E-Paper
Advertisement

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘సతీ లీలావతి’… రెండు వారాల్లోనే డిజిటల్ ఎంట్రీ

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘సతీ లీలావతి’… రెండు వారాల్లోనే డిజిటల్ ఎంట్రీ
Advertisement

Sathi Leelavathi OTT : మెగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొణిదెల లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi) మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. రీసెంట్ గా మంచి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆడియన్స్ ను అలరించలేకపోయింది. మరి ఇప్పుడు ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది ? ఈ సినిమా స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

సన్ నెక్స్ట్ ఓటిటిలో స్ట్రీమింగ్

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా తెలుగు వారికి పరిచయం అక్కర్లేదు. పలు సినిమాలతో తనకంటూ సపరేట్ గా ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్న ఈ బ్యూటీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని పెళ్లాడి మెగా ఫ్యామిలీ కోడలుగా అడుగు పెట్టింది. అయితే పెళ్లయ్యాక ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ వరుణ్ తేజ్ తో వివాహం తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేసింది. మెగా అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ ను కూడా ‘సతి లీలావతి’ అంటూ ఈ నెలలోనే థియేటర్లలో పలకరించింది.

Advertisement

Also Read : పదేళ్ల క్రితం క్లోజ్ అయిన హత్య కేసు రీఓపెన్… లండన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అల్టిమేట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్

రెండు వారాల్లోనే ఓటీటీలోకి

2026 మే 8న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ దురదృష్టవశాత్తు మూవీ పెద్దగా ఆడలేదు. వీక్ నరేషన్ కారణంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లపై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. దీంతో రెండు వారాల్లోనే ఈ మూవీ ఓటిటి బాట పట్టింది. సాధారణంగా బ్లాక్ బస్టర్ సినిమాలు కనీసం నాలుగు నుంచి ఆరు వారాల థియేటర్ రన్ తర్వాతే ఓటిటిలోకి వస్తాయి. కానీ ఫ్లాప్ సినిమాల పరిస్థితి అలా ఉండదు. సినిమా ప్లాప్ అయ్యిందంటే వారం గ్యాప్ కూడా లేకుండానే ఓటీటీలోకి వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ‘సతి లీలావతి’ కూడా సరిగ్గా ఇలాగే కేవలం రెండు వారాల వ్యవధిలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం కావడం విశేషం. ఈ మూవీ పాపులర్ ఓటీటీ సన్ నెక్స్ట్ (Sun NXT)లో బుధవారం నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మే 20 నుంచి ‘సతీ లీలావతి’ మూవీ తెలుగు తో పాటు తమిళ భాషలోనూ అందుబాటులోకి రాబోతోంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే థియేటర్లలో రిలీజ్ అయిన అతి తక్కువ కాలంలోనే ఓటీటీలోకి వచ్చేసిన ఇటీవలి సినిమాల్లో ఇది కూడా ఒకటి.

Advertisement

ఈ సినిమాకు సత్య దర్శకత్వం వహించగా, దేవ్ మోహన్ హీరోగా నటించారు. దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ పై నాగమోహన్ నిర్మించిన ఈ మూవీకి మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. మరి థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఓటిటిలో ఎంత మేరకు అలరిస్తుందో చూడాలి.

Tags

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×