OTT Movie : ఓటీటీలో ఇప్పుడు వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. ప్రేక్షకులను ఈ సిరీస్ లు బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఎటువంటి భాషలో వచ్చినా సరే, కొంచెం బాగుంది అనిపిస్తే వదలకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ సిరీస్, లవ్ లో ఫెయిల్ అయిన ఒక అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ చాలా మంది ప్రేమ పక్షుల మనసును కదిలిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
ఆహా తమిళ్ (Aha Tamil) లో
ఈ తమిళ కామడీ డ్రామా వెబ్ సీరీస్ పేరు ‘సేవ్ నల్ల పాసంగ’ (Save Nalla Pasanga). 2025 లో వచ్చిన ఈ సీరీస్ కు సి. సతీష్ చరణ్ దర్శకత్వం వహించారు. ఈ సీరీస్‌లో అజయ్ ప్రసాద్ (కణ్ణన్ పాత్రలో), విష్ణు (పళని పాత్రలో), అన్నా అడోర్ (జెస్సికా పాత్రలో), అను, ఈశ్వర్య, శక్తి అరవింద్, గణేష్ మదన్, సనిల్ నటించారు. ఆహా తమిళ్ (Aha Tamil) ప్లాట్ ఫామ్‌లో 2025 జూన్ 20 నుంచి ఈ సీరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీరీస్ సీజన్ 1 ఎనిమిది ఎపిసోడ్‌లతో రన్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సీరీస్ కణ్ణన్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను తన చిన నాటి స్నేహితురాలైన, అపర్ణ ను గాఢంగా ప్రేమిస్తుంటాడు. కణ్ణన్ తన జీవితాన్ని ఆమె ఇష్టపడే విధంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఒక మంచి అబ్బాయిగా పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. అయితే తన ప్రేమను ఆమెకు వ్యక్తం చేసే సమయంలో, అపర్ణ ఇప్పటికే మరొక వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ వ్యక్తి స్వభావాన్ని గతంలో అపర్ణ ద్వేషించేది. ఈ విషయం కణ్ణన్‌ను తీవ్రంగా కలిచివేస్తుంది. అంతే కాకుండా మంచి అబ్బాయిగా ఉండటం వల్ల జీవితంలో ఎటువంటి ఫలితం ఉండదని నమ్ముతాడు.
ఈ నిరాశలో కణ్ణన్ తన ‘మంచి అబ్బాయి’ ఇమేజ్‌ను వదిలించుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తరువాత అతను విదేశీ మహిళలు శారీరక సంబంధాల విషయంలో ఉత్సాహంగా, స్ట్రైట్ గా ఉంటారని అనుకుంటాడు. పాండిచ్చేరిలో స్థిరపడిన ఒక ఫ్రెంచ్ అమ్మాయి అయిన జెస్సికా తో తన బ్రహ్మచర్యం కోల్పోవాలని అనుకుంటాడు. ఈ విషయంలో అతనికి తన స్నేహితుడు పళని సహాయం చేస్తాడు. వీరిద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జరపడానికి ఒక ప్రణాళిక వేస్తారు. కానీ వీళ్ళ ప్రయత్నాలు బెడిసికొడుతుంటాయి. కణ్ణన్, పళని ప్రయత్నాలు ఊహించని మలుపులు తీసుకుంటాయి. చివరికి కణ్ణన్ ఫారిన్ అమ్మాయితో ఆ పని కానిస్తాడా ? మంచి అబ్బాయి అనే ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటాడా ? అనే విషయాలను, ఈ సీరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : కోర్టు రూమ్ లోనే హత్య… దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు… ఐఎండీబీలో 8.9 రేటింగ్