E-Paper
Advertisement

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?
Advertisement

Oho Enthan Baby OTT : ప్రతివారం కొత్త సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ శుక్రవారం కూడా ఓటీటీలోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. తాజాగా మరో రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. క్యూట్ లవ్ స్టోరీ తో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకుంది. గుత్తా జ్వాల భర్త, తమిళ నటుడు విష్ణు విశాల్ సోదరుడు రుద్ర ను కథానాయకుడిగా అరంగేట్రం చేయిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ఓహో ఎంతన్ బేబీ.. ఈ మూవీ ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది.. మరి దీన్ని ఎక్కడ చూడాలి అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

ఓటీటీలోకి ‘ఓహో ఎంతన్ బేబీ’..

Advertisement

ఈమధ్య రొమాంటిక్ స్టోరీ గా వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది.. థియేటర్లలో సక్సెస్ టాక్ ని అందుకున్న ఈ మూవీ.. ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. రోటీన్ సినిమానే అనిపించిన స్క్రీన్ ప్లే, మూవీ సాగిన విధానం అంతా యూత్‌కు ఫుల్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఫస్టాప్ కాస్త స్లోగా సాగిన సెకండాఫ్ ఇంట్రెస్ట్రింగ్‌గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ముద్దులు అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో యువత బాగా ఈ సినిమాని చూడడానికి ఆసక్తి చూపించారు. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో మాతృక తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.. ఇక్కడ మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి..

Also Read: మీనాకు షాకిచ్చిన పోలీసులు.. రోహిణికి దొరికిపోయిన కల్పన..

Advertisement

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన క్యూటీ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ యూత్ ను బాగా ఆకట్టుకుంది. కృష్ణకుమార్ రామ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం గత నెల జూలై 11న థియేటర్లలోకి వచ్చి ఫర్వాలేదని అనిపించుకుంది. విశ్వక్ సేన్ ఓ మై బేబీ ఫేమ్ మిథిలా పాల్కర్, అంజు కురియన్ , వైభవి తాండ్లే, డైరెక్టర్ మిస్కిన్ లతో పాటుగా పలువురు ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించారు. ఇందులో హీరోకు సినిమాలంటే పిచ్చి ఉంటుంది. అశ్విన్‌కు ఎప్పటికైనా దర్శకుడిగా అవాలనే కోరిక బలంగా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో హీరో విష్ణు విశాల్‌కు ఇంతవరకు తను చేయని స్టోరీతో చెయ్యాలని అనుకున్నాడు.. అదేవిధంగా ఈ స్టోరీ తో ప్రేక్షకులను పలకరించాడు. మొదటి హాఫ్ యావరేజ్ గా ఉన్నా రెండో పాట మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తుంది. దీంతో పాటుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×