E-Paper
Advertisement

Romantic Science Fiction: టైమ్ ట్రావెల్ చేస్తూ కాపురమా? మెంటలెక్కించేసింది మావా స్టోరీ…

Romantic Science Fiction: టైమ్ ట్రావెల్ చేస్తూ కాపురమా? మెంటలెక్కించేసింది మావా స్టోరీ…
Advertisement

Romantic Science Fiction : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కి ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. వీటికి స్టోరీ ఏమాత్రం కొంచెం బాగుంటే చాలు, ఆ సినిమాలకి డోకా ఉండదు. ఇక ఓటీటీలో ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కేవలం రొమాంటిక్ జానర్ లో అదరగొట్టింది. ఇందులో హీరోకి జన్యుపరమైన సమస్య ఉంటుంది. దీంతో అతను ఉన్నట్టుండి పాస్ట్, ఫ్యూచర్ కి ట్రావెల్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక ప్రేమ కథ మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి అసలు కథ ఉంటుంది. క్లైమాక్స్ అయితే మెంటలెక్కిపోతుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

ఈ అమెరికన్ రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా పేరు ‘ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్’ (The Time Traveler’s Wife). ఆడ్రీ నిఫెనెగర్ రచయిత్రి రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఇది వరల్డ్ వైడ్ భీభత్సమైన హిట్ అయ్యేసరికి, హాలీవుడ్ వాళ్ళు ఎగబడి ఈ సినిమా తీశారు. ఇందులో ఎరిక్ బానా (హెన్రీ డిటాంబుల్), రాచెల్ మాక్ ఆడమ్స్ (క్లేర్) లీడ్ రోల్స్ లో ఉన్నారు. నిజానికి ఈ సినిమా తీయడానికి చాలా ఏళ్లు పట్టింది. మొదట బ్రాడ్ పిట్, జెన్నిఫర్ అనిస్టన్ లు ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ విడిపోయాక, ప్రాజెక్ట్ లేట్ అయ్యి చివరికి 2009లో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా వచ్చి పదేళ్లు దాటాక, 2022లో ‘HBO’ వాళ్ళు ఇదే కథతో ఒక టీవీ సిరీస్ తీశారు. అందులో ఇంకొంచెం క్లారిటీగా, ఎక్కువ సేపు కథను సాగదీసి చూపించారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హెన్రీ అనే కుర్రాడికి ఒక వింత జన్యుపరమైన సమస్య ఉంటుంది. అతను ఎప్పుడు, ఎక్కడ ఉంటాడో అతనికే తెలియదు. అకస్మాత్తుగా గాల్లో కలిసిపోయి పాస్ట్ లోకో, ఫ్యూచర్ లోకో వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్ళిన ప్రతిసారి ఒంటి మీద బట్టలు ఉండవు, చేతిలో పైసా ఉండదు. దొంగతనాలు చేస్తూ, దెబ్బలు తింటూ సర్వైవ్ అవ్వడమే అతని పని. ఈ క్రమంలోనే అతను ఫ్యూచర్ నుండి వెనక్కి వచ్చి, చిన్న పిల్లగా ఉన్న క్లేర్ అనే అమ్మాయికి పరిచయం అవుతాడు. క్లేర్ పెద్దయ్యాక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్ళాం పక్కన ఉన్నప్పుడు కూడా అతను అకస్మాత్తుగా మాయమైపోతుంటాడు. క్లేర్ ఏమో అతను ఎప్పుడు వస్తాడో అని కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూడాల్సి వస్తుంది.

ఇక వీళ్ళకి పుట్టబోయే పిల్లలకి కూడా అదే సమస్య వస్తుందని భయం, ఇంకోవైపు తన భర్త తన కళ్ళ ముందే మాయమవ్వడం చూసి ఆ అమ్మాయి పడే నరకం అంతా ఇంతా కాదు. ఇంతలోనే హెన్రీకి తన చావు ఎప్పుడో కూడా తెలిసిపోతుంది. చివరికి ఈ ముగింపు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. హెన్రీ ఇందులో చనిపోతాడా ? తన కూతురుకి కూడా ఈ సమస్య ఉటుందా ? క్లేర్ కి ఎదురు చూపులు తప్పావా ? అనే విషయాలను, ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న వెండితెర అద్భుతం… గుండెలను హత్తుకునేలా సిద్ధాంత్-మృణాల్ లవ్ స్టోరీ.. ఎప్పుడు ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×