OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు అన్ని భాషల్లో ట్రెండ్ అవుతున్నాయి. వీటిని ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ ఒక ఫోరెన్సిక్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. అతను నిక్టోఫోబియా (చీకటి భయం)తో బాధపడుతూ ఒక హత్య కేసును పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. ఆతరువాత ఊహించని ట్విస్టులతో స్టోరీ నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘V1: The Unsolved Murder Case’ 2019 లో వచ్చిన ఈ సినిమాకి పవెల్ నవగీతన్ దర్శకత్వం వహించారు. ఇందులో రామ్ అరుణ్ కాస్ట్రో, విష్ణుప్రియ పిళ్ళై ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 52 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.7/10 రేటింగ్ ఉంది. Amazon Prime Video లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ నర్మద (గాయత్రి) అనే యువతి హత్యతో ప్రారంభమవుతుంది. ఆమె తన ప్రియుడు ఇన్బా (లిజీష్)తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేది. ఈ కేసును ఫోరెన్సిక్ నిపుణుడైన ఇన్‌స్పెక్టర్ అగ్ని (రామ్ అరుణ్ కాస్ట్రో) దర్యాప్తు చేయడానికి నియమిస్తారు. అతను నిక్టోఫోబియాతో బాధపడుతూ, గత హత్య కేసు గురించిన హాల్యుసినేషన్స్‌తో సతమతమవుతుంటాడు. అతని కొలీగ్ ఇన్‌స్పెక్టర్ లూనా (విష్ణుప్రియ పిళ్ళై), అతనిని ఈ కేసును తీసుకోవడానికి ఒప్పిస్తుంది. దర్యాప్తు ప్రారంభంలో, అగ్ని, లూనా కలసి నర్మద ప్రియుడు ఇన్బాను ప్రశ్నిస్తారు. అతను తమ సంబంధంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అంగీకరిస్తాడు. అగ్ని ఈ హత్యలో మరొకరు ఉన్నారని నమ్ముతాడు. నర్మద స్నేహితురాలిని, అలాగే ఆమె హత్యకు ముందు ఆమెతో సంబంధంలో ఉన్న మరో వ్యక్తిని కూడా ప్రశ్నిస్తాడు.
దర్యాప్తు ముందుకు సాగుతున్నప్పుడు, ఇన్బా తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు గమనిస్తాడు. అయితే ఒక వ్యక్తి సంఘటనా స్థలం నుండి పారిపోతున్నట్లు అగ్ని గుర్తిస్తాడు. ఇది మరింత అనుమానాలకు దారి తీస్తుంది. ఈ చిత్రం ఒక ఇంటరాగేషన్ డ్రామాగా ముందుకు సాగుతుంది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఒకే సంఘటనను భిన్నంగా అగ్నికి వివరిస్తారు. ఇది మర్డర్ మిస్టరీలో ఆసక్తిని పెంచుతుంది. అగ్నికి ఉన్న నిక్టోఫోబియా రాత్రి సమయంలో దర్యాప్తుకి సవాలుగా మారుతుంది. అతని గత హాల్యుసినేషన్స్ కేసు పరిష్కారాన్ని మరింత కష్టతరంగా మారుస్తుంది. ఇంతకీ అగ్ని ఈ కేసును కొలిక్కి తెస్తాడా ? హంతకుడు ఎవరు ? నర్మదను ఎందుకు చంపాడు ? అనే విషయాలను సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : పెళ్లి ఫిక్సయిన అమ్మాయిలు కిడ్నాప్… చేతులు నరికి, ముక్కలు ముక్కలుగా పారేస్తూ కిరాతకంగా చంపే సైకో కిల్లర్