E-Paper
Advertisement

Maas Jathara OTT : మరో ఓటీటీలో రవితేజ డిజాస్టర్ మూవీ హిందీ స్ట్రీమింగ్… ఏ ఓటీటీ లో ఉందంటే?

Maas Jathara OTT : మరో ఓటీటీలో రవితేజ డిజాస్టర్ మూవీ హిందీ స్ట్రీమింగ్… ఏ ఓటీటీ లో ఉందంటే?
Advertisement

Maas Jathara OTT : థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఎన్నో సినిమాలు ఓటీటీలో అదరగొట్టాయి. ఇక ఇప్పుడు ‘మాస్ జాతర’ మూవీ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయింది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు హిందీలో కూడా అందుబాటులోకి వచ్చింది. కాకపోతే సేమ్ ఓటీటీలో కాకపోవడం ఇక్కడ ట్విస్ట్. మరి ఈ మూవీ హిందీలో ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

2025లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా ‘మాస్ జాతర’ (Mass Jathara). భాను భోగవరపు డైరెక్ట్ చేసిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ లో రవితేజ హీరోగా నటించాడు. ఇందులో ఆయన రైల్వే పోలీస్ ఆఫీసర్‌ గా కనిపిస్తాడు. హీరోయిన్ గా శ్రీలీల నటించగా, నవీన్ చంద్ర, వీటీవీ గణేష్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, హైపర్ ఆది కీలక పత్రాలు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై రవితేజ స్వయంగా నిర్మించాడు. 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ ఇదే ఏడాది అక్టోబర్ 31న దీపావళి కానుకగా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. కానీ బిగ్ స్క్రీన్ పై ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఈ మూవీ హిందీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. డిసెంబర్ 31 నుంచి Jio Hotstarలో ఈ మూవీ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వెర్షన్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ (Netflix)లో నవంబర్ 28 నుంచే అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Read Also :  తీరని కోరికలను తీర్చుకోవడానికి తిరిగి జన్మించే ఆత్మ… చిన్న పిల్లాడిగా పునర్జన్మ… సీను సీనుకో ట్విస్ట్

స్టోరీలోకి వెళ్తే…

మాస్ జాతర కథ ఒక చిన్న పట్టణానికి బదిలీ అయిన హానెస్ట్ రైల్వే పోలీస్ ఆఫీసర్ లక్ష్మణ్‌ భేరి (రవితేజ) చుట్టూ తిరుగుతుంది. అతను నిజాయితీ గల రైల్వే పోలీస్‌ అధికార. కళ్ల ఎదుట అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోడు. ఇదే నేపథ్యంలో వరంగల్‌లో పని చేస్తున్నప్పుడు ఓ మంత్రి కొడుక్కి ఝలక్ ఇస్తాడు. ఆ ఘటన తర్వాత అతన్ని పొలిటికల్ పలుకుబడి ఉపయోగించి, అల్లూరి జిల్లాలోని అడవివరం రైల్వే స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. కొండల మధ్య ఎక్కడో సిటీకి దూరంగా ఉండే ఆ గిరిజన ప్రాంతాన్ని శివుడు (నవీన్‌ చంద్ర) అనే వ్యక్తి శాసిస్తాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులతో శీలావతి అనే ఒక రకమైన పవర్ ఫుల్ గంజాయిని పండిస్తాడు. అలాగే దాన్ని కోల్‌కతాకు స్మగుల్ చేస్తాడు. లక్ష్మణ్‌ ఆ ఊర్లోకి అడుగు పెట్టగానే ఈ విషయాన్ని పసిగడతాడు.ఇక్కడి నుంచి శివుడికి, లక్ష్మణ్ కు పడుతుంది. మరి పోలీసులతో పాటు పొలిటికల్ అండ మెండుగా ఉన్న శివుడిని హీరో ఎలా అడ్డుకున్నాడు ? ఆ గంజాయి సామ్రాజ్యాన్ని కూలదోయడానికి ఏం చేశాడు? ఈ కథలో తులసి, హనుమాన్‌ భేరిలు ఎవరు ? అన్నది సినిమాలో చూడాల్సిందే.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×