E-Paper
Advertisement

Korean Drama OTT : స్నేహం నుంచి ప్రేమదాకా… చేతకాదు అన్నవాళ్ళే చప్పట్లు కొట్టేలా… కొరియన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే సిరీస్ మావా

Korean Drama OTT : స్నేహం నుంచి ప్రేమదాకా… చేతకాదు అన్నవాళ్ళే చప్పట్లు కొట్టేలా… కొరియన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే సిరీస్ మావా
Advertisement

Korean Drama OTT : కొరియన్ డ్రామాలను ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా కనబడుతున్నారు. ఎక్కడైనా మీటింగ్ కూర్చుంటే, ఏదో ఒక టైమ్ లో వీటి ప్రస్తావన తీసుకొస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు చెప్పుకునే సిరీస్. ఇది 2017లో విడుదలైన ఒక సూపర్ హిట్ కే డ్రామా. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా, తమ కలలను వదులుకోకుండా పోరాడే నలుగురు స్నేహితుల కథ ఇది. ఈ సీరీస్ లో బెస్ట్ ఫ్రెండ్స్, ప్రేమికులుగా మారడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అంతేకాకుండా ఇది మధ్యతరగతి యువత పడే కష్టాలను, వాళ్ళ ఆశలను ఈ సిరీస్ చాలా ఇన్స్పిరేషన్ గా చూపిస్తుంది. అందుకే ఈ సిరీస్ కొరియాలో సూపర్ హిట్ అయింది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ కొరియన్ రొమాంటిక్ డ్రామా సిరీస్ పేరు ‘ఫైట్ ఫర్ మై వే’ (Fight For My Way). ఇందులో పార్క్ సియో-జూన్, కిమ్ జి-వోన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ డ్రామాలో హీరోయిన్ కిమ్ జి-వోన్ చెప్పే క్యూట్ డైలాగ్స్ అప్పట్లో కొరియాలో పెద్ద సెన్సేషన్. సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు ఆ డైలాగ్స్‌ని రీక్రియేట్ చేశారు కూడా. ఈ సిరీస్ 2017లో KBS డ్రామా అవార్డ్స్లో ఎక్సలెంట్ యాక్టర్ వంటి అనేక అవార్డులను గెలుచుకుంది. 16 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం Netflix, Amazon Prime Video, MX Player వంటి ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. దీనికి ఐయండిబిలో ఎనిమిదికి పైగా రేటింగ్ కూడా ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డోంగ్ మాన్, చోయ్ ఏ రా చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. డోంగ్ మాన్ ఒకప్పుడు తైక్వాండో ఛాంపియన్ కావాలనుకుంటాడు, కానీ కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల ఆ కలని వదిలేసి సాదాసీదా ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు ఏ రా ఒక పెద్ద టీవీ యాంకర్ అవ్వాలని కలలు కంటుంది. కానీ సరైన అవకాశాలు లేక ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ సాధారణ లైఫ్ గడుపుతున్నా, తమ కలలను మాత్రం వదులుకోరు. ఒక దశలో డోంగ్ మాన్ మళ్ళీ ధైర్యం చేసి ఫైటర్‌గా రింగులోకి దిగుతాడు. అలాగే ఏ రా కూడా ఎన్ని అవమానాలు ఎదురైనా యాంకర్ అవ్వడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది.

ఈ ప్రయాణంలో కేవలం స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య తెలియకుండానే ప్రేమ చిగురిస్తుంది. ఇందులో మెయిన్ జోడీయే కాకుండా, మరో జంట కథ కూడా చాలా బాగుంటుంది. ఆరేళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణంలో వచ్చే చిన్నా చితకా గొడవలను చాలా ప్రాక్టికల్‌గా చూపించారు ఇందులో. చివరికి స్నేహితులుగా మొదలయ్యే ఈ నలుగురి ప్రయాణం ప్రేమలోకి దింపుతుంది. అలాగే ఒకరికొకరు అండగా నిలబడుతూ, ఓటమిని ఒప్పుకోకుండా తమ లక్ష్యాలను ఎలా చేరుకున్నారనేదే ఈ సిరీస్ మెయిన్ పాయింట్.

Advertisement

Read Also : సినిమా అంటే ఇదే మావా… ప్రేమించినందుకు 14 ఏళ్ళ జైలు… కట్ చేస్తే ఎన్నడూ చూడని రివేంజ్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×