Chalaki Chanti : జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వందల మందికి ఈ షో అన్నపూర్ణగా మారింది. కమెడియన్లు తమలోని నటనను ఈ షోలో బయటపెట్టి ఇప్పుడు చాలావరకు సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. కొంతమంది సినిమాల్లో కమెడియన్ గా నటిస్తే మరి కొంతమంది ఏకంగా సినిమాలనే తెరకెక్కిస్తున్నారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్న కమెడియన్లలో చలాకీ చంటి ఒకరు.. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉండి చిన్న చిన్న క్యారెక్టర్స్ సినిమాల్లో చేస్తూ వచ్చినా రాని గుర్తింపు జబర్దస్త్ తో వచ్చింది. ఆ తర్వాత యాంకర్ గా మారి కూడా పలు షోలు చేసాడు. సినిమాల్లో కమెడియన్ గా చేసాడు. అయితే గత కొన్నాళ్లుగా చలాకి చంటి సినిమాల్లో, షోలలో కనపడట్లేదు.. ఆయన ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకోవడానికి ఒక కారణం ఉందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో చలాకి చంటి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చంటి ఆ ఇంటర్వ్యూలో ఎలాంటి విషయాల గురించి షేర్ చేసుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చంటికి అనారోగ్య సమస్యలు..
గతంలో చంటి అనేక అనారోగ్య సమస్యలతో భాదపడిన సంగతి తెలిసిందే. హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ లో చేరాడు. ఆ తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో బాధపడిన చంటి ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్నాడు. ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత చంటి బయటకి వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు మాట్లాడాడు.. తనని ఇండస్ట్రీలో తొక్కేసారని ఆవేదన వ్యక్తం చేశాడు..
ఇంటర్వ్యూ బయటపడ్డ నిజాలు..
చలాకీ చంటి అంటే నాన్ స్టాప్ కామెడీ అని అందరికీ తెలిసిందే. సైలెంట్ గా కనిపిస్తూ కడుపుబ్బ నవ్వించడానికి పంచుల వర్షం కురిపిస్తుంటాడు. ఎన్నో సినిమాల్లో కమెడియన్గా నటించి పాపులర్ అయ్యాడు. అయితే అతనికి హార్ట్ ఎటాక్ రావడంతో తన జీవితం మొత్తం రివర్స్ అయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంటి బయట పెట్టాడు. ఆ ఇంటర్వ్యూలో చంటి మాట్లాడుతూ.. నేను హార్ట్ అటాక్ తో హాస్పిటల్ లో ఉంటే ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. ఎవరూ పలకరించలేదు కనీసం. కొంతమంది మాత్రం ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పారు అంతే. రియల్ లైఫ్ లో ఎవరూ హెల్ప్ చేయరు. డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో బతుకుతాము. డబ్బులు లేకపోతే ఎవరూ వచ్చి హెల్ప్ చేయరు. ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ ఇంతే. ఇండస్ట్రీలో ఉంటే ఏదో సంపాదించేస్తున్నారు అనుకుంటారు. కానీ మనకి ఎంతొస్తుంది అని ఎవరికీ తెలీదు.. మనము ఎవరి గురించి ఆలోచించకూడదు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరి దగ్గర నుంచి ఆశించకూడదు. అది ఫ్రెండ్ అయినా సరే డబ్బులు తీసుకోవడం మంచిది కాదు అని చంటి అంటున్నాడు.
Also Read :ప్రదీప్ జీవితంలో కష్టాలు..ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..
భగవంతుడు సాక్షిగా నాశనం అవుతారు..?
చలాకి చంటి కష్టాల్లో ఉంటే ఎవరూ హెల్ప్ చేయలేదని బాగా బాధపడినట్టు తెలుస్తుంది. చాన్నాళ్ల తర్వాత మళ్ళీ కోలుకొని బయటకు రావడంతో కొందరు ఆప్యాయంగా పలకరించారు. కొందరేమో నాకున్న పరిచయాలను అవకాశాలను లాక్కోవడమే కాదు.. నన్ను ఇండస్ట్రీలో తొక్కేయాలని కూడా చూశారు అంటూ సంచలన నిజాలను బయటపెట్టారు. నా జీవితాన్ని తలక్రిందులు చేసిన నలుగురు వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ బాగుపడరు ఇది నా శాపం అంటూ ఆ ఇంటర్వ్యూలో చంటి పేర్కొన్నాడు. నన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు భగవంతుడు సాక్షిగా నాశనం అయిపోతారు. నేను కట్టుకున్న బట్ట సాక్షిగా వాళ్లకి పుట్టగతులు ఉండవు. వాళ్లు నాశనం అయిన తర్వాతే నేను చనిపోతాను ఇది నా శాపం అంటూ చంటి గుండెల్లోని బాధను బయటపెట్టాడు. ఈ వీడియో యూట్యూబ్లో వైరల్ అవ్వడంతో వీడియోని చూసి నాకు చాలామంది చంటి మనసులో ఎంత బాధను పెట్టుకున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఇక ఈమధ్య బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తున్న చంటి సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంటున్నాడు.