BigTV English

Sabdham Movie OTT : కాలేజ్ లో 42 ఆత్మలు… ఆది పినిశెట్టి హర్రర్ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్ కు డేట్ ఫిక్స్

Sabdham Movie OTT : కాలేజ్ లో 42 ఆత్మలు… ఆది పినిశెట్టి హర్రర్ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్ కు డేట్ ఫిక్స్

Sabdham Movie OTT : తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ హీరో ఆది పినిశెట్టి (Adhi Pinishetty). ఆయన నటించిన సరికొత్త హర్రర్ మూవీ ‘శబ్దం’ (Sabdham Movie) ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. మంచి హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మిక్స్డ్  టాక్ వచ్చింది. అయితే హర్రర్ మూవీ కావడంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. మరి ‘శబ్దం’ మూవీని ఏ ఓటీటీలో, ఎప్పుడు చూడొచ్చు? అనే వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) వీడియోలో ‘శబ్దం’

అరివళగన్ వెంకటాచలం దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన హర్రర్ మూవీ ‘శబ్దం’. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘వైశాలి’ అనే మూవీ హర్రర్ జానర్ సినిమాలలో ప్రత్యేకంగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆది, అరివళగన్ కాంబోలో రాబోతున్న రెండో సినిమా కావడంతో ‘శబ్దం’ మంచి అంచనాలతో ఫిబ్రవరి 28న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా, లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా తదితరులు కీలక పాత్రలు పోషించారు.


‘శబ్దం’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆతృతగా వెయిట్ చేస్తున్న వారి కోసం తాజాగా అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ మూవీని ప్రైమ్ వీడియో మార్చ్ 28 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

‘శబ్దం’ మూవీ కథలోకి వెళ్తే…

హోలీ ఏంజెల్ అనే కాలేజీలో భయంకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. వరుసగా స్టూడెంట్స్ చనిపోతారు. ముఖ్యంగా ముఖేష్, శ్వేత అనే ఇద్దరు స్టూడెంట్ల మరణం తర్వాత కాలేజీ అంటేనే వణికిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. దయ్యాలు ఉన్నాయనే రూమర్ స్ప్రెడ్ అవ్వడంతో ఈ కాలేజ్ పేరు చెప్తేనే హడలిపోతారు. అయితే విషయం బయటకు వస్తే ప్రెస్టేజ్ ఇష్యూ అవుతుందని భావించిన కాలేజీ యాజమాన్యం ఈ కేసుని ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ అయిన వ్యూమా వైద్యలింగంకు అప్పగిస్తుంది. సాధారణంగా మనుషులు  వినలేని శబ్దాల్ని తన వద్ద ఉన్న అత్యాధునిక సాంకేతిక పరికరాలతో వింటూ, ఆత్మలతో మాట్లాడి కేసుల్ని పరిష్కరించే వ్యక్తి ఈ వ్యోమ.

అతని ద్వారా ఈ కాలేజీలో దయ్యాలు లేవని నిరూపించాలని అనుకుంటారు కాలేజీ యాజమాన్యం. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ లో లెక్చరర్ అవంతికపై అనుమానాలు మొదలవుతాయి. దీంతో కాలేజీలోని సెంట్రల్ లైబ్రరీలో అవంతికపై ప్రయోగానికి సిద్ధమైన వ్యోమ అక్కడ 42 ఆత్మలు ఉన్నట్టు కనిపెడతాడు. ఇంతకీ ఆ 42 ఆత్మలు ఎవరివి ? కాలేజీలో జరుగుతున్న వరుస చావులకు కారణమేంటి ? ఈ కేసులో అవంతిక పై ఎందుకు అనుమానం వస్తుంది ? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీని చూడాల్సిందే.

Related News

3BHK Movie: సచిన్ ఎఫెక్ట్.. హిందీ వెర్షన్ లో ఓటీటీ విడుదలకు సిద్ధమైన 3bhk!

OTT Movie : ప్రియుడు లేడని అంకుల్ తో … ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో అన్నీ అలాంటి సీన్లే … ఇలాంటి సినిమాలు చుస్తే

OTT Movie : ప్రేమించిన అమ్మాయిని ఫ్రెండ్స్ దగ్గరికి… నలుగురూ కలిసి బ్లైండ్ ఫోల్డ్ చేసి… ఈ అరాచకం సింగిల్స్ కి మాత్రమే

OTT Movie : అమ్మమ్మ చావుతో అంతులేని వింత సంఘటనలు… ఫ్యామిలీని ఆటాడించే అతీంద్రీయ శక్తి… కల్లోనూ వెంటాడే కథ

OTT Movie : చేపల వేటకు వెళ్లి బద్ద శత్రువు చేతికి బలి… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే స్టోరీ… ‘తండేల్’ మాత్రం కాదండోయ్

OTT Movie : బట్టలన్నీ విప్పి వీడియోలు… మిస్టరీ అమ్మాయి ఎంట్రీతో మతిపోగోట్టే ట్విస్ట్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

Big Stories

×