OTT Movie : సై-ఫై యాక్షన్ హారర్ స్టోరీలను ఇష్టపడే వాళ్లకు ఒక హై-ఓల్టేజ్ యాక్షన్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ IMDbలో 9.0/10 రేటింగ్ ను కూడా పొందింది. ఇందులో భవిష్యత్తులో ఎలియెన్స్ భూమి మీద దాడి చేసే దృశ్యాలు చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. ఈ సిరీస్ ను చూస్తున్నప్పుడు భూమి మీద కాకుండా, మరోగ్రహంలో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సిరీస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
2120లో భూమి ప్రొడిజీ, వేలాండ్, లించ్, డైనమిక్, థ్రెషోల్డ్ అనే ఐదు కార్పొరేషన్‌ల ఆధీనంలో ఉంటుంది. ఈ కార్పొరేషన్‌లు సాంకేతిక పరిజ్ఞానం, అధికారం కోసం పోటీపడుతుంటాయి. ప్రొడిజీ కార్పొరేషన్ CEO బాయ్ కవాలియర్ ఒక విప్లవాత్మక టెక్నాలజీని అభివృద్ధి చేసి దాని ద్వారా హైబ్రిడ్ మనుషులను సృష్టిస్తాడు. ఇందులో మనిషి మెమోరిని సింథటిక్ శరీరాలలోకి బదిలీ చేస్తారు. వెండీ అనే యువతి ఒక టెర్మినల్ అనారోగ్యంతో బాధపడుతుంటుంది. దీంతో ఆమె ఈ ప్రయోగంలో భాగమవుతుంది. ఆమె మొదటి హైబ్రిడ్ ప్రోటోటైప్‌గా మారుతుంది.
Read Also : ఎమ్మెల్యే ఇంట్లో పనసకాయలు మిస్సింగ్… గిలిగింతలు పెట్టే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘ఏలియన్: ఎర్త్’ (Alien earth) ఒక అమెరికన్ సై-ఫై హారర్ సిరీస్. నోహా హావ్లీ సృష్టించిన ఈ సిరీస్‌లో సిడ్నీ చాండ్లర్, టిమోతీ ఒలిఫెంట్, అలెక్స్ లాథర్, సామ్యూల్ బ్లెన్కిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్‌లతో (సీజన్ 1) 2025 ఆగస్టు 12 నుంచి, Hulu, JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఈ సినిమా 9.0/10 రేటింగ్ ను పొందింది.