Mystery Thriller Movie OTT : ఇటీవల ఓటిటిలో వస్తున్న కొత్త సినిమాలకు డిమాండ్ ఎక్కువ.. మిస్టరీ థ్రిల్లర్ కథలతో వస్తున్న కథలను చూసేందుకు మూవీ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.. ఓటీటి సంస్థలు కూడా తమ యూజర్స్ ను పెంచుకొనేందుకు డిఫరెంట్ స్టోరీలతో ఉన్న సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. ఈమధ్య ఓటీటీలోకి వచ్చిన ప్రతి సినిమా మంచి వ్యూస్ ని సంపాదించుకుంది. థియేటర్లలో యావరేజ్ టాక్ ను అందుకున్న సినిమా కూడా ఇక్కడ సక్సెస్ స్టాప్ ని అందుకుంటున్నాయి దాంతో మేకర్స్ కూడా ఓటిటిలో సినిమాలను రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మరో మూవీ ఓటీటీలో కి స్ట్రీమింగ్ కు రాబోతుంది.. ఆ మూవీ పేరేంటో? ఎక్కడ స్ట్రీమింగ్ కు రాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ..
రవితేజ నున్నా, నేహ జురెల్ హీరో హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’.. ఈ మూవీ గత ఏడాది మార్చిలో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. పదినెలలు తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతుంది.. ఈ సినిమాను మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజు దర్శకత్వంలో ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించారు. ఇక కంప్లిట్ గా విలేజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిస్టరీ థ్రిల్లర్ స్టోరీతో ఈ మూవీ తో వచ్చింది. మూవీ రిలీజ్ అయ్యి 10 నెలలు అయిన తర్వాత సడన్గా ఓటిటిలో స్ట్రీమింగ్ వచ్చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఈ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
ఒక ఊరిలో నాయుడు కులానికి చెందిన వాళ్ళు ఉంటారు. మరో ఊరిలో రాజు గార్లు ఉంటారు. టైటిల్ తగ్గట్టే నాయుడు గారి అబ్బాయి రాజు గారి అమ్మాయి ప్రేమలో పడతారు. అనుకోకుండా వీరిద్దరూ ప్రేమలో పడటం వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా షాక్ అయ్యేలా చేస్తుంది.. వారిద్దరూ ఇరు ఫ్యామిలీలకు తెలియకుండా సీక్రెట్ గా కలుసుకుంటారు. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ హద్దులు దాటేస్తుంది. హీరోయిన్ హత్యతో సినిమా కథ మొదలౌతుంది. ఆపై ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? అసలు అమ్మ ఎలా చనిపోయింది అనేది పెద్ద మిస్టరీగా మిగిలిపోతుంది. పోలీసులు అమ్మాయి మర్డర్ వెనుక అసలు అంతకు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. ఇదే స్టోరీ తో మొత్తం సినిమా అంతా నడుస్తుంది అయితే ఈ మూవీలో హత్య చేసింది ఎవరు అనేది తెలుసుకున్నారా లేదా తెలియాలంటే ఓటిటిలో మూవీని చూడాల్సిందే.. చిన్న సినిమాగా విడుదలైన రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి టైటిల్‌ను షార్ట్ కట్‌లో రానా పేరుతో ప్రమోట్ చేశారు.. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేదు.. ఇక ఓటీటీ లో ఎలాంటి టాక్ ను అందుకుందో చూడాలి…