E-Paper
Advertisement

Romantic Horror Comedy OTT : ప్రేమలో పడే అందమైన దెయ్యం… పొట్ట చెక్కలయ్యే కామెడీతో రచ్చ రంబోలా

Romantic Horror Comedy OTT :  ప్రేమలో పడే అందమైన దెయ్యం… పొట్ట చెక్కలయ్యే కామెడీతో రచ్చ రంబోలా
Advertisement

Romantic Horror Comedy OTT : కామెడీ హారర్ సినిమాలు యమ క్రేజీగా నడుస్తున్నాయి. ఏ భాషలో ఉన్నా కంటెంట్ కనెక్ట్ అయిపోతున్నారు ప్రేక్షకులు. రీసెంట్ గా తెరికెక్కిన లో బడ్జెట్ సినిమాలే 100 కోట్ల కలెక్షన్స్  దాటిపోతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ఒక సూపర్ హిట్ థాయిలాండ్ మూవీ గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాలో కామెడీ కంటెంట్ అంత చక్కగా ఉంటుంది. ఒక ఫీల్ గుడ్ మూవీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది మొదటి పార్ట్ హిట్ అవడంతో రెండో పార్ట్ కూడా ఈ మధ్యనే థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సుమారు 2 గంటల 5 నిమిషాల పాటు ఉన్న ఈ సినిమాలో భయం కంటే నవ్వులే ఎక్కువగా ఉంటాయి.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ థాయ్ రొమాంటిక్ హారర్ కామెడీ సినిమా పేరు ‘మై బూ’ (My Boo). 2024లో వచ్చిన ఈ సినిమాకు ఖోంక్రిత్రి త్రివిమోల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మేలడా సుశ్రీ, సుత్తిరక్ సుబ్విజిత్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటిటి ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంది. దీనిని తెలుగు ఆడియోతో కూడా చూడవచ్చు. ఐయండిబిలో ఈ సినిమాకు 6.2/10 రేటింగ్ ఉంది. ప్రేక్షకులు దీనిని ఒక మంచి ఫీల్ గుడ్ హారర్ కామెడీగా అభివర్ణించారు. థాయ్‌లాండ్‌లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అక్కడ సుమారు 150 మిలియన్ బాట్ కంటే ఎక్కువ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా సాధించిన ఘనవిజయంతో దీనికి రెండో భాగం కూడా రూపొందించారు. ‘మై బూ 2’ థాయ్‌లాండ్‌లో 2025 అక్టోబర్ 30న విడుదలైంది. రెండో భాగంలో హీరో టైమ్ ట్రావెల్ చేసి తన ప్రియురాలైన అనోంగ్ గత జన్మల గురించి తెలుసుకోవడం వంటి ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఈ సినిమాను చూడాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

హీరో జోకి వాళ్ల నానమ్మ నుంచి ఒక పాత కాలపు పెద్ద బంగ్లా వారసత్వంగా వస్తుంది. అప్పుల్లో ఉన్న హీరో, ఆ ఇంటిని అమ్ముకుని సెటిల్ అయిపోదామని అక్కడికి వెళ్తాడు. తీరా చూస్తే ఆ ఇంట్లో ముగ్గురు దయ్యాలు తిష్ట వేసి ఉంటాయి. అందులో ఒక అందమైన అమ్మాయి దయ్యం పేరు అనోంగ్. ఆ దయ్యాలు ఎవరినీ లోపలికి రానివ్వకుండా భయపెడుతుంటాయి. హీరో మొదట హడలిపోయినా, మెల్లగా ఆ దయ్యాలతోనే దోస్తీ కడతాడు. ఇంట్లో ఉన్నవి ఒరిజినల్ దయ్యాలని ఎవరికీ తెలియదు కాబట్టి, హీరోకి ఒక క్రేజీ ఐడియా వస్తుంది. ఆ దయ్యాలతో ఒప్పందం కుదుర్చుకుని, ఆ పాత బంగ్లాను ఒక ‘హంటెడ్ హౌస్’ టూరిస్ట్ స్పాట్‌గా మారుస్తాడు. జనం దయ్యాలను చూసి భయపడి పారిపోతుంటే, హీరోకి మాత్రం కాసుల వర్షం కురుస్తుంది.

ఈ క్రమంలోనే హీరోకి, ఆ అందమైన దయ్యం అనోంగ్‌కి మధ్య లవ్ ట్రాక్ మొదలవుతుంది. మనిషికి, దయ్యానికి మధ్య నడిచే ఈ లవ్ స్టోరీ భలే కామెడీగా సాగుతుంది. కానీ కథ అక్కడితో ఆగదు. ఆ దయ్యాలు ఎందుకు చనిపోయాయి? ఆ ఇంటికి ఉన్న అసలు రహస్యం ఏంటి? అనేది మెల్లగా బయటపడుతుంది. మనిషికి, దయ్యానికి పెళ్లి జరగదు కదా, మరి వీరిద్దరి ప్రేమ ఏమౌతుంది? అనేదే అసలు పాయింట్. కామెడీతో పాటు చివర్లో కొంచెం ఎమోషనల్ సీన్స్‌తో సినిమా ముగుస్తుంది.

Advertisement

Read Also :  అట్లాంటిక్ అలల సాక్షిగా విడిపోయే ప్రేమ జంట… 35 ఏళ్లకు కలిసినా చెరిగిపోని జ్ఞాపకాలు… ఇదొక అంతులేని ఆవేదన

Tags

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×