రోల్స్ మాత్రమే ఎందుకు వాడతారు? తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది!
ఇక కేరళ టూర్ ప్యాకేజీకి సంబంధించిన ధర వివరాలను IRCTC వెల్లడించింది. ఇందులో డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 62,900గా నిర్ణయించింది. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.71,750గా నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో భాగంగా బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ అందిస్తారు. మధ్యాహ్నం భోజనానికి మాత్రం అదనపు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ టూర్ కు వెళ్లాలనుకుంటే ఇండియన్ రైల్వే వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: ఈ ఒక్క రైలుకే 100 బోగీలు.. 25 ఇంజిన్లు.. ఇది ఎక్కడ నడుస్తోందంటే?