OTT Movie : హారర్ జానర్ లో వస్తున్న జోంబీ సినిమాలు చూస్తున్నప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది. రక్తం వాసనకు పిచ్చెక్కిపోయే ఈ జోంబీలు చేసే రచ్చ కూడా మామూలుగా ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కూడా బ్లడ్ బాత్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఒక మారుమూల గ్రామంలో జరిగే ఈ స్టోరీ కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కేక పెట్టిస్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో, ఒక అంటువ్యాధి వ్యాపించడంతో చాలా మంది జాంబీ లాంటి జీవులుగా మారిపోతారు. ఈ జాంబీలు సాధారణ మనుషులలా కనిపిస్తాయి కానీ మనిషి మాంసం తినేందుకు ఆకలితో ఉంటారు. ఏదైనా శబ్దం వినగానే చీకటిలో నుండి వేగంగా దాడి చేస్తాయి. కథలో బోనిన్, వెజినా, టానియా, జోయ్, సెలిన్ జాంబీల నుండి తప్పించుకోవడానికి అడవుల్లోకి పారిపోతారు. మిగతావాళ్ళు జాంబీలుగా మారిపోతారు. అడవిలోకి పారిపోయిన వాళ్ళు, ఒక పెద్ద నగరంలో ఆశ్రయం పొందాలని చూస్తుంటారు.
బోనిన్ అతని స్నేహితుడు వెజినా షాట్‌గన్‌లతో జాంబీలను చంపుతూ ముందుకు వెళ్తుంటారు. కానీ వెజినా జాంబీల దాడిలో చనిపోతాడు. ఇంతలో సెలిన్ ఒక మాచెట్‌తో జాంబీలను చంపుతూ, కారులో సంగీతం ప్లే చేసి వాటిని తన వైపు తిప్పుకుంటుంది. బతికినవాళ్ళు జాంబీల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ జాంబీలు సాధారణ జాంబీలలా కాకుండా, కుర్చీలు, బొమ్మలు వంటి వస్తువులతో ఏదో రహస్యమైన గుండ్లను నిర్మిస్తుంటారు. ఇది వారికి ఒక విచిత్రమైన ఆచారం ఉన్నట్లు సూచిస్తుంది.
వీళ్లంతా ఒక బంకర్‌లో దాక్కుంటారు. కానీ అక్కడ ఆహారం లేకపోవడంతో ఇబ్బందులు పడతారు. ఒక రోజు అక్కడ ఒక జాంబీ బొమ్మతో ఏడుస్తూ కనిపిస్తుంది. ఇది వారి ప్రవర్తనలో ఒక మానవీయ కోణం ఉందని సూచిస్తుంది. చివరగా బతికినవారిలో చాలా మంది జాంబీల దాడిలో చనిపోతారు. ఇక క్లైమాక్స్ ఉహించని రీతిలో ముగుస్తుంది. ఇక్కడ ఎవరైనా బతుకుతారా ? జాంబీల పరిస్థితి ఏమవుతుంది ? ఈ అంటువ్యాధి ఎలా వచ్చింది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్‌లో
‘రావెనస్’ (Ravenous) 2017లో విడుదలైన కెనడియన్ ఫ్రెంచ్ జోంబీ హారర్ చిత్రం. దీనికి రాబిన్ ఆబర్ట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2017 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ కెనడియన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఇతర అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో గుర్తింపు పొందింది. మార్క్, మోనియా చోక్రీ, షార్లెట్ ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో 5.8/10 రేటింగ్ ను పొందిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
Read Also : స్టార్ హీరో కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు… ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్… ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే ?