OTT Movie: థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు అన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. కొన్ని సినిమాలు ఏకంగా ఓటీటీ లోనే రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని సినిమాలు మాత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్లలో ఎక్కువగా మంచి వ్యూస్ ను రాబడుతుంటాయి. తమిళ్, మలయాళ సినిమాలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ రొమాంటిక్ మూవీ జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం గోల్డ్ స్మగ్లింగ్ కేసు లో ఉన్న హీరోయిన్ రన్యా రావు నటించిన రొమాంటిక్ మూవీ ఇది. ఇక ఆలస్యం ఎందుకు? ఆ మూవీ పేరేంటి? స్ట్రీమింగ్ ఎక్కడ అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ..
కన్నడ హీరోయిన్ రన్యా రావు హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ వాఘా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. వాఘా మూవీలో విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు.. 2016లో థియేటర్ల లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది.. భారీ అంచనాలతో వచ్చిన కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. యావరేజ్ కలెక్షన్స్ ను కూడా వసూల్ చేసింది. అయితే ఎప్పుడో వచ్చిన సినిమా ఇప్పుడు ఓటీటీలకి స్ట్రీమింగ్కు రాబోతుంది.. థియేటర్లలోకి వచ్చినా దాదాపు 9 ఏళ్ల తర్వాత ఈ సినిమా ఇప్పుడు జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది.. తమిళ వెర్షన్ మాత్రం ఫ్రీగా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. వాఘా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ వార్త ప్రచారంలో ఉంది. ఈ మూవీతోనే హీరోయిన్ రన్యా రావు తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
ఖనుమ్ పాకిస్థాన్‌కు చెందిన అమ్మాయి. తన తాతయ్యను చూడటానికి ఇండియా వస్తుంది.. వాసు అనే ఇండియా సోల్జర్ తో ప్రేమలో పడుతుంది. ఇండియా , పాకిస్థాన్ మధ్య గొడవల కారణంగా ఖనుమ్ తిరిగి మాతృదేశానికి వెళ్లడం కష్టంగా మారుతుంది. ప్రియురాలిని పాకిస్థాన్ చేరవేసే బాధ్యతను వాసు తీసుకుంటాడు.. అనుకున్నట్లుగానే వాసు తన ప్రియురాలు ను పాకిస్తాన్ కు చేర్చాడా? అక్కడ ఇద్దరు కలిసి తమ ప్రేమను గెలిపించుకున్నాడా? లేక పాకిస్తాన్ అధికారులకు దొరికిపోయాడా? ఆ తర్వాత స్టోరీ ఏంటి అనేది సినిమాలో చూడాలి..
రన్యా రావు గురించి చెప్పాలంటే.. ఈమె మాణిక్య తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రన్యారావు. ఈ మూవీలో కిచ్చా సుదీప్ హీరోగా నటించాడు. ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్‌గా మాణిక్య తెరకెక్కింది.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. బంగారం అక్రమ రవాణా కేసులో ఇటీవల రన్యా రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తరుచుగా దుబాయ్ వెళుతున్న రన్యారావు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల తనిఖీల్లో రన్యారావు వద్ద 12 కోట్ల బంగారం దొరకడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈమె కేసులో పోలీసులకు విస్తూపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.. త్వరలోనే ఈ కేసు గురించి పూర్తి వివరాలను బయటపెడతామని చెబుతున్నారు. ఈ కేసు పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.