E-Paper
Advertisement

Romantic Comedy OTT : జీవీ ప్రకాష్ కొత్త రొమాంటిక్ మూవీ… ఏ ఓటీటీలో చూడచ్చో తెలుసా ?

Romantic Comedy OTT : జీవీ ప్రకాష్ కొత్త రొమాంటిక్ మూవీ… ఏ ఓటీటీలో చూడచ్చో తెలుసా ?
Advertisement

Romantic Comedy OTT : జి.వి. ప్రకాష్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘హ్యాపీ రాజ్’. ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమాగా ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది ఈ తమిళ సినిమా. అటు సంగీత దర్శకుడిగా, ఇటు కథానాయకుడిగా ఇతను మల్టీ టాలెంట్ తో దూసుకెళ్తున్నాడు. తమిళ, తెలుగు ప్రమోషన్లకు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. ఇక ఈ సినిమా నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర నిర్మాతలు ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ట్రైలర్‌ లాంచింగ్ లో హీరో ధనుష్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అయితే థియేటర్ రిలీజ్ కి ముందే దీని స్ట్రీమింగ్ హక్కులను ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. మరి ఆ విషయాలపై కూడా ఓ లుక్ వేద్దాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే 

జి.వి. ప్రకాష్ నటించిన ‘హ్యాపీ రాజ్’ మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. ఇక దీని స్ట్రీమింగ్ హక్కులను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో రిలీజ్ తర్వాతనే ఈ చిత్రం ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమ్ అవుతుంది. ఈ ప్లాట్‌ఫామ్ ఏప్రిల్ నెలాఖరులో పలు భాషల్లో ప్రీమియర్ చేస్తుందని భావిస్తున్నారు. మరియా రాజా ఎలాంచెజియన్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి.వి. ప్రకాష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ నటుడు అబ్బాస్ తమిళ చిత్రసీమలోకి చాలా కాలం తరువాత ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీ గౌరీ ప్రియ, జార్జ్ మేరియన్, గీతా కైలాసం తదితరులు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఇక ఈ తమిళ సినిమాను, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ, ఇప్పుడు తెలుగులో విడుదల చేస్తున్నట్లు ఒక ప్రకటన కూడా చేసింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హ్యాపీ రాజ్ ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ సినిమా ఎక్కువ శాతం కథానాయకుడి చుట్టూ తిరుగుతుంది. అతను చాలా సరదాగా ఉండే వ్యక్తి. తనతో డేటింగ్ చేయడానికి ఒక అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే చాలా మందితో డేటింగ్ కి ప్రయత్నాలు చేస్తాడు, కానీ అన్ని ప్రయత్నాలు బెడిసి కొడుతుంటాయి. చివరికి ఒక మహిళ అతనితో డేటింగ్ చేయడానికి ఒప్పుకుంటుంది. కానీ ఆమె తల్లిదండ్రులు ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో సమస్యలు మొదలవుతాయి. చివరికి హీరో డేటింగ్ ను పూర్తి చేస్తాడా ? అతనికి వచ్చిన సమస్యలు ఏమిటి ? అనే విషయాలను, తొందరలో రాబోతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ను చూసి తెలుసుకోండి.

Read Also : కోరిక తీర్చి మాయం చేసే టీచర్… టెన్షన్ పెట్టించే ఒక్కో స్టూడెంట్ మిస్సింగ్ కేసు… అదిరిపోయే కొరియన్ మిస్టరి

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×