OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అన్ని భాషల్లో ఈ సినిమాలు థియేటర్లలో, ఓటీటీ లో కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ కూడా, ఒక మర్డర్ కేసు చుట్టూ స్టోరీ తిరుగుతుంది. పోలీసులకు ఈ కేసు ఓ సవాలుగా మారుతుంది. స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే
ఆహా (Aha) లో
ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సీ సా’ (SeeSaw). 2025 లో రిలీజ్ అయిన ఈ మూవీకి గుణ సుబ్రమణ్యం దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 3, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో నటరాజన్ సుబ్రమణ్యం, నిషాంత్ రుస్సో, పదిన్ కుమార్, నిజల్గల్ రవి, జీవ రవి వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఒక ఇంట్లో జరిగిన హత్య చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ సస్పెన్స్, డ్రామా, ఒక సామాజిక సందేశంతో ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ మార్చి 14, 2025 నుండి ఆహా (Aha) తమిళ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
చెట్టిపాలయం పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఇన్‌స్పెక్టర్ ముగిలన్ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. కోయంబత్తూర్‌లోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త అధవన్ ఇంట్లో వారి పని మనిషి హత్యకు గురవుతాడు. అదే సమయంలో, అధవన్, అతని భార్య మాళవిక కూడా కనిపించకుండా పోతారు. ఈ రహస్యమైన కేసును ఛేదించే బాధ్యత ముగిలన్‌కు అప్పగించబడుతుంది. ముగిలన్ ఈ కేసును దర్యాప్తు ప్రారంభించినప్పుడు, మొదట్లో అతనికి అంతా అయోమయం గా అనిపిస్తుంది. ఆ తరువాత అతను అనేక రహస్యాలు, మోసాలతో కూడిన ఒక జటిలమైన విషయాన్ని కనుగొంటాడు. కథలో గత సంఘటనలు, ప్రస్తుత పరిణామాల మధ్య మార్పులు చూపిస్తూ, సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తుంది. అధవన్ గతంలో ఒక తెలివైన విద్యార్థి అని, అయితే తన తండ్రి మరణం తర్వాత మానసికంగా కుంగిపోయి, బైపోలార్ డిజార్డర్‌తో బాధపడ్డాడని తెలుస్తుంది.
అతని స్తిరత్వం లేని ప్రవర్తన అతనిపై అనేక అనుమానాలను రేకెత్తిస్తుంది. అయితే అతను నిజంగా హంతకుడా, లేక మరేదైనా రహస్యం ఉందా అనేది కథ ముందుకు సాగుతూ వెల్లడవుతుంది. ముగిలన్ ఈ కేసులోని అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, హత్య వెనుక ఉన్న నిజమైన నేరస్థుడిని కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఇన్‌స్పెక్టర్ ముగిలన్ ఈ కేసును కొలిక్కి తెస్తాడా ? అధవన్ పాత్ర ఇందులో ఎంత ? ఎందుకు అధవన్ దంపతులు కనిపించకుండా పోతారు? ఈవిషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఇన్‌స్పెక్టర్ ఇందులో ఇన్వెస్టిగేషన్ చేసే విధానం మెంటలెక్కిస్తుంది. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు, ఈ థ్రిల్లర్ మూవీని ఒకసారి ట్రై చేయండి.