E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ, ఇందులను చూసిన నందు

Brahmamudi Serial Today Episode April 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ, ఇందులను చూసిన నందు
Advertisement

Brahmamudi serial today Episode:  క్యాటరింగ్‌ బాయ్స్‌ లాగా వేషాలేసుకుని వచ్చిన రాజు, లక్కీలకు జాగ్రత్తలు చెప్పి లోపలికి వెళ్లిపోతుంది ఐశ్వర్య. ఇద్దరూ ఐశ్వర్య వెనకే లోపలికి వెళ్లబోతుంటే.. మీరెక్కడికి వస్తారు… నా వెనకాలే వస్తే.. అందరికీ అనుమానం వస్తుంది. లోపల ఇంకా ఏమీ స్టార్ట్‌ కాలేదు.. మీరు తర్వాత లోపలికి రండి.. గుర్తు పెట్టుకోండి ఇందు కేక్‌ కట్‌ చేసే సమయంలోనే కిడ్నాప్‌ చేయాలి అని చెప్పి వెళ్లిపోతుంది ఐశ్వర్య.

లోపల భ్రమరాంబ డెకరేట్‌ చేసేవాళ్ల మీద అరుస్తుంది. ఇంకా ఏదీ రెడీ కాలేదేంటి అంటూ నిలదీస్తుంది. బొకే ప్లవర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాం..  అది రాగానే అయిపోతుంది మేడం అంటూ మేనేజర్‌ చెప్పగానే.. ఇంలో నందు ప్లవర్స్‌ పట్టుకుని వస్తుంది. నందును చూసిన రాజు, లక్కీలు షాక్‌ అవుతారు. ఇంతకీ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చినట్టు అన్ని ప్లవర్స్‌ పట్టుకుందేంటి అంటూ లక్కీ అనుమానంగా భయపడుతుంటాడు. రాజు ఆ అమ్మాయి చాలా డేంజర్‌ రా  ఆరోజు మనల్ని చూసిందేమో ఎందుకైనా మంచిది మనం మాస్కులు వేసుకునే ఉందాం అనుకుని ఇద్దరు లోపలికి వెళ్తుంటారు. ఇంతలో ఇందు ఏంజెల్‌ లా రెడీ అయి కారులో వచ్చి దిగుతుంది. ఇందును చూసిన నందు తను ఏంటి ఇక్కడ ఉంది..? అనుకుంటుంది. ఇంతలో అపర్ణ ఇందు దగ్గరకు రాగానే.. నందు అపర్ణను చూసి షాక్‌ అవుతుంది. నాన్నమ్మ అంటూ ఎమోషనల్‌ అవుతుంది.

Advertisement

ఇందు దగ్గరకు వెళ్లిన అపర్ణను అక్క ఎలా ఉంది అంటూ స్వాతి అడగ్గానే.. నందు ఎమోషనల్‌ అవుతూ.. అంటే అక్కా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అపర్ణ మాత్రం ఇందును తిడుతుంది. రేఖ ఇచ్చిన బట్టలు కాబట్టి నచ్చడం లేదు. అయినా నీకు ఏం చెప్పాను అనగానే.. ఇందు ఇప్పుడేం మాట్లాడకు నాన్నమ్మ ఇప్పుడు నాకు కావాల్సింది మీ ఆశీర్వాదం ఆశీర్వదించు అనగానే.. అపర్ణ సంతోషంగా ఉండు అని కూడా మనసారా దీవించలేకపోతున్నాను. నువ్వు అనుకున్నది జరగాలి. అది అందరికి మంచి జరగాలి అని చెప్తుంటే.. స్వామి మాత్రం పాపం నాన్నమ్మకు నేను వేసిన కిడ్నాప్‌ ప్లాన్‌ తెలియక టెన్షన్‌ పడుతుంది అని మనసులో అనుకుంటుంది. నందు మాత్రం ఎమోషనల్‌గా అంటే ఇన్ని రోజులు నేను తిరుగుతున్నది నా అక్కతోనా..? అని మనసులో అనుకుంటుంది. కారు చాటు నుంచి చూస్తున్న రాజు కూడా తదేకంగా ఇందును చూస్తుంటాడు.

లక్కీ ఏంటి మావా అలా చూస్తున్నావు.. అని అడగ్గానే.. ఇన్ని రోజులు ఇది  మన మీద పడిపోతుంటే దీన్ని రాక్షసి అనుకున్నానురా..? అనగానే.. లక్కీ మరి ఇప్పుడేం అనుకుంటున్నావు.. అని అడగ్గానే.. అందాల రాక్షసి అనుకుంటున్నాను ఇంత అందాల రాక్షసిని కిడ్నాప్‌ చేయడంలో తప్పు లేదురా..? అంటాడు. ముందు మాస్క్‌ పెట్టుకో మావా దొరికితే కుళ్ల బొడిచేస్తారు.. అంటాడు. ఇంతలో ఇందు, అపర్ణ, స్వాతి లోపలికి వెళ్తారు. నందు ఏడుస్తుంటే.. పక్కనే ఉన్న వాళ్ల బాబాయ్‌ ఏంటమ్మా ఏడుస్తున్నావు.. ఇన్నేండ్లలో నీ కళ్లల్లో ఒక్కసారి కూడా నీళ్లు చూడలేదు.. ఇప్పుడు ఏడుస్తున్నావేంటి..? అని అడగ్గానే.. ఇన్నేండ్ల తర్వాత మా అక్క కనిపించింది బాబాయ్‌ అని చెప్పగానే..

Advertisement

ఎవరమ్మా మీ అక్కా  అని వాళ్ల బాబాయ్‌ అడగ్గానే.. ఇందాక కారులోంచి దిగిన అమ్మాయి. తను నా అక్క అని తెలియకుండానే తనతో కలిసి తిరిగాను.. ఆ పక్కనే ఉన్నది మా నాన్నమ్మ అంటూ లోపలికి వెళ్లబోతూ ఆగిపోతుంది. ఎందుకమ్మా ఆగిపోయావు.. అందరూ నీ వాళ్లే కదా వెల్లు వెళ్లి పలకరించు అని చెప్పగానే.. నేను అనుకున్నది పూర్తి చేయకుండా కలవను పోలీస్‌ అయ్యి ఎప్పటికైనా రేఖ మీద గెలవాలని మా అక్కకు తోడుగా నిలవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నేను వెళితే నన్ను పోలీస్‌ కాకుండా రేఖ అడ్డుకుంటుంది అంటూ రేఖ గురించి చెప్పి బాధపడుతుంది నందు.

మరోవైపు లోపలికి వెళ్లిన ఇందు, స్వాతితో కిడ్నాపర్స్‌ తో మాట్లాడావా..? కిడ్నాప్‌ చేయడానికి వస్తున్నారా..? అని అడుగుతుంది. స్వాతి మాట్లాడిన కిడ్నాపర్లు కూడా వెయిటర్స్‌ గెటప్‌ వేసుకుని వస్తారు. రాజు, లక్కీలకు ఎదురుపడతారు. నలుగురి మధ్య కామెడీ జరుగుతుంది.

మరోవైపు లోపల భ్రమరాంబ వెల్లి అపర్ణను తిడుతుంటే.. నందు చూస్తుంది. తర్వాత భ్రమరాంబ వెనకాలే పైకి వెళ్లి మీద ముసుగు వేసి పిచ్చకొట్టుడు కొడుతుంది. కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. భ్రమరాంబ లేచి అటూ ఇటూ చూసి అమ్మో అంటూ బాధపడుతుంది. ఇంతలో అక్కడికి శేషు వచ్చి ఏంటే ఈ అవతారం అంటూ అడగ్గానే.. భ్రమరాంబ తనను ఎవరో కొట్టారని చెప్తుంది. శేషు మంచి చాన్స్‌ మిస్‌ అయిపోయాను అంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Podarillu Today Episode : మాధవ్ కు ఏమైంది..? చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పెళ్లి చూపులు ఫిక్స్..?

Big Stories

Advertisement
×