E-Paper
Advertisement

ముద్దులు హగ్గులు పక్కన పెట్టి… ముచ్చట్లతోనే మురిపించే కొత్త రకం ప్రేమ

ముద్దులు హగ్గులు పక్కన పెట్టి… ముచ్చట్లతోనే మురిపించే కొత్త రకం ప్రేమ
Advertisement

Romantic Comedy OTT : ఓటీటీలోకి రకరకాల జానర్ లలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని స్టోరీలు చాలా భిన్నంగా ఉంటాయి. అలాంటి కంటెంట్ ను చూసే కొద్ది చూడాలనిపిస్తుంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూస్తే నిజమే అంటారు. అసలు ఈ కథ ఒక వింత ప్రవర్తన ఉండే అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. అసలు ఆ అబ్బాయి తాను గే అనే భ్రమలో ఉంటాడు. తనను తాను తెలుసుకొనేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో స్టోరీ కామెడీ మలుపులు తీసుకుంటుంది. ఇక ఈ సినిమా కేవలం 18 రోజుల్లో, లాస్ ఏంజిల్స్‌ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. దీని బడ్జెట్ 2.5 లక్షల డాలర్ల లోపే ఉండటం గమనార్హం.

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘స్ట్రెయిట్ అప్’ (Straight Up). 2019లో వచ్చిన ఈ సినిమాకు జేమ్స్ స్వీనీ దర్శకత్వం వహించడమే కాకుండా, ఆయనే ప్రధాన పాత్రలో నటించారు. జేమ్స్ స్వీనీ కి జోడీగా కాటి ఫిండ్లే నటించగా.. రాండల్ పార్క్, బెట్సీ బ్రాండ్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే, దర్శకత్వ శైలికి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. 2021లో ‘ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్’లో బెస్ట్ ఫస్ట్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఈ సినిమా నామినేట్ అయ్యింది. అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఇది ప్రదర్శించబడింది. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగానే అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథలో హీరో టాడ్ చాలా తెలివైనవాడు,కానీ కొంచెం తేడా టైపు. ఎప్పుడూ నీట్ గా ఉండాలి, ప్రతిదీ పద్ధతిగా ఉండాలి అనే ఒక రకమైన పిచ్చితో (OCD) బాధపడుతుంటాడు. పైగా అతనికి శృంగారం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇతని ప్రవర్తన చూసి వాళ్ల ఇంట్లో వాళ్లు, ఫ్రెండ్స్, అతని డాక్టర్ కూడా వీడు ‘గే’ (Gay) అని ఫిక్సైపోతారు. చివరకు తను కూడా అలాగే నమ్ముతాడు. ఆతరువాత మగవాళ్లతో డేటింగ్ చేసినా అతనికి ఏమాత్రం ప్రయోజనం ఉండదు.

ఒకరోజు లైబ్రరీలో అతనికి రోరీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. రోరీ నటి కావాలని ప్రయత్నిస్తుంటుంది. వారిద్దరి ఆలోచనలు, మాటలు బాగా కలుస్తాయి. టాడ్ ఆమెతో చాలా సౌకర్యంగా ఫీలవుతాడు. దాంతో తను అసలు ‘గే’ కాదేమో, కేవలం శృంగారం పట్ల ఆసక్తి లేని వ్యక్తిని (Asexual) ఏమో అని ఆలోచించడం మొదలుపెడతాడు. ఇక వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి, అసలు శృంగారం జోలికి వెళ్లకుండానే ఒక జంటలా కలిసి బతకడం స్టార్ట్ చేస్తారు.

Advertisement

కానీ లోకం ఊరుకోదు కదా! టాడ్ గే అని అందరూ అంటున్నా నువ్వెందుకు వాడితో ఉన్నావని రోరీని అందరూ పిచ్చిదానిలా చూస్తారు. అటు టాడ్ కి కూడా తన మీద తనకే అనుమానం మొదలవుతుంది. అసలు తాను ఎవరిని ప్రేమిస్తున్నాడు? తనకి కావాల్సింది ఏంటి? అనే కన్ఫ్యూజన్ లో పడతాడు. చివరగా ఈ వింత జంట మధ్య వచ్చిన గొడవలు, ఆ గందరగోళం నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేదే ఈ సినిమా క్లైమాక్స్

Read Also : ఆర్మీ అడ్డాలో అదిరిపోయే వేట… నిజాన్ని నిగ్గు తేల్చే మేజర్… క్రేజీగా ప్రతి ఎపిసోడ్

Tags

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×