E-Paper
Advertisement

యాంగ్రీ బర్డ్ బాస్ తో లేడీ ఎంప్లాయ్ లవ్ స్టోరీ… ఎంగేజింగ్ కొరియన్ రోమ్ కామ్ సిరీస్

యాంగ్రీ బర్డ్ బాస్ తో లేడీ ఎంప్లాయ్ లవ్ స్టోరీ… ఎంగేజింగ్ కొరియన్ రోమ్ కామ్ సిరీస్
Advertisement

Korean Romantic Comedy : ఆఫీసు కల్చర్ పై వచ్చే సినిమాలు, సిరీస్ లు ఆడియన్స్ ను, ముఖ్యంగా యూత్ ను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. ఇక ఇదే జానర్లో కొరియన్ కథలు వస్తే ఆ క్రేజ్ మరింత పెరుగుతుంది. అలాంటి సిరీస్ లను ఇష్టపడే ప్రేక్షకుల కోసమే ఓ అద్భుతమైన కొరియన్ డ్రామా ఓటీటీలో సందడి చేస్తోంది. ఆ కొరియన్ ఆఫీస్ రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్ పేరే ‘సీ యూ ఎట్ వర్క్ టుమారో’ (See You at Work Tomorrow). మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథ ఏంటంటే ?

ఈ సిరీస్ ఆఫీస్ జీవితం, బాస్-ఉద్యోగిని సంబంధాలు, ప్రేమ, కామెడీ వంటి అంశాలను అద్భుతంగా అల్లారు. కథ అంతా కార్పొరేట్ ఆఫీస్ బ్యాక్‌డ్రాప్‌ లో సాగుతుంది. చా జి-యూన్ ఒక ప్రొడక్ట్ ప్లానర్‌ గా ఏడేళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తూ ఉంటుంది. ఆఫీస్ ఒత్తిడి, విఫలమైన ప్రేమకథల వల్ల ఆమె జీవితంపై, ఉద్యోగంపై పూర్తిగా విరక్తి చెందుతుంది. ఆఫీస్ అయిపోగానే డాట్ టైమ్‌ కి లాగ్ అవుట్ అవ్వడం, చికెన్ తింటూ బీర్ తాగడమే ఆమె జీవితంలో ఉన్న ఏకైక ఆనందంగా బతుకుతుంటుంది.

Advertisement

కాంగ్ సి-వూ ఈమె పని చేసే టీమ్‌ కే కొత్త బాస్‌ గా వస్తాడు. ఇతను చాలా కఠినంగా, రూల్స్ ప్రకారం నడుచుకునే పర్‌ఫెక్ట్ పర్సన్. ఎవరితోనూ కలవడు, నవ్వడు, క్షమాపణలు చెప్పడు. అందుకే ఆఫీసులో అందరూ ఇతనికి అత్యంత కోపిష్టి బాస్ అని పేరు పెడతారు. మొదట్లో ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణలు జరుగుతాయి. కానీ, బాస్ కఠినమైన మాటల వెనుక ఉన్న మంచి మనసును, బాధ్యతను చా జి-యూన్ నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది.

అయితే ఆఫీస్ రాజకీయాలు, వరుస తప్పులు, వ్యక్తిగత సమస్యల మధ్య నలిగిపోయే వీరిద్దరూ ఒకరికొకరు ఎలా అండగా నిలిచారు? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది ? ఇందులో టైమ్ లూప్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది ? అనేదే ఈ సిరీస్ ముఖ్య కథాంశం. కొరియన్ డ్రామాల్లోని క్లాసిక్ “కోపిష్టి బాస్ – అమాయక ఉద్యోగిని” అనే కాన్సెప్ట్‌ను చాలా వినోదాత్మకంగా, నేటి కాలపు ఆఫీస్ కల్చర్‌ కు అద్దం పట్టేలా ఈ సిరీస్‌ ను రూపొందించారు. సియో ఇన్-గుక్, పార్క్ జి-హ్యున్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. రొమాంటిక్ కామెడీ మూవీ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ ఈ సిరీస్. 12 ఎపిసోడ్ల ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. ‘సీ యూ ఎట్ వర్క్ టుమారో’ ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.తెలుగు ఆడియో లేదు, కానీ హిందీ, ఇంగ్లీష్ ఆడియోలతో సబ్‌టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also: ఆటో డ్రైవరును కలవడానికెళ్తే అపరిచిత వ్యక్తి ఎంట్రీ… కట్ చేస్తే గుండె గుభేల్మన్పించే ట్విస్ట్

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×