Magical Places In India: సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది పిల్లాపాపలతో కలిసి టూర్స్ ప్లాన్ చేస్తారు. వేసవి తాపం నుంచి బయటపడేందుకు చాలా మంది హిల్ స్టేషన్స్ కు వెళ్తుంటారు. చల్లగా సేదతీరుతుంటారు. సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు భారత్ లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన కొన్ని ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ లేహ్
సాహస ప్రియులకు కచ్చితంగా నచ్చే ప్రాంతం లేహ్. ఇది కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్ లో ఉంది. ఇక్కడ అందమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఎటు చూసినా ఎత్తైన పర్వతాలు, కనువిందు చేసే సరస్సులు ఆకట్టుకుంటాయి. బైక్ రైడింగ్, ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి ఈ ప్రాంతం ఎంతో నచ్చుతుంది. ఈ ప్రాంతాన్ని కనీసం ఒక్కసారైనా చూడాల్సిందే!
⦿ హంపి
ఈ ప్రాంతాన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. కర్నాటకలోని హంపిని కచ్చితంగా చూడాల్సిందే. ఇక్కడి అద్బుతాలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. పురాతన దేవాలయాలు, స్మారక చిహ్నాలు కొలువుదీరాయి. భారతీయ సంస్కృతిని చాటే ఆలయాలు ఆకట్టుకుంటాయి. జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు కావాలంటే, హంపికి వెళ్లి రావాల్సిందే!
⦿ డార్జిలింగ్
పశ్చిమ బెంగాల్ లోని ఈ ప్రాంతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రకృతిని ఇష్టపడే వాళ్లు కచ్చితంగా ఈ ప్రాంతానికి వెళ్లాల్సిందే. ఈ అందమై హిల్ స్టేషన్ లో తేయాకు తోటలు కనువిందు చేస్తాయి. కాంచన్ జంగ్ అనే పర్వత శ్రేణులు ప్రకృతి రమణీయతతో ఆకట్టుకుంటాయి. ఓవైపు పచ్చని ప్రకృతి, మరోవైపు మంచు పర్వతాలు ఆహా అనిపిస్తాయి.
⦿ సిమ్లా
హిమాచల్ ప్రదేశ్ లో ఉండే సిమ్లా మంచు కొండలతో ఆహా అనిపిస్తుంది. ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. మంచుతో నిండిన దారులు, దేవదారు వృక్షాలు కనువిందు చేస్తాయి. ఎంత చూసినా తనువు తీరదు. సమ్మర్ లో ఇక్కడ మరింత ఆహ్లాదకరంగా ఉంది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఆహ్లాదంటా ఎంజాయ్ చేసి రావచ్చు.
⦿ ఖజురహో
మధ్యప్రదేశ్ లోని ఖజురహో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్న ప్రదేశం. ఇక్కడున్న దేవాలయాలు, ఆ దేవాలయాలపై ఉన్న కుడ్య చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఎంత సేపు చూసిన తనివి తీరదు. ఈ ప్రాంతాన్ని కూడా యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. ఏ ఆలయం చూసిన అద్భుతమైన శిల్పాలు ఆహా అనిపిస్తుంది. వీటి గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. కళ్లతో చూస్తేనే వీటి అందం ఏంటో తెలుస్తుంది.
⦿ రన్ ఆఫ్ కచ్
ఈ ప్రాంతం గుజరాత్ లో ఉంటుంది. ఈ ప్రదేశం అంతా తెల్లని ఉప్పుతో నిండిపోయి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఉప్పు ఎడారి అని కూడా పిలుస్తారు. ఇక్కడి సంప్రదాయాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడి సంస్కృతి అద్భుతంగా ఉంటుంది. సంగీతం, నృత్యం కనువిందు చేస్తాయి. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన ప్రాంతాల్లో కచ్ కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం సమ్మర్ ఈ ప్రాంతాలను సందర్శించే ప్రయత్నం చేయండి.
Read Also: తిరుమల శ్రీవారి గురించి 10 ఆసక్తికర విషయాలు, తెలిస్తే ఆశ్చర్యపోతారు!