E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 2nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వెళ్లిన చలపతి, లక్ష్మీ

Brahmamudi Serial Today Episode July 2nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వెళ్లిన చలపతి, లక్ష్మీ
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు చీరలు ఐరన్‌ చేసుకుంటుంటే రాజు వెళ్లి తన షర్ట్‌ కూడా ఐరన్‌ చేయమని అడుగుతాడు. ఇందు చేయనని చెబితే రాజు అమ్మమ్మను అడుగుతానని వెళ్తుంటే.. ఇందు కోపంగా ఏంటి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నావా..? అంటే ఏదైనా చేస్తాను షర్ట్‌ ఐరన్‌ చేయకపోతే అమ్మమ్మ దగ్గరకు వెళ్తాను అని చెప్పగానే.. ఇందు సరే అయితే ఇటువ్వు చేస్తాను అని షర్ట్‌ తీసుకుంటుంది.. రాజు ఇదిగో నేను మంచినీళ్లు తాగి వచ్చేలోపు షర్ట్‌ మడత లేకుండా మల్లెపువ్వులా కనిపించాలి అంటూ ఆర్డర్‌ వేస్తూ.. వెళ్లిపోతాడు. ఇందు కోపంగా నన్నే బ్లాక్‌ మెయిల్‌ చేస్తావా..? చెప్తా నీ షర్ట్‌ సంగతి అంటూ ఐరన్‌ బాక్స్‌ బాగా వేడి చేసి షర్ట్‌ కాల్చేస్తుంది. రాజు వచ్చే టైంకు మంచి మడత పెట్టి టేబుల్‌ మీద పెడుతుంది. రాజు వచ్చి అప్పుడే చేశావా..? అంటూ షర్ట్‌ తీసి చూస్తాడు.

మొత్తం కాలిపోయి ఉండటంతో రాజు కోపంగా ఐరన్‌బాక్స్‌ బాక్స్‌ తీసుకుని నీకు వాతలు పెడతాను ఉండు అంటూ వెంటపడుతుంటే.. ఇందు పరుగెత్తుకుంటూ కిందకు వెళ్తుంది.  కింద హాల్లో అందరూ కూర్చుని ఉంటే ఇందు అందరి చుట్టూ తిరుగుతుంది. వెనకాలే రాజు పరుగెడుతుంటాడు. అపర్ణ ఏమైంది అని అడిగితే రాజు తన షర్ట్‌ చూపించి ఐరన్‌ చేయమంటే ఎలా కాల్చేసిందో చూడండి అమ్మమ్మ అంటాడు. నువ్వు చేసిన ఓవర్‌కు అది ఇంకా చాలా తక్కువే అంటుంది ఇందు. ఇంతలో రేఖ ఇంట్లోకి వస్తుంది. రాజు, ఇందు ఒకరి వెనక ఒకరు పరుగెడుతుంటే.. రేఖ, భ్రమరాంబతో వీళ్లు ఇప్పుడు ఇంత సంతోషంగా పరుగెడుతున్నారు కదా..? ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అంటూ చెప్తుంది. ఇంతలో రాజు, ఇందుపు పట్టుకుంటాడు. రాజు వదుల రాజు అంటూ అరుస్తుంటే.. స్వాతి వచ్చి బావ అక్క సారీ చెప్పే వరకు వదలకు అంటుంది. ఇంతలో అక్కడికి చలపతి, లక్ష్మీ వస్తారు. వాళ్లను చూసిన రాజు, ఇందు షాక్‌ అవుతారు. రేఖ మెల్లగా భ్రమరాంబతో వదిన వాళ్లే రాజు అమ్మానాన్న. ఇప్పుడు మొదలవుతుంది చూడు తుఫాను అంటుంది.

Advertisement

చలపతి, లక్ష్మీ ఇద్దరూ రాజు దగ్గరకు వెళ్తారు. నువ్వు ఇక్కడెందుకు ఉన్నావు అని అడుగుతారు. లాస్ట్‌ టైం వచ్చినప్పుడు మీరిద్దరూ బిజినెస్‌ చేస్తున్నాము అని చెప్పారు కదా..? బిజినెస్‌ చేస్తే ఇలా ఆడుతూపాడుతూ కేరింతలు కొడుతూ ఉండరు కదా..? ఈ అమ్మాయి నీకు బిజినెస్‌ పార్ట్‌నరా..? లేక లైఫ్‌ పార్ట్‌నరా..? అంటూ నిలదీయగానే.. రాజు, ఇందు షాక్‌ అవుతారు. ఇప్పటికైనా నిజం చెప్పరా నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా..? అంటూ చలపతి ప్రశ్నించగానే.. రాజు నాన్న అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం… అంటే ఇప్పుడే మాట్లాడాలి అంటాడు చలపతి. పక్కకు వెళ్లి మాట్లాడుకుందాం అని రాజు అంటే లేదు ఇక్కడే మాట్లాడాలి అంటాడు చలపతి. ఇందు అడ్డుపడుతుంటే.. మధ్యలో రావొద్దని చలపతి చెప్తాడు. నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా..? అని గట్టిగా అడిగితే రాజు చేసుకున్నాను నాన్న అంటాడు.. దీంతో చలపతి కోపంగా రాజును కొడతాడు. అందరూ షాక్‌ అవుతారు. రేఖ, భ్రమరాంబ హ్యాపీగా ఫీలవుతారు.

లక్ష్మీ ఎమోషనల్‌ అవుతుంది. మేము చనిపోయాము అనుకున్నావా..? అంటూ చలపతి ఎమోషనల్‌ అవుతూ.. జరిగిందేదో జరిగిపోయింది ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు.. ఈ గొప్పింటి సంబంధం మాకు వద్దురా..? నువ్వు అల్లుడిగా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఈ అమ్మాయితో నీకున్న బంధాన్ని తెంచేసుకో తనకు విడాకులు ఇచ్చేయ్‌ అంటూ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. అపర్ణ అడ్డుపడుతూ.. అలా మాట్లాడతారేంటండి.. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని.. మూడుముళ్ల బంధాన్ని తెంచేస్తారా… అంటూ ప్రశ్నించగానే.. సుభాష్‌ కూడా తిడతాడు. దీంతో చలపతి మరేం చేయమంటారు.. నిండునూరేళ్లు కలిసి ఉండమని ఆశీర్వదించమంటారా..? ఇరవై ఏళ్ల క్రితం మీ జీవితాల్లో ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయారా..? మీ కుంటుంబం మొత్తం ప్రమాదంలో చనిపోయారు కదా..? మీరేమో యాక్సిడెంట్‌ అంటున్నారు.. బయట వాళ్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు… మీ డబ్బున్న వాళ్లు ప్రేమ వస్తే నెత్తిన పెట్టుకుంటారు.. కోపం వస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు.. అంటూ బాధపడతాడు. తన కొడుకు ప్రాణాలతో ఉండాలంటే ఈ ఇంట్లో ఉండకూడదు అంటూ చెప్పగానే..

Advertisement

రేఖ ఓ వీళ్ల భయం ఇదా..? అని మనసులో అనుకుంటుంది. చలపతి రాజును తీసుకుని వెళ్లిపోతుంటే.. రేఖ, ఐశ్వర్య హ్యాపీగా నవ్వుకుంటారు. రాజుకు తాను ఇందుకు చేసిన ప్రామిస్‌ గుర్తుకు వచ్చి గుమ్మం దగ్గర ఆగిపోతాడు. చలపతి వెళ్దాం పదర అంటూ నేను రాను నాన్న అంటూ చేయి విదుల్చుతాడు. చలపతి, లక్ష్మీ భయంగా చూస్తుంటే.. రాజు తాను రాలేనని.. చెప్తాడు.  చలపతి, లక్ష్మీ తల్లీ, తండ్రిగా పిలుస్తున్నాం రమ్మని అడుగుతారు. దీంతో రాజు తాను మీ బిడ్డనే అయితే వస్తాను కానీ ఇప్పుడు ఇందు భర్తను జీవితాంతం తనకు తోడుగా ఉంటానని తాళి కట్టాను.. చెప్పండి నాన్న ఇది కరెక్ట్‌ కాదు కదా అనగానే.. చలపతి కోపంగా నువ్వు ఇంకేం మాట్లాడకుండా మాతే వచ్చేయ్‌ అంటే రాజు రాలేనని తన భార్యను ఇంటిని వదిలేసి తాను ఎక్కడికి రానని చెప్తాడు.

ఇంతలో రేఖ తన మాటలతో చలపతి, లక్ష్మీలను బెదిరిస్తుంది. దీంతో చలపతి, లక్ష్మీలు తమకు శృతి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఇంకాస్త భయపడుతుంటారు. చివరిగా తాము కావాలా..? ఈ ఆస్థి ఇల్లు కావాలా..? అంటూ ఆల్టిమేటం జారీ చేయగానే.. రాజు ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

నా సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. సందీప్ కిషన్ సంచలన పోస్ట్!

రూ.46 కోట్ల చెక్కు వివాదం… సీసీబీ విచారణకు హాజరైన రాధ!

Karthika Deepam 2 Serial Today Episode October 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: టిఫిన్ బండి నడిపేందుకు శివనారాయణ రెడీ – మాలిని గురించి జ్యోత్స్నకు నిజం తెలుస్తుందా..?             

Karthika Deepam 2 Serial Today Episode September 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి చుక్కలు చూపించిన దీప             

Karthika Deepam 2 Serial Today Episode September 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్స్నలను కెపేలో చూసిన దక్షిణమూర్తి        

ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి..చిరు శ్రీకాంత్ సినిమా నాని పై అప్డేట్!

Big Stories

Advertisement
×