E-Paper
Advertisement

చెల్లెలి ప్రేమకి అడ్డుపడే అన్న… కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ ఎంటర్టైనర్

చెల్లెలి ప్రేమకి అడ్డుపడే అన్న… కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ ఎంటర్టైనర్
Advertisement

Romantic Comedy OTT : ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమాను చూడాలనుకుంటే, ఈ థాయ్ సినిమాను చూసేయచ్చు. ఇది కేవలం కామెడీ మాత్రమే కాకుండా, అన్నచెల్లెళ్ల మధ్య ఉండే ఎమోషన్స్‌ను చక్కగా చూపించినందుకు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ప్రధానంగా అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే గొడవలు, ప్రేమ, బాధ్యతల చుట్టూ తిరుగుతుంది. ఫ్యామిలీతో ఈ సినిమా చూస్తే మంచి మెమరబుల్ గా మిగిలిపోతుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ థాయ్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా పేరు ‘బ్రదర్ ఆఫ్ ది ఇయర్’ (Brother of the Year). ఈ చిత్రాన్ని థాయ్‌లాండ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ GDH 559 నిర్మించింది. దీనికి విత్తయ థాంగ్‌యూయంగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, 2018లో థాయ్‌లాండ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా 2PM అనే ప్రసిద్ధ K-pop గ్రూప్ సభ్యుడైన నిక్కున్ ఇందులో నటించడం వల్ల ఈ సినిమా ఆసియా అంతటా మంచి గుర్తింపు పొందింది. అవార్డుల విషయానికొస్తే, కథానాయిక ఉరస్సయ సెపర్బండ్ (జేన్ పాత్రలో) తన నటనకు గాను 2019లో ప్రతిష్టాత్మకమైన ‘థాయ్‌లాండ్ నేషనల్ ఫిల్మ్ అసోసియేషన్’ నుండి ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా సుమారు 1.4 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక ఊళ్ళో ఒక అన్న, చెల్లెలు ఉంటారు. అన్న పెద్ద సోమరిపోతు, ఏ పనీ పాటా లేకుండా తిరుగుతూ ఇల్లంతా గందరగోళం చేసే రకం. కానీ చెల్లెలు మాత్రం భలే చురుకైనది, చదువులో ఫస్టు, ఇంటి పనుల్లోనూ దిట్ట. చిన్నప్పటి నుంచీ ఆ అన్నకి తన చెల్లెలు అంటే ఒక రకమైన కుళ్లు. తను ఏమీ చేయలేకపోతుంటే, చెల్లెలు మాత్రం అన్నిట్లో పేరు తెచ్చుకుంటుందని లోపల రగిలిపోతుంటాడు. ఆ ఇద్దరి మధ్య ఎప్పుడూ ఎలాకా-పిల్లి గొడవలే, ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. కథ ఇలా సాగుతుండగా, ఆ చెల్లెలు జపాన్ నుంచి తిరిగి వచ్చి ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అక్కడ ఆమెకు ఒక మంచి కుర్రాడు పరిచయమై, ఇద్దరూ ప్రేమలో పడతారు. ఈ విషయం తెలుసుకున్న అన్నకి తన చెల్లెలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తనేం కావాలి అన్న భయం ఒక పక్క పట్టుకుంటుంది.

అంతేకాకుండా ఆమెకు ఏదైనా మంచి జరిగితే ఓర్చుకోలేని కుళ్ళు కూడా ఇంకో పక్క ఉంటుంది. అందుకే ఆ ఆమెకు కాబోయే మొగుడి ముందు చెల్లెలి గురించి లేనిపోనివన్నీ చెప్పి, వాళ్ళ ప్రేమను చెడగొట్టడానికి నానా తిప్పలు పడతాడు. చివరికి ఆ అన్న చేసే పనుల వల్ల చెల్లెలు విసిగిపోయి, వాళ్ళ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు గానీ ఆ అన్నకు అర్థం కాదు, తను ఎంత తప్పు చేస్తున్నాడో. బయటకు ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా లోపల అన్నచెల్లెళ్ల బంధం ఎంత గట్టిదో సినిమా చివరలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ఇన్నాళ్లూ చెల్లెలిని ఆటపట్టించిన ఆ అన్న, ఆమె దూరం అవుతుంటే ఎంత బాధపడతాడో చూసేవాళ్ళకి కన్నీళ్ళు వస్తాయి.

Advertisement

Read Also : వెన్నులో వణుకు పుట్టించే జాంబీల దండయాత్ర… కలలోను వెంటాడే హారర్ సీన్లు

Tags

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×