Brahmamudi serial today Episode: ధాన్యలక్ష్మీ, రుద్రాణి మా వాటా మాకు ఇచ్చి మీరేమైనా చేసుకోండి అంటారు. దీంతో అందరి మధ్య గొడవ జరగుతుంది. ఇంతలో సీతారామయ్య, ఇందిరాదేవి ఆపండి అంటూ వస్తారు. వాళ్లను చూసిన అందరూ షాక్ అవుతారు. ఇంట్లోకి వచ్చిన సీతారామయ్య ఎమోషనల్ అవుతాడు. ఇంతకాలం ఇది నా కుటుంబం అనుకున్నాను. మీ అందరి భవిష్యత్తు కోసం ఎంతో సంపాదించాను. కానీ ఈరోజు నా మాటను కూడా పక్కన పెట్టి మీ స్వార్థం కోసం నా పరువు మర్యాదలు తీయాలనుకున్నారు. నేను పోయే వరకు మీరంతా నాకు తోడుగా ఉంటారనుకుంటే వాటాలు పంచుకుని ఈ లోపే పోవాలనుకుంటున్నారు. నా పరువు మర్యాదలే మీకు అక్కరలేనప్పుడు మీరు నాకు అక్కర్లేదు. రాజ్ బ్యాంకు వాళ్లకు ఎంత అప్పు ఉందో అంతా మన ఆస్తులు జప్తు చేయించి కట్టేసెయ్.. ఎవ్వరు ఏమై పోయినా నాకు అనవసరం అంటాడు.
దీంతో ధాన్యలక్ష్మీ.. అదేంటి మామయ్యగారు మీ వారసులు ఏమై పోయినా పర్వాలేదా..? అని అడుగుతుంది. దీంతో ఇందిరాదేవి కోపంగా చాల్లే నోరు మూయ్.. మీ మామయ్య పరువు మర్యాదలు అక్కర్లేనప్పుడు మీరు మా వారసులు ఎలా అవుతారు. ఈయన మాటలకు ఎదురు చెప్పే అర్హత ఇక్కడ ఎవ్వరికీ లేదు. రాజ్ తాతయ్య చెప్పినట్టు చేయ్.. అని చెప్పగానే.. బ్యాంకు వాళ్లు ప్రాపర్టీ తాలుకూ డాక్యుమెంట్స్ అన్ని మాకు హ్యాండోవర్ చేయ్ రాజ్ అని అడుగుతారు. అవన్నీ బ్యాంకు లాకర్‌లో ఉన్నాయి రేపే హ్యండోవర్ చేస్తాను. అని చెప్పగానే అయితే రేపే జప్తు చేస్తాము అని బ్యాంకు వాళ్లు వెళ్లిపోతారు.
రుద్రాణి, రాహుల్ తల మీద తుండుగుడ్డ వేసుకుని బాధపడుతుంటారు. అదేదో సినిమాలో చెప్పినట్టు ముసలోడే కానీ మహానుబావుడు అంటుంది రుద్రాణి. దీంతో రాహుల్ కూడా అవును మన పాలిట యముడిలా తయారయ్యాడు అంటాడు. దీంతో రుద్రాణి మరింత బాధగా అక్కడి నుంచి అటే పోతాడనుకుంటే మళ్లీ దాపురించాడు. అసలు ఏం జరగుతుంది ఇంట్లో అంటుంది రుద్రాణి. రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపడానికి సైంటిస్టులు కూడా నీ అంత ఆలోచించరేమో మమ్మీ నువ్వు అంతకన్న ఎక్కువే ఆలోచించావు ఈ ఆస్తి కోసం అంటాడు రాహుల్. ఈ మధ్య పాతికేళ్లకే హార్ట్ ఎటాక్ వచ్చి పోతున్నారు కదరా..? అలాంటిది సెంచరీకి చేరువలో ఉన్నాడు కదా ఈయన ఎలా బతికి వచ్చాడు అంటుంది రుద్రాణి. భూమ్మీద నూకలు ఉంటే సెంచరీ దాటిని మళ్లీ వస్తారు మమ్మీ.. ఇప్పుడు తాతయ్య గురించి అనుకుని ప్రయోజనం ఏముంటుంది మమ్మీ ముందు మన పరిస్థితి ఏంటో ఆలోచించు అంటాడు రాహుల్.
అది నేను ఆలోచిస్తున్నానురా..? ఉన్నదంతా ఊడ్చి పెడుతున్నారు.. మనకు మిగిలేది ఏంటో అంటుంది. ఇంతలో స్వప్న ఒక చిప్ప తీసుకొచ్చి మీకు మిగిలేది ఇదే.. మీరు చేసిన దానికి మిగిలేది ఈ బొచ్చ మాత్రమే అంటుంది. అంత కర్మ మాకు పట్టలేదు అంటూ బొచ్చను పడేస్తుంది రుద్రాణి. ఇప్పుడు అలాగే అంటారు కానీ.. రేపు ఈ ఇంటితో సహా ఆస్థి పోయాక ఇద్దరు కలిసి రోడ్డున పడతారు. బతకడానికి రోడ్డుసైడు కూర్చుని చిరిగిపోయిన బట్టలతో ఈ బొచ్చతో అడుక్కుంటుంటే చూడ్డానికి విజువల్ ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో అత్తా అంటుంది. దీంతో రుద్రాణి, రాహుల్ ఒక దగ్గర కూర్చుని అడుక్కుటుంన్న ఊహించుకుంటారు. వెంటనే ఉలిక్కిపడి లేచి చీచీ అంటుంది రుద్రాణి. దీంతో స్వప్న నవ్వుతూ ఎలా ఉంది ఆ లైఫ్ అంటుంది. కూల్ అత్తా నీ నోటికి తాళం పడే టైం వచ్చింది. అంటూ వెళ్లిపోతుంది.
అపర్ణ, ఇందిరాదేవి, ప్రకాష్, సుభాష్ నలుగురు కలిసి ధాన్యలక్ష్మీ గురించి ఆలోచిస్తారు. బాధతో ఉన్న ప్రకాష్‌ణు ఓదారుస్తారు. ఆ రుద్రాణి వల్లే ధాన్యలక్ష్మీ ఇలా తయారైందని అపర్ణ అంటుంది. సుభాష్ కూడా జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సింది చూడరా అంటూ చెప్పడంతో ప్రకాష్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాజ్, బ్యాంకుకు వెళ్లి ఆస్థి డ్యాకుమెంట్స్ తీసుకురావాలని వెళ్తాడు. సీతారామయ్య ఇంటని చూసుకుంటూ బాధపడుతుంటాడు. ఇంతలో ఇందిరాదేవి వచ్చి ఏంటి బావ ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని వదిలిపోవాలని బాధగా ఉందా..? అని అడుగుతుంది. దీంతో నాకే కాదు నీకు లేదా.. చిట్టి అని అడుగుతాడు సీతారామయ్య.. ఎందుకు లేదు బావ అంటూ ఇందిరాదేవి ఎమోషనల్ అవుతుంది. కళ్యాణ్ స్టేసన్‌కు వెళ్లగానే అక్కడి కానిస్టేబుల్ ఎవరి కోసం వచ్చారు అని అడుగుతుంది. మీ మేడం మెడలో మూడుముళ్లు వేసింది నేనే అని చెప్పగానే కానిస్టేబుల్ మీరు చాలా గ్రేట్ సార్ అంటూ మెచ్చుకుంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?