BigTV English

Cockroach Milk Nutrition: బొద్దింక పాలు.. ఇందులో ఆవు పాల కంటే ఎక్కువ పోషకాలు, పరిశోధకులు ఏం చెప్పారంటే?

Cockroach Milk Nutrition: బొద్దింక పాలు.. ఇందులో ఆవు పాల కంటే ఎక్కువ పోషకాలు, పరిశోధకులు ఏం చెప్పారంటే?

Cockroach Milk Nutrition| పోషకాహారం అంటే అందరికీ డ్రై ఫ్రూట్స్, పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, మాంసాహారం వంటివి గుర్తుకొస్తాయి. వీటిలో ముఖ్యంగా పాలు తాగాలని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. పాలు శరీరానికి అత్యంత శక్తినిచ్చే ఆహారంగా పరిగణిస్తారు. ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా ఇందులోని కాల్షియం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. ఒక గ్లాసు పాలు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాగితే హాయిగా నిద్ర పడుతుంది.


కొంతమంది ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు తాగితే, మరికొన్ని ప్రాంతాల్లో ఒంటె పాలను కూడా తాగుతారు. అన్నీ ఆరోగ్యానికి చాలా మంచివే. కానీ ఇక మీరు బొద్దింక పాలు తాగాల్సి వస్తే..? ఛీ..చీ.. అంటూ ముఖం చాటేయకండి. ఎందుకంటే.. నిజంగానే బొద్దింక పాలలో ఆవు పాల కంటే అత్యధిక పోషకాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ‘జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్రిస్టల్లోగ్రాఫి’ అనే ఒక సైన్స్ జర్నల్ లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని బెంగుళూరులోని స్టెమ్ సెల్ బయోలజీ అండ్ రిజెనెరేటివ్ మెడిసిన్ పరిశోధకులు చేశారు. శాస్త్రవేత్త డాక్టర్ సుబ్రమణియన్ రామస్వామి నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనం చేసింది.

ఈ అధ్యయంన గురించి డాక్టర్ సుబ్రమణియన్ రామస్వామి మాట్లాడుతూ.. “పసిఫిక్ బీటెల్ (Pacific beetle cockroach (Diploptera punctata)) అనే బొద్దింక పాల లాంటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఈ పాలు మొత్తం భూగ్రం మీద లభించే ఇతర జీవ జంతువుల పాలు అన్నింటి కంటే గాఢంగా అంటే చిక్కగా ఉన్నాయి. పైగా ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. నిజానికి ఇది పాలు కాదు. ఒక ఆడ బొద్దింక కొత్తగా జన్మించే పిల్లలకు అందించే ఆహారం. ఇది పసుపు రంగు లో ఉండే చిక్కటి ద్రవం. అయితే ఈ బొద్దింక నేరుగా తన పిల్లలకు తాగేందుకు ఇవ్వద్దు. అయితే పిల్లల జననం సమయంలోనే వాటి శరీరంలో ఈ ద్రవాన్ని అందిస్తుంది. ఈ ద్రవంలో వాటికి కావాల్సిన ప్రొటీన్స్, అమినో యాసిడ్స్, ఆరోగ్యమైన్ షుగర్ వంటివి పోషకాలు ఉంటాయి. ఈ చిక్కటి ద్రవాన్ని ఈ కాక్రోచ్ పిల్లలు నెమ్మదిగా కొన్ని రోజుల పాటు ఆహారంగా తీసుకుంటాయి.” అని చెప్పారు.


Also Read: నడక, వ్యాయామం బరువు తగ్గడానికి ఏది బెటర్ ?

జర్నల్ ప్రచురితమైన అధ్యయన వివరాల ప్రకారం.. ఈ పసిఫిక్ బీటిల్ బొద్దింక పాలలో 16 నుండి 22 శాతం కొవ్వు, 25 శాతం కార్బోహైడ్రేట్లు, 45 శాతం ప్రోటీన్ ఉంటాయి. ఇవి శరీర కణాల పెరుగుదలకు ఎంతో ఉపకరిస్తాయి. అయితే ఈ పాలను సూక్ష్మంగా చూస్తే.. ఇందులో క్రిస్టల్స్ కనిపిస్తాయి. ఈ క్రిస్టల్స్ లోనే అన్ని పోషకాలు నిలువ ఉన్నాయని తేలింది. ఈ క్రిస్టల్స్ లో పోషకాలు ప్యాక్ చేసి ఉంటాయి. క్రమంగా ఈ క్రిస్టల్స్ లోని పోషకాలు విడదలవుతూ ఉంటాయి.

ఆవు, గేదె పాల కంటే అధిక పోషకాలు
మనం సాధారణంగా తాగే ఆవు పాలు లేదా గేదె పాలు కంటే బొద్దింక పాలు తాగడం వల్ల ఒక వ్యక్తికి మూడు రెట్లు ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మనుషులు తాగే పాలలో అన్నింటి కంటే గేదె పాలు ఎక్కువ చిక్కగా, అత్యధిక కెలోరీలు కలిగి ఉంటాయి. కానీ బొద్దింక పాలు దాని కంటే ఎక్కువ చిక్కదనం, మరింత ఎక్కువ కెలోరీలు కలిగి ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం బొద్దింక పాలను కృత్రిమంగా ఉత్పత్తి చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. బొద్దింక పాలలో ప్రోటీన్ స్థాయి ఎక్కువగా ఉండడంతో.. ఇవి మంచి ప్రోటీన్ సప్లిమెంట్‌గా కూడా ఉపయోగపడతాయి.

భవిష్యత్తులో ఒక మంచి పోషకాహారంగా బొద్దింక పాలు
ఆవు, గేదె, మేక లాంటి జంతువుల పెంపకం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ బొద్దింక లాంటి పురుగు, కీటక జాతి జీవులను పెంచడానికి ఎక్కువ స్థలం, వ్యయం అవసరముండదు. అందేరూ భవిష్యత్తులో బొద్దింక పాలకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.

అయితే బొద్దింక పాలు అద్భుతమైన పోషక ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, అవి ఇంకా మానవ వినియోగానికి అందుబాటులో లేవు. బొద్దింకల నుండి పాలు తీయడం చాలా సంక్లిష్టమైనది. బొద్దింకల నుంచి పాలు ఉత్పత్తి చేయడం చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. అందుకే ఈ పాలు అందుబాటులో రావడానికి చాలా సమయం పడుతుంది. డాక్టర్ రామస్వామి పరిశోధకుల బృందంలో ఒకరు దీని రుచి చూశారు. ఇది చిక్కగా ఎటువంటి రుచి లేని ద్రవంగా ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ బొద్దింక పాల గురించి ఇంకా పరిశోధన చేయాల్సి ఉంది. ఈ పాల వలన ఇప్పటివరకు మనుషులకు ఎటువంటి హాని జరగవచ్చు.. దీర్ఘకాలంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? అనే కోణంలో పరిశోధన జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఇది మనుషులు తాగేందుకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమవుతాయి.

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×