OTT Movie : హాలీవుడ్ సినిమాలపై మూవీ లవర్స్ ఓటీటీలో ఓ లుక్ వేస్తుంటారు. మొదట యాక్షన్ సినిమాలకు ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఆ తరువాత హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ వంటి సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ తో తెరకెక్కింది. ఇందులో ఒక మహిళ తనమాజీ భర్త సహాయంతో, ప్రజెంట్ భర్తని చంపాలనుకుంటుంది. ఆ తరువాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ‘సెరెనిటీ’ (Serenity). 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమాకు స్టీవెన్ నైట్ దర్శకత్వం వహించారు. ఇందులో మాథ్యూ మెక్కనాగీ (బేకర్ డిల్), అన్నే హాతవే (కరెన్), డయాన్ లేన్ (కాన్స్టాన్స్), జాసన్ క్లార్క్ (ఫ్రాంక్), జిమన్ హౌన్సౌ (డ్యూక్), జెరెమీ స్ట్రాంగ్ (రీడ్ మిల్లర్) ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ 2019న జనవరి 25 యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. ఈ సినిమా ‘సె*క్సీ నోయిర్’ థ్రిల్లర్‌గా ప్రచారం చేయబడింది. 1 గంట 46 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.4/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ బేకర్ డిల్ అనే ఒక ఫిషింగ్ బోట్ కెప్టెన్ చుట్టూ తిరుగుతుంది. అతను ప్లైమౌత్ ఐలాండ్ అనే ప్రశాంతంగా ఉండే ద్వీపంలో నివసిస్తాడు. బేకర్ తన బోట్ సెరెనిటీలో టూరిస్ట్‌లను ఫిషింగ్ ట్రిప్స్‌కు తీసుకెళ్తుంటాడు. అయితే అతను ‘జస్టిస్’అని పిలిచే ఒక భారీ యెల్లోఫిన్ ట్యూనా చేపను పట్టుకోవడంపై ఆసక్తిని కలిగి ఉంటాడు. అతను ఇరాక్ యుద్ధంలో తనకి జరిగిన చేదు గాయాలతో బాధపడుతూ, స్థానిక మహిళ కాన్స్టాన్స్ తో రిలేషన్ లో ఉంటాడు. ఇలా ఉండగా ఒక రోజు బేకర్ మాజీ భార్య కరెన్ రాకతో అతని జీవితం తలక్రిందులవుతుంది. కరెన్ కొత్త భర్త ఫ్రాంక్ ఒక ధనవంతుడు. అంతే కాకుండా శాడిస్ట్ లక్షణాలు ఉన్న వ్యక్తి. ఆమె ఒంటి మీద బట్టలను పూర్తిగా తీసి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. అంతే కాకుండా కరెన్ ను చాలా ఇబ్బందులు పెడుతుంటాడు.
ఇప్పుడు బేకర్ దగ్గరకి వచ్చిన కరెన్, తన భర్త నంచి తనను, తన కొడుకు పాట్రిక్ ను రక్షించమని కోరుతుంది. ఆమె బేకర్‌కు $10 మిలియన్ ఆఫర్ చేస్తూ, ఫ్రాంక్‌ను ఫిషింగ్ ట్రిప్‌లో సముద్రంలోకి తీసుకెళ్లి, అతన్ని సొరచేపలకు విసిరేయమని అడుగుతుంది. బేకర్ ఈ ప్రతిపాదనతో ఆలోచనలో పడతాడు. ఎందుకంటే అతను తన గత జీవితాన్ని మరచిపోవాలనుకుంటాడు. కానీ తన కొడుకు పాట్రిక్‌ను రక్షించాలనే బాధ్యత అతన్ని కలవరపెడుతుంది. చివరికి బేకర్ తన మాజీ భార్య చెప్పినట్లు చేస్తాడా ? కరెన్ ను ప్రస్తుత భర్త ఎలాంటి ఇబ్బందులు పెడుతుంటాడు ? ఇంతకీ కరెన్ చెప్పేది నిజమేనా ? అనే విషయాలను , ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : పెళ్ళైన అమ్మాయిలే టార్గెట్… పోలీసులకు చెప్పి మరీ చంపే సైకో కిల్లర్… ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాక్