Korean Crime Thriller : ఓటిటిలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కోసం వెతుకుతున్నారా ? అయితే ఈ క్రేజీ కొరియన్ నియో- నాయిర్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘The Chaser Movie 2008’ మీకోసమే. రియల్ లైఫ్ లో కొరియా లో జరిగిన సీరియల్ కిల్లర్ ఉదంతం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కొరియాలోనె అత్యంత పాపులర్ అయిన ఈ సినిమాకు నా హాంగ్ జిన్ దర్శకత్వం వహించారు. రెండు గంటల 40 నిమిషాల రన్ టైం ఉన్న ఈ సినిమాకి ఐఎమ్డిబిలో 7.8 రేటింగ్ ఉండడం విశేషం. మరి ఈ ఇంట్రెస్టింగ్ కొరియర్ థ్రిల్లర్ ను ఏ ఓటిటిలో చూడొచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…
సినిమా మొదట్లోనే జూంగ్ హో అనే అవినీతి పోలీస్ అధికారిని చూపిస్తారు. ఉద్యోగం పోవడంతో అతను కాల్ గర్ల్స్ ఏజెంట్ గా మారతాడు. అతను నడిపే నెట్వర్క్ లోని కొందరు అమ్మాయిలు అప్పులు తీర్చకుండా, ఒకరి తర్వాత ఒకరు మాయం అయిపోతుంటారు. అయితే వాళ్లంతా డబ్బులు ఇవ్వకుండా పారిపోయారని జూంగ్ హో అనుకుంటారు. ఓ రోజు మీ జిన్ అనే అమ్మాయిని ఒక కస్టమర్ దగ్గరికి పంపిస్తాడు. గతంలో మాయమైన అమ్మాయిలు అందరినీ బుక్ చేసిన ఫోన్ నెంబర్, ఈ కస్టమర్ ఫోన్ నెంబర్ చివరి అంకెలు ఒక్కటే అన్న విషయాన్ని జూంగ్ కనిపెడతాడు. ఆ నెంబర్ 4885.
ఆ నెంబర్ ఆధారంగా జూంగ్ కిల్లర్ ను వెతుకుతాడు. అయితే అనుకోకుండా ఓ రోడ్డు ప్రమాదంలో ఆ కస్టమర్ ఇతనికి తారసపడతాడు. అతనిపై అనుమానం వచ్చిన జూంగ్ గొడవ మొదలు పెడతాడు. దీంతో పోలీసులు ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కి తరలిస్తారు. కానీ పోలీస్ స్టేషన్లో జి-యంగ్ చాలా కూల్ గా తాను ఆ అమ్మాయిలను పారిపోయేలా చేయలేదని, అందరిని దారుణంగా చంపేశానని చెప్పి షాక్ ఇస్తాడు. అంతేకాదు మీ జిన్ కూడా తన ఇంట్లోనే బందీగా ఉందని, ఆమె ఇంకా బతికే ఉండి ఉండే ఛాన్స్ ఉందని చెప్తాడు. పోలీసులు జి యంగ్ చెప్పేది నిజమేనా అని ఆధారాల కోసం వెతకడం మొదలు పెడతారు.
అయితే ట్విస్ట్ ఏంటంటే అతను తన ఇల్లు ఎక్కడ ఉంది అనే విషయాన్ని పోలీసులకు చెప్పడు. దీంతో ఇంకోవైపు పొలిటికల్ ప్రెజర్ పెరుగుతుంది. సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల పోలీసులు జి యంగును 12 గంటల్లోనే వదిలేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జి-యంగ్ కాళ్ళూ చేతులు కట్టేసి పడేసిన మీ జిన్ ఎలాగో తాళ్ళూడబీకి, ఆ రూమ్ నుంచి బయట పడుతుంది. గాయాలతో ఉన్న ఆమె సమీపంలోని ఒక చిన్న కిరాణా షాప్ లో దాక్కుని పోలీసుల హెల్ప్ అడుగుతుంది.
ఇక్కడే ఘోరమైన ట్విస్ట్ వస్తుంది. స్టేషన్ నుంచి విడుదలైన జి యంగ్ సిగరెట్ కొనడానికి అనుకోకుండా అదే షాప్ లోకి వస్తాడు. అయితే ఆ షాప్ యజమాని అసలు విషయం తెలియకపోవడంతో ఇక్కడో అమ్మాయి ప్రాణభయంతో దాక్కుంది. పోలీసులను పిలుస్తారా అని అదే కిల్లర్ తో చెప్తాడు. మరి ఆ కిల్లర్ మీ జిన్ని ఏం చేశాడు ? పోలీసులు కిల్లర్ స్థావరాన్ని కనిపెట్టగలిగారా ? చివరికి క్లైమాక్స్ ఎలా టర్న్ తీసుకుంది ? అన్నది ఈ మూవీ స్టోరీ. ఈ సినిమా ను ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.
Read Also : తలలు తెగిపడే శవాలు… పోలీసులకు చెమటలు పట్టించే సైకో కిల్లర్