E-Paper
Advertisement

Romantic Comedy OTT : ఇద్దరమ్మాయిల ముద్దుల ప్రియుడు… చూసే కొద్దీ చూడాలనిపించే స్టోరీ

Romantic Comedy OTT : ఇద్దరమ్మాయిల ముద్దుల ప్రియుడు… చూసే కొద్దీ చూడాలనిపించే స్టోరీ
Advertisement

Romantic Comedy OTT : రొమాంటిక్ సినిమాలు డిఫరెంట్ స్టైల్ లో వస్తుంటాయి. కొన్ని సినిమాలు అమాంతం ఆశ్చర్య పరుస్తుంటాయి ప్రేక్షకులను. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఇందులో హీరోకి ఎలాంటి శబ్ధాలైనా సంగీత ధ్వనుల్లా వినపడుతుంటాయి. దీంతో అతని లైఫ్ అన్ని రకాలుగా గందరగోళంలో పడుతుంది. ఈ సినిమా మొత్తం చాలా కలర్‌ఫుల్‌గా, కిర్రాక్ మ్యూజిక్ బీట్స్‌తో సాగుతుంది. లవ్ స్టోరీ అయితే భలే ఉంటుంది ఇద్దరమ్మాయిలతో.

ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘ముసికా’ (Música). రూడీ మాన్కుసో దీనికి దర్శకత్వం వహించి నటించారు. ఆయనతో పాటు కామిలా మెండిస్, జె.బి. స్మూవ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ప్రేమికులుగా నటించిన రూడీ మాన్కుసో, కామిలా మెండిస్ నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు. అందుకే స్క్రీన్ మీద వీళ్ళ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకు స్క్రిప్ట్ రాయడం, దర్శకత్వం వహించడం నటించడమే కాకుండా.. ఇందులోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలను కూడా రూడీ మాన్కుసో స్వయంగా కంపోజ్ చేశారు. ఇది 2024 ఏప్రిల్ 4న ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్ కు వచ్చింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇందులో హీరో రూడీ వింత సమస్య ఉంటుంది. అదేంటంటే, బయట వినిపించే రోడ్డు మీద హారన్లు, గిన్నెల చప్పుడు, కుళాయి నీళ్ల సౌండ్.. ఇలా ఏ శబ్దం వినిపించినా అతనికి అది ఒక రిథమ్ లాగా, ఒక మ్యూజిక్ లాగా వినిపిస్తుంది. దాంతో వాడు ఎవరితో మాట్లాడుతున్నా సరే, మధ్యలో వచ్చే శబ్దాల మీద పడిపోయి లోకాన్నే మర్చిపోతాడు. ఈ వ్యవహారం వల్ల అతనికి ఏ పని మీద ఏకాగ్రత ఉండదు, అంతా గందరగోళంగా ఉంటుంది. ఇక రూడీ పర్సనల్ లైఫ్ చూస్తే.. ఆల్రెడీ హేలీ అనే ఒక గర్ల్‌ ఫ్రెండ్ ఉంటుంది, కానీ అతని పిచ్చి పనులు పడలేక ఆమె బ్రేకప్ చెప్పేస్తుంది. ఆ బాధలో ఉండగానే ఒక ఫిష్ మార్కెట్‌లో మనోడికి ఇసాబెల్లా అనే పక్కా లోకల్ బ్రెజిలియన్ అమ్మాయి తగులుతుంది. ఈ కొత్త అమ్మాయి రూడీ లోని వింత ప్రవర్తనను కూడా ఇష్టపడుతుంది.

అటు పాత ప్రేయసి మళ్ళీ దగ్గరవ్వాలని చూడటం, ఇటు కొత్త అమ్మాయి మీద ఇష్టం పెరగడంతో రూడీ రెండు పడవల ప్రయాణం చేస్తూ నానా తిప్పలు పడతాడు. అయితే రూడీ తనకున్న ఆ వింత శబ్దాల జబ్బునే మ్యూజిక్ అనే బలమైన ఆయుధంగా మార్చుకుంటాడు. మరి రూడీ తనలోని లోపాన్ని పనికొచ్చేలా ఎలా వాడాడు ? ఆ ఇద్దరు అమ్మాయిల గొడవను ఎలా సెటిల్ చేసుకున్నాడు ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  మైండ్ బెండింగ్ థ్రిల్లర్ మావా… రాత్రి మొదలు పెడితే తెల్లారి వరకు… చూస్తే గజగజా వణికిపోవాల్సిందే

Related News

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

Big Stories

Advertisement
×