E-Paper
Advertisement

మతిమరుపు మొగుడితో కిలాడీ పెళ్లాం… మామూలుగా లేదు ఈ రచ్చ

మతిమరుపు మొగుడితో కిలాడీ పెళ్లాం… మామూలుగా లేదు ఈ రచ్చ
Advertisement

Romantic Comedy OTT :ఆడియన్స్ కి కంటెంట్ నచ్చితే చాలు, ఎలాంటి జానర్ అయినా హిట్ అయిపోతుంది. ఇక ఎక్కువగా ప్రేక్షకులు థ్రిల్లర్, కామెడీ కంటెంట్ నే ఇష్టంగా చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక రొమాంటిక్ కామెడీ సినిమా గురించి చెప్పుకోవాల్సిందే. ఈ సినిమాలో ఒక ప్రమాదంలో జ్ఞాపకశక్తిని కోల్పోయిన వ్యక్తిని ఒక మహిళ మోసం చేసి భార్యగా నటిస్తుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి కూడా. ఈ సినిమా అటు ఓటీటీలో, ఇటు థియేటర్లలో సూపర్ హిట్ కూడా అయింది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2014లో వచ్చిన ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘మై ఇల్లీగల్ వైఫ్’ (My Illegal Wife). టోనీ వై. రేయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పోక్వాంగ్, జాంజో మరుడో లీడ్ రోల్స్ లో నటించారు. ఈ జంట కలిసి నటించిన రెండో సినిమా ఇది. దీనికంటే ముందు 2010లో ‘సింకో’ (Cinco) అనే హారర్ సినిమాలో వీళ్ళు కలిసి నటించారు. ఈ చిత్రం 2014 జూన్ 11న ఫిలిప్పీన్స్‌ థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 109 నిమిషా రన్‌ టైమ్ తో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

క్లారీస్ అనే ఒక ఒంటరి మహిళ తన పిల్లల కోసం ఒక తండ్రి కావాలని, తనకో తోడు ఉండాలని కలలు కంటుంటుంది. ఒక విమాన ప్రయాణంలో ఆమెకు హెన్రీ అనే వ్యక్తి పరిచయమవుతాడు. మొదట అతను ఆమెను తిరస్కరిస్తాడు. అదే సమయంలో అనుకోకుండా జరిగిన విమాన ప్రమాదం వల్ల హెన్రీ తన పాత జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోతాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న క్లారీస్, తామిద్దరం జపాన్‌లో పెళ్లి చేసుకున్నామని, తనే అతడి భార్యనని అబద్ధం చెప్పి నమ్మిస్తుంది. పాపం ఏమీ గుర్తులేని హెన్రీ ఆమెను నిజంగానే తన భార్య అనుకుని ఆమె ఇంటికి వెళ్తాడు.

అక్కడ క్లారీస్ తన పిల్లలకు, కుటుంబానికి హెన్రీని భర్తగా పరిచయం చేసి ఒక దొంగ సంసారాన్ని మొదలుపెడుతుంది. కానీ క్లారిస్ కి లోపల ఒకటే భయం, ఎక్కడ వీడికి పాత విషయాలు గుర్తొస్తాయో అని! అతను స్నానం చేస్తున్నా, పడుకున్నా గతం గుర్తు రాకుండా చేయడానికి ఈమె చేసే కామెడీ మాములుగా ఉండదు. మధ్యలో వీళ్ళిద్దరి మధ్య కొంచెం రొమాన్స్ కూడా నడుస్తుంది. అయితే హెన్రీకి గతంలోనే ఎలెన్ అనే ప్రేయసి ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత హెన్రీకి మెల్లమెల్లగా తన పాత జ్ఞాపకాలు తిరిగి రావడం, అసలు విషయం బయటపడటంతో కథలో పెద్ద ట్విస్ట్ వస్తుంది. చివరికి తనను మోసం చేసిన క్లారీస్‌ను హెన్రీ క్షమించాడా? చివరకు వీరిద్దరూ నిజంగానే ఒక్కటయ్యారా? హెన్రీ పాత ప్రేమికురాలి సంగతి ఏంటి ? అన్నదే ఈ సినిమా ముగింపు.

Advertisement

Read Also : పిచ్చోడు అనుకున్నారు.. కానీ ప్రపంచాన్నే గెలిచాడు… క్లైమాక్స్ వరకు చూపు కూడా తిప్పలేరు

Related News

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×