Sapta Sagaradaache Ello : లవ్ స్టోరీలు లేకుండా సినిమా ఇండస్ట్రీని ఊహించుకోలేం. ప్రతి భాషలోనూ, ప్రతి ఇండస్ట్రీలోనూ లవ్ స్టోరీ లతో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా అలరించాయి. భాషతో సంబంధం లేకుండా వస్తున్న ఈ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే లవ్ స్టోరీ మూవీ, కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. చేయని నేరాన్ని తనమీద వేసుకుని జైలుకు పోయే వ్యక్తి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ లవ్ స్టోరీ కన్నడ మూవీ పేరు ‘సప్త సాగర దాచే ఎల్లో – సైడ్ ఎ’ (Saptah Sagar Daache ello – Side A). 2023లో సెప్టెంబర్ 1న విడుదలైన ఈ కన్నడ మూవీకి హేమంత్.ఎం.రావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తెలుగులో సెప్టెంబర్ 22న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి విడుదల చేశారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
మను ఒక మినిస్టర్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. మను అనాధ కావడంతో ఒంటరిగా ఉంటాడు. భార్గవ్ అనే మేనేజర్ మినిస్టర్ దగ్గర పని చేస్తుంటాడు. అతనే మనుకి జీతం ఇస్తూ ఉంటాడు. అయితే మను ప్రియా అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె చదువుకుంటూ, పాటలు కూడా పాడుతూ ఉంటుంది. ఆ పాటలు వినడానికి మను కాలేజీకి వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒకసారి మినిస్టర్ కొడుకు ఒక యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు. ఆ కేసును మను తన మీద వేసుకుంటే, డబ్బులు ఇస్తానని మినిస్టర్ చెప్తాడు. ప్రియా బీచ్ పక్కన ఇల్లు కట్టుకోవాలని అనుకుంటూ ఉంటుంది. ఈ డబ్బుతో అక్కడ ఇల్లు కట్టుకోవచ్చని ఆ కేసు తన మీద వేసుకుంటాడు. ప్రియాకి చెప్పకుండా ఆ కేసు తన మీద వేసుకుంటాడు. అయితే ప్రియ తనకు చెప్పకుండా ఇలా ఎందుకు చేసావని బాధపడుతుంది.
ఆరు నెలల్లో బెయిలు ఇప్పిస్తానని మినిస్టర్ చెప్తాడు. అలా కోర్టులో యాక్సిడెంట్ తానే చేశానని ఒప్పుకోవడంతో, మను రిమాండ్ లో ఉంటాడు. ఈ క్రమంలోనే మినిస్టర్ గుండె నొప్పితో చనిపోతాడు. ఆ తర్వాత భార్గవ్, అతడు బయటికి వస్తే ఈ విషయం అందరికీ చెప్తాడని బెయిల్ రాకుండా చేస్తాడు. ప్రియ అతనికి బెయిల్ తేవడానికి చాలా కస్టపడుతూ ఉంటుంది. చివరికి హీరోకి బెయిల్ వస్తుందా? ఈ కేసు నుంచి బయటపడతాడా? మను, ప్రియ మళ్ళీ సంతోషంగా జీవిస్తారా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.