Illu illaalu Pillalu Prema : బుల్లితెర పై ఎన్నో సీనియల్స్ ప్రసారం అవుతున్నాయి. అందులో రీసెంట్ గా వచ్చిన డైలీ సీరియల్స్ కొన్ని ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ఈ డైలీ సీరియల్ ఈమధ్య ప్రసారమవుతుంది. అయితే అతికొద్ది రోజుల్లోనే మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. మధ్యతరగతి కుటుంబంలో వచ్చి గొడవల గురించి మోసం చేసి పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అన్న వాటి గురించి ఈ సీరియల్ లో బాగా చూపించారు.. ఇందులో రామరాజు మూడో కూడదుగా ప్రేమ నటించింది. ఇరు కుటుంబాల మధ్య గొడవలకు కారణమైన ఈ ప్రేమ తానుబడే ఇబ్బందులను సీరియల్ లో చక్కగా చూపించారు.. ఈ పాత్రలో నటించిన ప్రేమ అసలు పేరేంటి? ఆమె బ్యాక్ గ్రౌండ్? రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రేమ బ్యాగ్రౌండ్ ఇదే..
ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ఈ సీరియల్లో రామరాజు మూడో కోడలుగా నటించిన ప్రేమ అసలు పేరు లావణ్య నటించింది.. ఈమె కర్ణాటకకు చెందిన నటి.. ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్నప్పటికీ అనుకోని పరిస్థితుల్లో మేనత్త కొడుకునే పెళ్లి చేసుకుంటుంది. డ్యాన్స్‌పై కూడా ఆమెకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు కొన్ని ఎపిసోడ్ లలో చూపించారు. అయితే ఈమెకు రియల్ లైఫ్ లో కూడా మంచి డ్యాన్సర్.. ఈమె సోషల్ మీడియాలో పలు రకాల డ్యాన్స్ వీడియోలు మనకు కనిపిస్తాయి..లావణ్యకు ఆల్రెడీ పెళ్లయింది కూడా.. తన భర్తతో ఉన్న వీడియోలు, ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ప్రేమ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.. ఆమె ఏమి పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి..
Also Read : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..అవే స్పెషల్…
లావణ్య రెమ్యూనరేషన్..?
సినిమాలలో నటిస్తున్న వారి కన్నా సీరియల్ లో నటిస్తున్న నటులకు రెమ్యూనిరేషన్ ఎక్కువగానే వస్తుందన్న విషయం తెలిసిందే. ఈ మధ్య సినీ హీరోయిన్లు బుల్లితెర పై సందడి చేస్తున్నారు.. సీనియర్ హీరోయిన్లు ఎక్కువగా సీరియల్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. నెలంతా సీరియల్ షూటింగ్ ఉండడం వల్ల బాగా సంపాదిస్తున్నారు.. ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమ బాగానే సంపాదిస్తుంది. ఒక్క రోజుకు 25 వేలు అంటే నెలలో 25 రోజులు వరకు షూటింగ్ ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే లక్షలు సంపాదిస్తుంది.. ఈమె తెలుగులో మాత్రమే కాదు.. అటు కన్నడలో కూడా సినిమాలు చేసింది. సీరియల్స్ చేస్తు బిజీగా ఉంటుంది.. కన్నడలో ఎక్కువగా సీరియల్స్ లలో నటించింది. ఆమె డ్యాన్స్ టాలెంట్ వల్ల తెలుగులో ఈ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.. ఒక్క సీరియల్ తో బాగా పాపులర్ అయ్యింది. నెక్స్ట్ ఏ సీరియల్ తో వస్తుందో చూడాలి..