Rahul Ramakrishna.. ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఫ్రెండ్ గా నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అద్భుతమైన కామిడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో దిట్ట అనడంలో సందేహం లేదు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించి రాహుల్ రామకృష్ణకు మంచి పేరు అందించింది. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty)తో కలసి ‘జాతి రత్నాలు’ సినిమాలో కీలకపాత్ర పోషించారు రాహుల్. తన నటనతో టాలీవుడ్ లో మార్క్ క్రియేట్ చేసుకుంటున్న ఈయన.. గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయినా సరే వరుస పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నారు అని చెప్పవచ్చు.
మూడు నెలల్లో నేనేంటో నిరూపిస్తా..
అప్పుడప్పుడు ఈయన చేసే పోస్టులు కాంట్రవర్సీకి కూడా తెరలేపుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈయన ఒక ఇన్ స్టా పోస్ట్ పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ రామకృష్ణ ఫిట్నెస్ ఛాలెంజ్ తీసుకున్నారు. కానీ తన ఇంట్లో వాళ్ళు మాత్రం మూన్నాళ్ల ముచ్చట అని అంటున్నట్లు ఇంస్టాగ్రామ్ ద్వారా సెన్సేషనల్ పోస్టులు పెట్టారు. ” దయచేసి నాకు ఎవరైనా ట్రెడ్ మిల్ దానం చేయండి. నేను వర్కౌట్స్ చేసి మూడు నెలల్లో ఫిట్గా మారి నేనేంటో నిరూపించాలని కోరుకుంటున్నాను. కేవలం నన్ను డిఎం చేసి ఆశీర్వదించండి. అయితే నేను మా ఇంట్లో వాళ్లకి ట్రెడ్మిల్ కొనుక్కొని మూడు నెలల్లో ఫిట్గా అవుతానని ఛాలెంజ్ చేశాను.
ఇంట్లో వాళ్లే కిందకు లాగుతారు..
మా వాళ్లతో మూడు నెలల్లో ముచ్చటగా తయారవుతానంటే.. అవన్నీ మూన్నాళ్ల ముచ్చటే.. ఆ తర్వాత ట్రెడ్మిల్ బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది అంటున్నారు. ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ ను, డేడికేషన్ టాలెంట్ ను, ఫ్యాషన్ ని మొదటి చంపేది ఇంట్లో వాళ్లే. వాళ్లే మనల్ని కిందకు లాగుతారు. అమ్మతోడు ఆ త్రం ఆపులేకపోతున్నాను. కొద్ది రోజుల్లో దుమ్ము లేపే అప్డేట్ ఇవ్వబోతున్నాను. మా నాన్న మాటను నేను విడుదలచుకోలేదు. ఫిట్గా మారుతాను. 3 నెలల్లోనే నేను అనుకున్నది చేసి చూపిస్తాను” అంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇక ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు ఏం అప్డేట్ ఇవ్వబోతున్నాడు.. ఫిట్టుగా మారి ఎటువంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అని అభిమానులు సైతం ప్రశ్నలతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. మరి రాహుల్ రామకృష్ణ ఏ ఉద్దేశంతో అలా చెప్పారో తెలియాల్సి ఉంది.
ALSO READ:Oscar Awards 2025: రెడ్ కార్పెట్ పై ఆసక్తికరంగా మారిన అంశాలివే..!
రాహుల్ రామకృష్ణ కెరియర్..
ఇక రాహుల్ రామకృష్ణ విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నటుడిగా, రచయితగా పేరు దక్కించుకోవడమే కాదు విలేకరి కూడా.. సైన్మా అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. జాతీయ పురస్కారం అందుకున్న పెళ్లిచూపులు సినిమాలో రెండు పాటలు కూడా రాసి అబ్బురపరిచారు. ఇక ఈయన తండ్రి యోగా టీచర్ కాగా.. తల్లి ఒక వ్యాపార పత్రికలో సహాయ సంపాదకురాలిగా పనిచేస్తున్నారు. ఇక ఈయన హైదరాబాదులోని వీ జే ఐ టి కాలేజ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం వరకు చదివి ఆపేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. రాహుల్ రామకృష్ణ స్క్రీన్ రైటర్ గా, టీవీలో వంటల కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా కూడా పనిచేసి ఆకట్టుకున్నారు.