OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చుడటానికి ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమాలు ఇప్పుడు ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, సత్యమంగళం అడవుల్లో 30 ఏళ్లుగా మూసివేసిన ఒక మిస్టీరియస్ రూట్‌లో జరిగే భయంకరమైన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా భయం, ఎమోషనల్ తో ఒక రివెంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. పోలీసుల రెస్క్యూ ఆపరేషన్‌తో కథ క్లైమాక్స్‌కి చేరుతుంది. ఈ సినిమా పేరు ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
‘రూట్ నంబర్ 17’ (Route No 17) అభిలాష్ జి. దేవన్ డైరెక్ట్ చేసిన తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా. ఇందులో జితన్ రమేష్ (ఫ్రెడ్డీ), అంజు సాసి (అంజన), అఖిల్ ప్రభాకర్ (కార్తీక్), హరీష్ పెరడి ప్రధాన రోల్స్‌లో నటించారు. ఈ సినిమా 2023 డిసెంబర్ 29న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు Amazon Prime Video లో స్ట్రీమింగ్‌లో ఉంది. 1 గంట 52 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDb లో 8.1/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళ్తే
సత్యమంగళం అడవుల్లో 30 ఏళ్ల క్రితం రూట్ నంబర్ 17 ఓపెన్‌గా ఉండేది. కానీ మిస్టీరియస్ కారణాలతో దానిని మూసేశారు. ఈ రూట్‌లోకి వెళ్లినవాళ్లు ఆ రాత్రే చనిపోతున్నారని తెలుస్తుంది. కథ ఫ్లాష్‌బ్యాక్‌తో మొదలవుతుంది. ఫ్రెడ్డీ అనే ఒక ఇంజనీర్, ఒక పవర్‌ఫుల్ పొలిటీషియన్ తో గొడవ పడతాడు. దీని వల్ల ఫ్రెడ్డీ జీవితం తల్లకిందులవుతుంది. ఈ గొడవ వల్ల ఫ్రెడ్డీ అడవిలోని ఒక భయంకరమైన స్థితికి చేరుకుంటాడు. అక్కడ అతను ఒక రహస్య కేవ్‌లో ఉంటూ, రూట్‌లోకి వచ్చే వాళ్లను టార్గెట్ చేస్తుంటాడు. ప్రజెంట్ లో అంజన, కార్తీక్ అనే లవర్స్ సిటీ నుండి దూరంగా సమయం గడపడానికి ఈ రూట్‌లోకి వెళ్తారు. కానీ వాళ్లు ఫ్రెడ్డీకి చిక్కి, అతని భయంకరమైన అండర్‌గ్రౌండ్ కేవ్‌లో బందీలవుతారు.
Read Also : సొంత కూతురితో ఆ పని కోసం అబ్బాయిని వెతికే తండ్రి… మైండ్ బెండింగ్ మలయాళ స్టోరీ