OTT Movie : కొన్ని వెబ్ సిరీస్ లు సోషల్ మెసేజ్ తో ఆకట్టుకుంటాయి. భిన్నమైన కథలతో ఇలాంటి సిరీస్ లు ఓటీటీలోకి వస్తూనే ఉన్నాయి. ఒక్కో స్టోరీ ఓక్కో సందేశాన్ని ఇస్తుంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ సిరీస్ లో ఒక యువతి డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకోవడానికి 100 ఏళ్ల నాటి అనాగరిక ఆచారాలను ఎదిరిస్తుంది. హార్డ్-హిట్టింగ్ డైలాగ్ లతో ఈ సిరీస్ హీట్ పుట్టిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
కథలోకి వెళ్తే
1990లో పుదుక్కోట్టై జిల్లాలోని వీరప్పన్నై అనే గ్రామంలో ఈ కథ జరుగుతుంది. ఈ గ్రామంలో 100 ఏళ్ల నాటి ఆచారాన్ని ఇంకా పాటిస్తుంటారు. బాలికలు మెచ్యూర్ అయిన వెంటనే పెళ్ళి చేసేస్తుంటారు. లేకపోతే అయలి దేవత శపించి గ్రామానికి కీడు తెస్తుందని నమ్ముతారు. ఈ ఆచారం వల్ల బాలికలు తొమ్మిదో తరగతి తర్వాత చదువును మానేసి, చిన్న వయసులోనే పెళ్లి పీటలు ఎక్కుతుంటారు. ఇక్కడ తమిళ్‌సెల్వి తొమ్మిదో తరగతి చదువుతూ, డాక్టర్ కావాలనే కలతో ఉంటుంది. కానీ ఆమె మెచ్యూర్ అయితే, ఆమెకి కూడా పెళ్లి చేయాలని గ్రామస్తులు అనుకుంటారు. అయితే తమిళ్‌సెల్వి ఈ అనాగరిక ఆచారాన్ని పాటించకుండా ఉండటానికి ఈ విషయాన్ని దాచిపెడుతుంది. ఆమె తల్లి కురువమ్మల్ మొదట్లో సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నప్పటికీ, క్రమంగా కూతురి కలలకు మద్దతుగా నిలుస్తుంది.
తమిళ్‌సెల్వి స్నేహితురాలు మైథిలి మెచ్యూర్ అయ్యాక చదువు మానేసి, ఇంటి పనులు చెపిస్తుంటారు ఆమె కుటుంబ సభ్యులు. ఇది తమిళ్‌సెల్వికి చదువుకోవాలనే పట్టుదలను మరింత పెంచుతుంది. గ్రామ పెద్దలు, ముఖ్యంగా ఊరి నాయకుడి కొడుకు శక్తివేల్, ఈ ఆచారాలను కఠినంగా అమలు చెపిస్తుంటాడు. కానీ తమిళ్‌సెల్వి తన తెలివితేటలతో వారిని ఎదిరిస్తుంది. తమిళ్‌సెల్వి గ్రామంలోని ఇతర స్త్రీలలో కూడా చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తుంది. ఒక దశలో ఆమెను శక్తివేల్‌తో వివాహం చేయాలని నిర్ణయిస్తారు. కానీ గ్రామంలోని స్త్రీలు ఏకమై, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. చివరికి తమిళ్‌సెల్వి తన చదువును కొనసాగిస్తుందా ? పెళ్ళి చేసుకుంటుందా ? ప్రజల్లో చైతన్యం తెస్తుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి.
జీ5లో స్ట్రీమింగ్
‘అయలి’ (Ayali) అనేది ముత్తుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ వెబ్ సిరీస్. ఇందులో అబి నక్షత్ర, అనుమోల్, మదన్, లింగ, సింగంపులి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఎనిమిది ఎపిసోడ్‌ల సిరీస్ 2023 జనవరి 26న జీ5లో తమిళం, తెలుగు భాషల్లో ప్రీమియర్ అయింది. 2023లో OTTplay అవార్డ్స్‌లో “బెస్ట్ వెబ్ సిరీస్” అవార్డును గెలుచుకుంది. IMDbలో 7.6/10 రేటింగ్ ని పొందింది.
Read Also : అమ్మాయిలు కన్పిస్తే చాలు అల్లాడిపోయే ఆటగాడు… కోడల్ని కూడా వదలకుండా… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే