Rain Alert: గడిచిన వారం రోజుల నుంచి తెలంగాణలో వర్షం అంతగా పడడం లేదు. రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే పడుతున్నాయి. మే చివరి వారంలో వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. మళ్లీ జులై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. జూన్ నెలలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు కాస్త ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత జూన్ నెల వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలే పడడం లేదు. దీంతో రైతులు వర్షాల రాక కోసం ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలోనే హైదారాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది. రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. జులై 17, 18 తేదీల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో పలు చోట్ల వడగండ్ల వానలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది.
రేపు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించింది. 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈదురుగాలులతో వర్షాలు కురవనున్నాయి. బంగాళఖాంతో నైరుతి రుతుపవనాలు బలపడినాయని చెప్పింది. రాబోయే రోజుల్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రెండు రోజుల పాటు భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు.
ALSO READ: UPSC Jobs: జస్ట్ ఇంటర్వ్యూతోనే ఉద్యోగం భయ్యా.. ఈ అర్హత ఉండాలి.. రేపే లాస్ట్ డేట్
నేడు ఏపీలో కూడా వర్షాలు పడినట్టు అధికారులు పేర్కొన్నారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని చెప్పారు.
ALSO READ: CM Revanth Reddy: బనకచర్లపై నో డిస్కషన్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని.. ముఖ్యంగా చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.