E-Paper
Advertisement

థియేటర్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ ఎమోషనల్ స్టోరీ… ఆర్టిస్టులకు ఇదొక మాస్టర్ పీస్

థియేటర్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ ఎమోషనల్ స్టోరీ… ఆర్టిస్టులకు ఇదొక మాస్టర్ పీస్

Romantic Drama OTT : ఓటీటీలో ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే మూవీని చూడచ్చు. అయితే ఇది అందరికీ నచ్చకపోవచ్చు. బోల్డ్ సీన్స్ కూడా బాగానే ఉన్నా, విషయం ఉన్నోడికి మాత్రం ఇది ఒక పిచ్చెక్కిపోయే ప్రయోగం లాగా అనిపిస్తుంది. ఈ సినిమా కమర్షియల్ సినిమాల కంటే భిన్నంగా ఉంటుంది. పూణేలోని కాలేజీ థియేటర్ (నాటక రంగం) నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. రెగ్యులర్ సినిమాల్లాగా ఫైట్లు, డ్యాన్సులతో ఉండే మసాలా బొమ్మ అయితే కాదు ఈ మూవీ. ఒక కాలేజీ నాటకాల పోటీ చుట్టూ తిరిగే కథ ఇది. తన మాటే నెగ్గాలనే ఒక పొగరుబోతు గురువుకి, తనకంటూ ఒక కొత్త దారి వెతుక్కునే కుర్రాడికి మధ్య జరిగే గొడవ. డైరెక్టర్ ఈ సినిమాను చాలా వింతగా తీశాడు. డిఫరెంట్ గా ఆలోచించే ఆర్టిస్టులకు మాత్రం ఇది నచ్చుతుంది. అయితే ఇది ఫ్యామిలీతో చూడ దగ్గ సినిమా అయితే కాదు. దీనికి ‘A’ సరిఫికేట్ కూడా ఇచ్చారు. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ రొమాంటిక్ డ్రామా మూవీ పేరు ‘CRD’. 2017లో వచ్చిన ఈ సినిమాకు క్రాంతి కనడే దర్శకత్వం వహించారు. ఇందులో సౌరభ్ సరస్వత్, మృణ్మయీ గాడ్బోలే, వినయ్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా వెనుక ఉన్నోళ్లంతా గట్టి మనుషులే. దీనికి కెమెరామెన్ ఎవరంటే, ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డేనియల్ కాట్జ్. ఆయనతో పాటు మ్యూజిక్ అందించింది ఎమ్మీ అవార్డు గ్రహీత గార్త్ నూస్టాడ్టర్. పూణేలో ఫేమస్ అయిన ‘పురుషోత్తం కరండక్’ అనే డ్రామా పోటీల మీద పదేళ్ల రీసెర్చ్ చేసి మరీ ఈ సినిమా తీశారు. ఇది అందరికీ నచ్చే రెగ్యులర్ మసాలా సినిమా కాదు, కేవలం ఆర్టిస్టులకు మాత్రమే పిచ్చపిచ్చగా నచ్చుతుంది. అందుకే చాలా మంది విమర్శకులు దీన్ని ఇండియాలో తీసిన మోస్ట్ బోల్డ్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ సినిమాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఈ సినిమా ఇండియాలో 2017 సెప్టెంబర్ 29న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అంతకంటే ముందే 2016నవంబర్ 4న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఫారిన్ లో అయితే ఈ సినిమాకు చాలా పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే 

పూణేలో ఒక నాటకాల గ్రూపు ఉంటుంది. దానికి మయాంక్ అని ఒక కోచ్ ఉంటాడు. అతను మామూలోడు కాదు, అదో రకమైన సైకో. నాటకాల్లో అవార్డులు కొట్టాలని నటుల రక్తం తాగుతుంటాడు. బూతులు తిడుతూ, టార్చర్ పెడుతూ వాళ్ళతో పని చేయించుకుంటాడు. ఈ సమయంలో హీరో చేతన్ అతని దగ్గరే స్టూడెంట్ గా చేరతాడు. కానీ ఆ కోచ్ చేసే వెధవ పనులు, వాడు చూపించే పొగరు నచ్చక వాడికి ఎదురు తిరుగుతాడు. అంతేకాదు ఆ గ్రూపు నుండి బయటపడి తన సొంతంగా ఇంకో టీమ్‌ని సెట్ చేసుకుంటాడు. ఆ ప్రాసెస్ లో పర్సిస్ అనే అమ్మాయిని కూడా తన వైపు తిప్పుకుంటాడు. ఆ సైకో కోచ్ నేను చెప్పిందే రూలు, నేనే తోపు అంటే.. హీరో మాత్రం కళ అంటే ఫ్రీడమ్, నీలాగా గొర్రెల్లాగా ఆడించడం కాదని సవాల్ విసురుతాడు. చివరికి ఆ పాత గురువుకి, ఈ కొత్త శిష్యుడికి మధ్య అసలైన యుద్ధం మొదలవుతుంది. ఈ రెండు టీం లు ఒక చోట పోటీ పడతారు. ఆ నాటక పోటీలో ఎవడు ఎవడి మీద గెలిచాడు? ఆ సైకో గురువు అహాన్ని హీరో ఎలా దించాడు? అన్నదే ఈ సినిమా అసలు మ్యాటర్.

Read Also : భూమి మీద భారీ విధ్వంసం… మంచు కొండల్లో ఇరుక్కుపోయిన ఫ్యామిలీ… తెలుగులోనూ స్ట్రీమింగ్

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×