E-Paper
Advertisement

IND VS SA, 1st Test: నేటి నుంచే టెస్ట్ సిరీస్‌..టాస్ కోసం కొత్త కాయిన్‌..టైమింగ్స్‌, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

IND VS SA, 1st Test: నేటి నుంచే టెస్ట్ సిరీస్‌..టాస్ కోసం కొత్త కాయిన్‌..టైమింగ్స్‌, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే
Advertisement

IND VS SA, 1st Test: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 1st Test) మధ్య ఇవాళ్టి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో భాగంగా రెండు జ‌ట్ల మధ్య రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇవాళ కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens, Kolkata) వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. బౌలర్లకు అనుకూలంగా పిచ్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై రాణించిన టీమ్ ఇండియా బౌలర్లు, దక్షిణాఫ్రికాను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు.

Also Read: PAK vs SL 2nd ODI: ఇస్లామాబాద్ లో బ్లాస్టింగ్‌..పాకిస్తాన్ నుంచి పారిపోయిన 16 మంది శ్రీలంక ప్లేయ‌ర్లు, వ‌న్డే సిరీస్ ర‌ద్దు ?

తొలి టెస్ట్ టైమింగ్స్, స్ట్రీమింగ్ వివరాలు

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఎప్పటిలాగే ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇవాళ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో టాస్ వేస్తారు. ఈ టెస్ట్ కు సంబంధించిన మ్యాచులన్ని జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. అలాగే జియో హాట్ స్టార్ కు సంబంధించిన వెబ్సైట్ లో కూడా స్కోర్ వివరాలు చూసుకోవచ్చు.

టెస్ట్ సిరీస్ కోసం కొత్త టాస్ కాయిన్

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టాస్ కోసం కొత్త కాయిన్ రూపొందించారు. మహాత్మా గాంధీ అలాగే నెల్సన్ మండేలా ( Gandhi–Mandela Coin ) ఇద్దరి గౌరవార్థం ఈ కాయిన్ రూపొందించారు. శాంతి అలాగే అహింస రెండిటిని ప్రతిబింబించేలా దీన్ని తీసుకొస్తున్నారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ కాయిన్ ను ప్రత్యేకంగా రూపొందించింది. మొదటి టెస్ట్ తో పాటు రెండో టెస్టుల్లో కూడా ఈ కాయిన్ ఉపయోగించనున్నారు. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రికార్డులు ఒకసారి పరిశీలిస్తే, గిల్ సేన వెనుకబడినట్లే కనిపిస్తోంది. టీమిండియా పైన సఫారీలు పై చేయి సాధించారు. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 44 టెస్టులు జరిగాయి. ఇందులో దక్షిణాఫ్రికా 18 టెస్టుల్లో విజయం సాధించింది. టీమిండియా కేవలం 16 టెస్టుల్లో విజయం సాధించడం గమనార్హం. ఇక హోం టౌన్ లో టీమిండియా 11 మ్యాచ్ ల‌లో గెలవగా, తమ హోమ్ టౌన్ లో టీమిండియాపై 13 టెస్టుల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

ఇండియా, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల అంచ‌నా

Advertisement

ఇండియా ప్రాబబుల్ XI: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

దక్షిణాఫ్రికా ప్రాబబుల్ XI: ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా (సి), ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్, సెనురన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ

Also Read: PAK VS SL: పాకిస్తాన్ లో చ‌చ్చినా ప‌ర్లేదు, మ్యాచ్ ఆడండి..లేక‌పోతే 2 ఏళ్ల బ్యాన్‌…శ్రీలంక బోర్డు హెచ్చ‌రిక‌లు

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×