OTT Movie : ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొని రావడంతో పాటుగా పాత ఇంట్రెస్టింగ్ సినిమాలను కూడా స్ట్రీమింగ్ చేసేందుకు పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ మధ్య యాక్షన్, హారర్ సినిమాలకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు ప్రయోగాత్మక చిత్రాలు కూడా సినీ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఓటీటీ సంస్థలు రిలీజ్ చేస్తున్న సినిమాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ఓ ప్రయోగాత్మక చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతుంది.. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..
మూవీ & ఓటీటీ..
తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ రివైండ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుంది. ఈ సినిమా స్టోరీ కొత్తగా ఉన్నా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయిందని టాక్ ని అందుకుంది. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు నెలల తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్ కి రాబోతుంది.. మార్చి 7న లయన్స్‌గేట్‌ప్లే ( LionsgatePlay )లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీ ఓటీటీ డీటెయిల్స్ గురించి ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది.. ప్రయోగాత్మక చిత్రాలు ఓటీటీ లో సక్సెస్ టాక్ ను అందుకుంటున్నాయి. ఈ మూవీ కూడా అదే విధంగా మంచి సక్సెస్ ను అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు..
స్టోరీ విషయానికొస్తే..
టాలీవుడ్ యంగ్ హీరో సాయి రోనక్, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ట్రైమ్ ట్రావెల్ చిత్రం రివైండ్. సురేశ్, సామ్రాట్, వైవా రాఘవ్, జబర్దస్త్ నాగి, అభిషేక్ విశ్వకర్మ, ఫన్‌బకెట్ భరత్.. తదితరులు కీలక పాత్ర పోషించారు. కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. గ తేడాది అక్టోబర్ 18న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది ఇప్పుడు సరిగా నాలుగు నెలల తర్వాత ఓటిటిలోకి రాబోతుంది. ఈ మూవీలో హీరో హీరోయిన్లు సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్.. ఒకే అపార్ట్మెంట్లో ఉండడంతో పాటుగా ఒకే కంపెనీలో పని చేస్తున్నంతో వాళ్ళిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అయితే ఆ ప్రేమను ఒకరికొకరు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఒకరోజు హీరో హీరోయిన్ కి ప్రేమని చెప్పాలని అనుకుంటాడు అయితే అదే టైంలో అతని తాత కనిపెట్టిన టైం మిషన్ ను ఉపయోగించి వెనక్కి వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత హీరోయిన్ కి హీరో ప్రపోజ్ చేశాడా లేదా అన్నది ఈ మూవీలో చూపిస్తారు.. ప్రయోగాత్మకంగా సినిమా స్టోరీ కొత్తగా ఉన్నా కూడా థియేటర్లలో పెద్దగా సక్సెస్ అయినట్టు కనిపించలేదు. ఓటిటిలో ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి… గతంలో వచ్చిన ఇలాంటి చిత్రాలకు మంచి డిమాండ్ ఏర్పడింది ప్రేక్షకులు ఈ సినిమాలను ఎక్కువగా ఆదరించారు దాంతో ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ని అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.