E-Paper
Advertisement

బొమ్మను నిజమైన పిల్లాడిలా చూసుకునే పేరెంట్స్… వింత నర్స్ ఎంట్రీతో మతిపోగొట్టే క్లైమాక్స్

బొమ్మను నిజమైన పిల్లాడిలా చూసుకునే పేరెంట్స్… వింత నర్స్ ఎంట్రీతో మతిపోగొట్టే క్లైమాక్స్
Advertisement

Thriller Series : పిల్లలను పేరెంట్స్ ఎంత ప్రేమిస్తారో ప్రత్యేకంగా వర్ణన అక్కర్లేదు. కానీ వాళ్ళకు జరగరానిది ఏదైనా జరిగితే తల్లిదండ్రుల శోకం, బాధ వర్ణనాతీతం. కొంతమంది అయితే జీవితాంతం దాని నుంచి కోలుకోలేరు. మరికొంత మంది మాత్రం ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి వేరే దారులు వెతుకుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కూడా అచ్చం ఇలాగే జరుగుతుంది. కానీ వీళ్ళు విచిత్రంగా ఒక బొమ్మను తమ కొడుకుగా ఫీల్ అవుతారు. ఈ సిరీస్ పేరు ‘సర్వెంట్’ (Servant). 2019లో వచ్చిన ఈ సిరీస్ ఆపిల్ టీవీ ప్లస్ (Apple TV+)లో అందుబాటులో ఉంది. ఈ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ సిరీస్ స్టోరీ ఏంటి ? అన్న విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఫిలడెల్ఫియాలో ఉండే ఒక దంపతుల జీవితంలో జరిగిన ఒక ఘోరమైన ప్రమాదంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత వారి ఇంట్లోకి వచ్చిన ఒక వింత ఆయా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. డోరతీ టర్నర్ ఒక టీవీ రిపోర్టర్, ఆమె భర్త సీన్ టర్నర్ ప్రొఫెషనల్ చెఫ్. వారికి పుట్టిన 13 వారాల కొడుకు ‘జెరిఖో’ ఒక ఘోరమైన ప్రమాదంలో చనిపోతాడు. ఆ బాధను తట్టుకోలేక డోరతీ తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతుంది. దాంతో ఆమెకు చికిత్సగా వైద్యులు ‘రీబోర్న్ డాల్’ అనే ఒక బొమ్మను ఇస్తారు. డోరతీ ఆ బొమ్మనే తన అసలైన కొడుకుగా నమ్ముతూ, దానికి స్నానం చేయించడం, పాలు పట్టడం వంటివి చేస్తుంటుంది.

Advertisement

ఇక్కడే ఆయా ఎంట్రీ ఇస్తుంది. డోరతీ ఆ బొమ్మను చూసుకోవడానికి లీన్ గ్రేసన్ అనే ఒక అమాయకపు పల్లెటూరి అమ్మాయిని ఆయాగా ఉద్యోగంలోకి తీసుకుంటుంది. భర్త సీన్, డోరతీ తమ్ముడు జూలియన్ లకు ఆ బొమ్మ కేవలం ఒక థెరపీ మాత్రమే. కానీ ఆశ్చర్యకరంగా, లీన్ కూడా ఆ బొమ్మను ఒక బతికున్న నిజమైన బాబులాగే చూసుకోవడం మొదలు పెడుతుంది. ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. బొమ్మ కాస్తా బాబుగా మారతాడు. ఒకరోజు భర్త సీన్ గదిలోకి వెళ్లి చూసేసరికి… ఊయలలో ఉన్న బొమ్మ స్థానంలో నిజమైన, ప్రాణమున్న ఒక పసిబాబు ఏడుస్తూ కనిపిస్తాడు. సీన్ షాక్‌కు గురవుతాడు.

డోరతీ మాత్రం అది తన సొంత కొడుకేనని మామూలుగానే ఉంటుంది. ఈ బాబు ఎక్కడి నుండి వచ్చాడు ? లీన్ ఎవరైనా బాబును కిడ్నాప్ చేసి తెచ్చిందా ? లేదా లీన్‌కు ఏవైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా ? అనే మిస్టరీ మొదలవుతుంది. అయిత లీన్ ఒక సాధారణ అమ్మాయి కాదని, ఆమె ఒక వింతైన మత తెగ ‘చర్చ్ ఆఫ్ ది లెస్సర్ సెయింట్స్’ నుండి పారిపోయి వచ్చిందని తెలుస్తుంది. ఆ తెగలోని వారికి చనిపోయిన వారిని బతికించే శక్తులు ఉంటాయని నమ్ముతారు.

Advertisement

లీన్ ఆ తెగ నియమాలను ఉల్లంఘించి, డోరతీపై ఉన్న ఇష్టంతో ఆ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఆ కల్ట్ లీడర్లు లీన్‌ను తిరిగి తీసుకువెళ్లడానికి ఆ ఇంటిపై రకరకాల దాడులు చేస్తుంటారు. ఆ ఇంట్లో వింత వింత సంఘటనలు, చీడపురుగులు రావడం, ఇల్లు కుంగిపోవడం వంటివి జరుగుతుంటాయి. మొత్తం 4 సీజన్లుగా సాగే ఈ సిరీస్ ముగింపులో… లీన్ శక్తులు పెరిగాక ఆమె ఏమవుతుంది ? లీన్ వల్ల ఆ కుటుంబానికి జరుగుతున్న నష్టం ఏంటి ? మెంటలెక్కించే ఆ షాకింగ్ క్లైమాక్స్ ఏంటి ? అన్నది సిరీస్ లో చూడాల్సిందే.

Read Also : ఆ పని చేసే అమ్మాయిలంతా మిస్సింగ్… సీట్ ఎడ్జ్ కొరియన్ సైకో థ్రిల్లర్

Tags

Related News

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సందడి.. ఆ రెండు మస్ట్ వాచ్..!

10 ఏళ్లలో 55 బదిలీలు… చివరికి ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా వదలని కానిస్టేబుల్ కథ

పైలెట్ కావాల్సిన కుర్రాడు రెడ్ లైట్ ఏరియాలో ప్రేమంటూ… ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే

పేదలకు నరకం… ధనవంతులకు స్వర్గం ఈ రైలు… లైఫ్ లో మరచిపోలేని థ్రిల్లిచ్చే సర్వైవల్ థ్రిల్లర్

కబడ్డీ నుంచి క్రైమ్ వరల్డ్‌లోకి… స్పోర్ట్స్ మూవీ కాదు పక్కా రా యాక్షన్ థ్రిల్లర్

కోరుకున్న వాడిని దక్కించుకోవడానికి ఇవేం మెంటల్ పనులు… ‘అబ్సెషన్’ చూసి ఆగమైనోళ్ల కోసమే ఈ థ్రిల్లర్ సిరీస్

పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుల జీవితం… కానీ ఈ అమ్మాయి చేసిన పని తెలిస్తే దిమాక్ కరాబ్

తల్లి కావాలనే కోరిక… చివరికి బిడ్డ కోసం ఆమె చేసిన పని తెలిస్తే షాక్

Big Stories

Advertisement
×