E-Paper
Advertisement

యాక్సిడెంట్ తో ప్రియురాలిని మర్చిపోయే ప్రియుడు… ఎక్స్ లవర్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్

యాక్సిడెంట్ తో ప్రియురాలిని మర్చిపోయే ప్రియుడు… ఎక్స్ లవర్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్
Advertisement

Tamil Romantic Comedy Drama on OTT : జ్ఞాపకశక్తి ఒక్కసారిగా పోతే.. మన జీవితంలో అప్పటిదాకా ఉన్న ముఖ్యమైన మనుషులనే మరిచిపోతే ? అలాంటి ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘హార్టిన్’ (Heartin). దర్శకుడు కిషోర్ కుమార్ రూపొందించిన ఈ చిత్రం ప్రేమ, జ్ఞాపకాలు, భావోద్వేగాల చుట్టూ సాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

శివ జైపూర్‌లో షెఫ్‌గా పనిచేసే యువకుడు. కాలేజ్ రోజుల్లో సాహిత్య అనే యువతిని అతను ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల వారి ప్రేమ ఫెయిల్యూర్ గా మిగులుతుంది. ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడేందుకు శివ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు.

Advertisement

కొంతకాలం తర్వాత అతని జీవితంలోకి సాధన అనే ఐటీ ఉద్యోగిని వస్తుంది. ఆమె అమాయకత్వం, స్వభావం నచ్చడంతో శివ మళ్లీ ప్రేమలో పడతాడు. ఇక సాధన కూడా శివ మెంటాలిటీ, అందరికీ అడగకుండానే సహాయం చేసే మనస్తత్వం చూసి ఇష్టపడుతుంది. అలా ఇద్దరి మనసులు కలవడంతో, పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని డిసైడ్ అవుతారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో శివ ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. ఇక్కడే కథలో ఊహించని మలుపు వస్తుంది.

ఆ ప్రమాదం కారణంగా శివ గత కొన్ని సంవత్సరాల జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోతాడు. తాను ఇంకా కాలేజ్ రోజులలోనే ఉన్నానని, సాహిత్యనే తన ప్రేమికురాలని భావిస్తాడు. ప్రస్తుతం తనతో ఉన్న సాధనను అసలు గుర్తుపట్టడు. ఈ పరిణామంతో పాత ప్రేమికురాలు మళ్లీ అతని జీవితంలోకి రావడం, సాధన తన ప్రేమను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు కథను భావోద్వేగంగా మార్చేస్తాయి. చివరకు శివకు తన జ్ఞాపకాలు తిరిగి వచ్చాయా ? అతను సాధనను గుర్తించాడా ? లేక సాహిత్యతోనే తన జీవితాన్ని కొనసాగించాడా ? అసలు సాహిత్య మళ్లీ ఎందుకు ఎక్స్ లవర్ జీవితంలోకి వచ్చింది ? అనేదే సినిమా క్లైమాక్స్.

Advertisement

Also Read : సమంత, తాప్సీ సూపర్ హిట్ సినిమాలకు డిలీట్ డేట్ ఫిక్స్… ఓటీటీలో చూసేందుకు ఇదే చివరి ఛాన్స్

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘హార్టిన్’ రొటీన్ ప్రేమకథ కాదు. అమ్నీషియా కాన్సెప్ట్‌ను ఎమోషనల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో మేళవించి రూపొందించారు. ఈ సినిమా 2026 జూన్ 26న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీలలో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతోంది. Prime Video, Simply South ఓటీటీలలో అందుబాటులో ఉంది. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. సినిమా ప్రస్తుతం కేవలం తమిళ ఒరిజినల్ వెర్షన్‌లో మాత్రమే ఉంది. ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, అమ్నీషియా కాన్సెప్ట్‌తో సాగే సినిమాలు చూడాలనుకుంటే ఈ మూవీపై ఓసారి లుక్కేయవచ్చు.

Related News

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Big Stories

Advertisement
×