OTT Movie : బెంగాలీ సినిమాలు ఇప్పుడు మంచి కంటెంట్ తో థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ సినిమాలు ఓటీటీ లో కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ రాష్ట్రపతి హత్యకు కట్ర చేసిన తీవ్రవాదుల చుట్టూ తిరుగుతుంది. చివరివరకూ ఈ మూవీ ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
Hoichoi ఓటీటీలో
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రక్తబీజ్’ (Raktabeej). 2023 లో విడుదలైన ఈ బెంగాలీ మూవీ కి నందితా రాయ్, శిబోప్రసాద్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2014లో జరిగిన బుర్ద్వాన్ బాంబు పేలుడు సంఘటన నుండి ప్రేరణ పొందింది. ఇది బెంగాల్‌తో పాటు దేశాన్ని కూడా కదిలించిన ఒక నిజ జీవిత సంఘటన. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. దుర్గా పూజ సమయంలో జరిగే సంఘటనతో స్టోరీ మొదలౌతుంది. ఈ మూవీ భారత రాష్ట్రపతి అనిమేష్ చటర్జీ చుట్టూ తిరుగుతుంది. ఇందులో విక్టర్ బెనర్జీ, అబీర్ చటర్జీ, మిమి చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ Hoichoi ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
భారత రాష్ట్రపతి అనిమేష్ చటర్జీ తన స్వగ్రామానికి దుర్గా పూజ సందర్భంగా వస్తాడు. అనిమేష్ చటర్జీ పాత్ర భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పోలి ఉంటుంది. రాష్ట్రపతి ఒక ఉగ్రవాది దయాహర్జీ పెట్టుకున్న క్షమాభిక్ష ను తిరస్కరించడంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆ ఉగ్రవాది ఉరిశిక్షకు గురవుతాడు. ఈ నేపథ్యంలో, రాష్ట్రపతి తన స్వగ్రామంలోని ఖోయ్రాగఢ్ అనే గ్రామంలో జరిగే దుర్గా పూజలో పాల్గొనడానికి వస్తాడు. అయితే, ఈ సందర్భంగా ఒక అకస్మాత్తుగా జరిగిన బాణసంచా పేలుడు, రాష్ట్రపతి జీవితానికి పెద్ద ముప్పుగా మారుతుంది. ఈ పేలుడు ఒక పెద్ద ఉగ్రవాద కుట్రలో భాగమని తెలుస్తుంది. దీని లక్ష్యం రాష్ట్రపతిని హత్య చేయడం. ఈ కుట్రను అరికట్టడానికి ఇద్దరు పోలీసు అధికారులు, పంకజ్ సిన్హా , మరియు సంజుక్తా మిత్రా కలిసి పనిచేస్తారు. వారు ఈ పేలుడు వెనుక ఉన్న నిజాన్ని కనుగొనడానికి, రాష్ట్రపతిని రక్షించడానికి పోరాడతారు.
కథలో రాష్ట్రపతి, అతని సోదరి గౌరీ దేవి మధ్య ఉన్న సంబంధం భావోద్వేగంగా ఉంటుంది. అదే సమయంలో ఉగ్రవాద ముప్పు ఉత్కంఠను పెంచుతుంది. చివరిలో, ఒక ఆశ్చర్యకరమైన ట్విస్ట్ తో స్టోరీ మలుపు తిరుగుతుంది. ఉగ్రవాదుల్లో ఒకరైన మునీర్ ఆలం అనే వ్యక్తి వాస్తవానికి మరొక రూపంలో దాగి ఉంటాడు. ఇది సీక్వెల్ ను తీయాడానికి సుగమం చేస్తుంది. ఈ మూవీ బెంగాలీ సినిమాల్లో మొదటిసారిగా నాలుగు భాషల్లో బెంగాలీ, హిందీ, అస్సామీ, ఒడియా విడుదలైంది. అక్టోబర్ 19, 2023న థియేటర్లలోకి వచ్చిన ఈ రక్తబీజ్ మూవీ ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ మూవీ బెంగాలీ సంస్కృతి, దుర్గా పూజ వాతావరణాన్ని అద్భుతంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.