Junior doctor Rape| కోల్‌కతా నగరంలో కొన్ని నెలల క్రితం ఒక మహిళా జూనియర్ డాక్టర్ పై అత్యాచరం, హత్య జరిగింది. ఈ భయంకరమైన ఘటన గురించి దేశంలో అందరూ మరవకముందే ఇలాంటిదే ఒక తాజా ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం జనవరి 5, 2025న జరిగింది. అక్కడ ఒక మహిళా జూనియర్ డాక్టర్ ఒక ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ భవనంలో అత్యాచారానికి గురైంది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగరంలోని గజ్రారాజ మెడికల్ కాలేజిలో చదువుకుంటున్న రత్నా కుమారి (25, పేరు మార్చబడినది)పై తోటి విద్యార్థి అత్యాచారం చేశాడు. నిందితుడితో ఆమెకు గత కొంతకాలంగా పరిచయముంది. ఇద్దరూ స్నేహితులే. ఈ క్రమంలో నిందితుడు రత్నా కుమారిని ఆదవారం ఫోన్ చేసి పక్కనే ఉన్న పాత బాయ్స్ హాస్టల్ కు రావాలని అక్కడ చాలా అవసరమైన పని ఉందని పిలిచాడు.
మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ లో ఉంటున్న రత్నాకుమారి.. స్నేహితుడికి ఏ ఆపద వచ్చిందోనని పరుగులు తీస్తూ వెళ్లింది. అది మెడికల్ కాలేజీలోని పాత బాయ్స్ హాస్టల్.. అక్కడ ఎవరూ ఉండరు. కొంతకాలం క్రితమే కొత్త బాయ్స్ హాస్టల్ బ్లాక్ కి వైద్యవిద్యార్థులను షిఫ్టి చేసేశారు. దీంతో పాత బాయ్స్ హాస్టల్ నిర్మానుషంగా ఉంటుంది. రత్నాకుమారి అక్కడికి వెళ్లగా.. ఆమె స్నేహితుడు కనబడలేదు.
దీంతో ఆమె ఆ నిర్మానుష హాస్టల్ లో ఒంటరిగా తిరుగుతూ ఉంది. పైగా సాయంత్రం వేళ.. దీంతో ఆమెకు భయం వేసి.. తిరిగి వచ్చేస్తున్న సమయంలో వెనుక ఆమె స్నేహితుడు వచ్చి గట్టిగా పట్టుకున్న అత్యాచారం చేయబోయాడు. ఈ హఠాపరిణామంతో భయపడిపోయిన రత్నకుమారి.. అతడిని నెట్టేసింది. కానీ అతను ఆమెకు చితకబాది.. కత్తి చూపించి భయపెట్టాడు. ఆ తరువాత ఆమెను లొంగదీసుకొని రేప్ చేశాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తానన్నాడు.
Also Read: అత్యాచారం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు.. నిందితుడితో పెళ్లిచేసుకోమని చెప్పిన పోలీసులు
స్నేహితుడే తనతో పైశాచికంగా ప్రవర్తించడంతో రత్నాకుమారి షాక్ కు గురైంది. ఆ తరువాత తేరుకొని నేరుగా సమీపంలోని కంపు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు రత్నా కుమారి ఫిర్యాదు పై వెంటనే చర్యలు తీసుకున్నారు. గజ్రారాజ్ మెడికల్ కాలేజీకి వెళ్లి నిందితుడి కోసం గాలించగా.. అతను తన స్వగ్రామం బయలుదేరాడని తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే రైల్వే స్టేషన్ వెళ్లే దారిలో అతడిని పట్టుకున్నారు. అతనిపై అత్యాచారం కేసు నమోదు చేశారు.
ఈ ఘటనతో మెడికల్ కాలేజీ పరిసరాల్లో సరైన భద్రతా ఏర్పాట్లు లేవనే విమర్శలు తలెత్తాయి. పాత బాయ్స్ హాస్టల్ నిర్మానుషంగా ఉండడంతో అక్కడ అసాంఘిక చర్యలు, నేరాలకు అనువైన చోటుగా మారిందని.. కాలేజీ యజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అత్యాచారం జరగడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటిదే ఘటన కోల్ కతా నగరంలోని ఆర్ జి కార్ మెడికల్ కాలేజీలో జరిగింది. ఆ మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వానికి చెందినదే. అక్కడ ఆగస్టు 9, 2024న ఒక 31 ఏళ్ల మహిళా జూనియర్ డాక్టర్ నైట్ డ్యూటీలో ఉండగా.. ఒక పోలీస్ ఇన్‌ఫార్మర్ సంజయ్ రాయ్ అర్ధరాత్రి వేళ ఆస్పత్రికి వెళ్లి.. ఒంటరిగా రెస్ట్ రూంలో ఉన్న మహిళా జూనియర్ డాక్టర్ పై పైశాచికంగా బలాత్కారం చేశాడు. ఆ తరువాత ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయింది.
ప్రస్తుతం ఈ కేసులో సిబిఐ విచారణ చేస్తోంది.