BigTV English

OTT Movie : స్కూల్లో మిస్టీరియస్ మరణాలు… ఆ పని చేసే స్టూడెంట్సే ఈ దెయ్యం టార్గెట్… దడ పుట్టించే తమిళ హర్రర్ మూవీ

OTT Movie : స్కూల్లో మిస్టీరియస్ మరణాలు… ఆ పని చేసే స్టూడెంట్సే ఈ దెయ్యం టార్గెట్… దడ పుట్టించే తమిళ హర్రర్ మూవీ

OTT Movie : తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక హారర్-థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. యోగి బాబు, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హారర్ జానర్ లో వచ్చినా, విద్యార్థులకు మంచి మెసేజ్ ఇస్తుంది. ఇందులో ఒక స్కూల్‌లో విషాదకరంగా చనిపోయిన ఇద్దరు విద్యార్థుల ఆత్మలు టీచర్లుగా తిరిగి వచ్చి (యోగి బాబు, భూమిక చావ్లా) ఒక సందేశాన్ని ఇస్తారు. ఈ స్టోరీ చాలా వరకు విద్యార్థుల చదువు మీదే తిరుగుతుంది. అయితే మధ్యలో ఆత్మలు చేసే రచ్చతో స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

విన్నర్ హైయర్ సెకండరీ స్కూల్‌లో ప్రిన్సిపల్ నంబిరాజన్, తన స్కూల్‌ని రాష్ట్రంలో నంబర్ వన్ చేయాలని, ‘మైండ్‌సెట్ ఆఫ్ సక్సెస్’ అనే 500 పేజీల పుస్తకాన్ని రాస్తాడు. ఈ పుస్తకం కులం, మత విభజనలను పెంచి, విద్యార్థులకు నెగటివ్ థింకింగ్‌కి దారితీస్తుంది. ఈ పుస్తకం చదివిన విద్యార్థులు, టీచర్లు ఆత్మహత్య చేసుకోవడం. ఆ ఆత్మలు స్కూల్‌లో సంచరించడం, పుస్తకాలు స్వయంగా కాలిపోవడం వంటి భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇన్‌స్పెక్టర్ కలీశ్వరన్ ఈ ఘటనలను దర్యాప్తు చేస్తాడు. మొదట ఆత్మల గురించిన కథలను తోసిపుచ్చినా, తన కొడుకు కూడా అదృశ్యమవడంతో వాటి మీద నమ్మకం కలుగుతుంది. స్కూల్‌లో మస్తాన్ అనే వ్యక్తి, విద్యార్థులను మరిన్ని ఆత్మహత్యలకు ప్రేరేపించి, స్కూల్‌ని గందరగోళంలోకి నెట్టాలని ప్లాన్ చేస్తాడు.


ఈ గందరగోళంలో, గతంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థుల ఆత్మలు—కనకవేల్ (యోగి బాబు), అన్బరసి (భూమిక చావ్లా)—టీచర్లుగా తిరిగి వచ్చి, స్కూల్‌లో ఆత్మలను శాంతపరుస్తాయి. కనకవేల్, అన్బరసి స్కూల్‌లో మస్తాన్‌ని ఎదిరించి, అతని రిచ్యువల్స్‌ని ధ్వంసం చేస్తారు. నంబిరాజన్‌ని తన పుస్తకం వల్ల కలిగిన హానిని గుర్తించేలా చేస్తారు. క్లైమాక్స్‌లో కనకవేల్, అన్బరసి స్కూల్‌ని రక్షిస్తారు. నంబిరాజన్ తన తప్పుని సరిదిద్దుకుని, విద్యార్థులకు డిగ్రీలతోనే విజయం రాదని ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తాడు. ఇలా ఈ స్టోరీ ముగుస్తుంది.

ప్రైమ్ వీడియోలో

‘స్కూల్’ (School)ఒక తమిళ హారర్-థ్రిల్లర్ సినిమా. ఆర్.కె. విద్యాధరన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో యోగి బాబు (కనకవేల్), భూమిక చావ్లా (అన్బరసి), కె.ఎస్. రవికుమార్ (ఇన్‌స్పెక్టర్ కలీశ్వరన్), బగవతి పెరుమాళ్ (ప్రిన్సిపల్ నంబిరాజన్), చామ్స్ (మన్మధన్), నిజల్గల్ రవి (మస్తాన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 మే 23న థియేటర్‌లలో రిలీజ్ అయ్యింది. IMDbలో 8.7/10 రేటింగ్ ను కూడా పొందింది. 147 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రైమ్ వీడియోలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.

Read Also : చావుకు దగ్గరైన వాళ్ళను సింథటిక్ బొమ్మలుగా… ఏలియన్ ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్… భవిష్యత్తు అంటేనే భయపెట్టే సై-ఫై సిరీస్

Tags

Related News

OTT Movie : పిల్లల్ని తినేసే నల్ల పిశాచి… మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ మూవీ… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : బాబోయ్… అమాయకురాలు అనుకుంటే అడ్డంగా నరికేసే ఆడ సైకో… ఈ పిల్ల పిశాచి వేషాలకు మెంటలెక్కాల్సిందే

OTT Movie : రోబోతో ఇదేం పాడు పనిరా అయ్యా… అది రివేంజ్ మోడ్ లో చేసే అరాచకం రచ్చ రచ్చే

OTT Movie : భార్య చర్మం వలిచి ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… చేతబడిని నమ్మనోళ్లు చూడాల్సిన మూవీ

OTT Movie : మనుషుల్ని వెంటాడి చంపే నీడ… పిచ్చెక్కించే ట్విస్టులు… మతిపోయే మిస్టరీ థ్రిల్లర్

Big Stories

×