E-Paper
Advertisement

Retta Thala OTT : అరుణ్ విజయ్ యాక్షన్ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్ షురూ… ఏ ఓటీటీలో ఉందంటే ?

Retta Thala OTT : అరుణ్ విజయ్ యాక్షన్ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్ షురూ… ఏ ఓటీటీలో ఉందంటే ?

Retta Thala OTT : నటుడు అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయంలో నటించిన మూవీ ‘రెట్ట తల’. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ తమిళ చిత్రం ఇప్పుడు ఓటీటీ లో అడుగు పెట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ థియేటర్లలో క్రిస్మస్ వారాంతంలో విడుదలైనప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులలో తగినంత ప్రభావాన్ని చూపలేదు. ఈ సినిమా విక్రమ్ ప్రభు నటించిన క్రైమ్ డ్రామా ‘సిరై’ కి పోటీగా వచ్చింది. అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఇక ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు థియేటర్లలో విడుదలైన ఒక నెల తర్వాత, ఈ రోజునుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ‘రెట్ట తల’ (Retta Thala)2025 డిసెంబర్ 25 న థియేటర్లలో రిలీజ్ అయింది. దీనిని ఇప్పుడు ప్రైమ్ వీడియో జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయం చేయగా, సిద్ధి ఇద్నాని, తాన్య రవిచంద్రన్, యోగి సామి, జాన్ విజయ్, హరీష్ పేరడి, బాలాజీ మురుగదాస్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి క్రిస్ తిరుకుమారన్ రచన, దర్శకత్వం వహించారు, సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు.

స్టోరీ ఏమిటంటే

పాండిచ్చేరికి చెందిన కాళి (అరుణ్ విజయ్) అనే అనాథ యువకుడు పేదరికంలో పెరుగుతాడు. అతను తన చిన్ననాటి స్నేహితురాలు ఆంత్రే (సిద్ధి ఇద్నాని)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే కాళి ప్రేమను ఆంత్రే తిరస్కరిస్తుంది. పేదరికంలో బతకడం కంటే డబ్బు, హోదా ఉన్న జీవితమే ముఖ్యమని ఆమె నమ్ముతుంది. తనను పెళ్లి చేసుకోవాలంటే ధనవంతుడు కావాలని షరతు పెడుతుంది.

ఈ క్రమంలో కాళి అనుకోకుండా తనలాగే అచ్చుగుద్దినట్లు ఉన్న ఉపేంద్ర (అరుణ్ విజయ్) అనే ఒక ధనవంతుడైన గ్యాంగ్‌స్టర్‌ను చూస్తాడు. ఉపేంద్రను చంపేసి, అతని స్థానంలోకి వెళ్తే భారీ సంపదను సొంతం చేసుకోవచ్చని ఆంత్రే, కాళికి సలహా ఇస్తుంది. ఆ ఆశతో ఉపేంద్ర స్థానంలోకి వెళ్ళిన తర్వాత కాళికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలు ఏమిటి ? ఉపేంద్ర గతం ఏమిటి? అతను నిజంగా ఎవరు? అత్యాశతో తీసుకున్న నిర్ణయం కాళి జీవితాన్ని ఎలాంటి ప్రమాదంలోకి నెట్టింది? అనేదే మిగిలిన కథ.

Read Also : దున్నపోతును బలి తీసుకునే దెయ్యం బొమ్మ … అఘోరాలకే దిమ్మతిరిగే హారర్ స్టోరీ

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×